🙏🏽ఓం నమః శివాయ హర హర మహాదేవ 🙏🏽🌹
నిత్య శుభంకరుడు మంగళకరుడు త్రినేత్రుడు పరమశివుడు🙏🏽🌹
పరమేశ్వరున్ని ఇలా దర్శించాలి🙏🏽🌹
శివాలయంలో ప్రవేశించేటప్పుడు స్వామికి కుడివైపుగా అంటే మన ఎడమ చేతి వైపుగా ప్రవేశించాలి. ఇలా ప్రవేశిస్తూ స్వామికి ముందుగా నాలుగు నమస్సులు సమర్పించాలి స్వామి ఎదురుగా ఎప్పుడు వెళ్ళకూడదు స్వామి తీవ్రమైన కోపముతో ధనసుకు బాణం సందించి మూడో కంటితో ఎదురుగా చూస్తూ ఉంటాడు స్వామివారి ఆ దృష్టిని నందీశ్వరుడు మాత్రమే తట్టుకుంటాడు అందుకే నందిలేని శివాలయం ఉండదు మొదటిగా శివునికి సమర్పించే నాలుగు సమస్సులను గురించి నమకం ఇలా చెప్పింది🙏🏽🌹
నమస్తే రుద్ర మన్యవే
ఉతోత ఇషవే నమః
నమస్తేఅస్తు ధన్వనే
బాహుభ్యా ముతతే నమః ,🙏🏽🌹
మొదట స్వామి నీ కోపానికి నమస్కారం అనాలి వెంటనే స్వామి కోపం తొలుతుంది
స్వామి నీ బాణానికి దండం అన్నది రెండో నమస్కృతి అప్పుడు ఎక్కు పెట్టిన బాణం కింద పడిపోతుంది🙏🏽🌹
మూడోసారి స్వామి నీ ధనస్సుకు నమస్కారం అనాలి. స్వామి చేతిలోని వింటికొప్పు నెమ్మదిగా తగిలినా చాలు బ్రహ్మాండం కూడా పిండి అయిపోతుంది అటువంటి ధనస్సుకు నమస్కారం అన్నప్పుడు ఆయన చేతిలోని విల్లు కూడా తొలగిపోతుంది శరణం అంటే విల్లు కూడా ఏమీ చేయకూడదు అయినా స్వామి బాహులు చాపే ఉంటాయి అవి హిరణ్యవాహులు దృఢమైన బంగారమే ఆ చేతులు ఆ చేతుల మీదుగా గాలి వచ్చినా చాలు శత్రువులు పారిపోవాల్సిందే🙏🏽🌹
అందుకే నాలుగో సారీ స్వామీ ఏక్కుపెట్టి ఉన్న నీ చేతిలకు నమస్కారం అనాలి అంటే స్వామి చేతులు వాలిపోతాయి స్వామి ప్రసన్నడైపోతాడు అయినా వెంటనే మనం గర్భగుడిలోకి వెళ్ళిపోకూడదు🙏🏽🌹 మహాదేవ దర్శనం మీద సర్వహక్కులు నందీశ్వరుడు అందుకని నంది వద్ద వంగి ఎడమ చేతి చూపుడు వేలు బొటనవేలుతో నంది రెండు కొమ్ములు పట్టుకోవాలి కుడి చేతితో స్వామి అండాలు నిమురుతూ కొమ్ములు మధ్య నుండి శివలింగం చూడాలి🙏🏽🌹
శృంగ మధ్యే శివం దృష్ట్యా పునర్జన్మ న విద్యేతే
అంటుంది శైవాగమం అలా చూడటం వల్ల తిరిగి జన్మ ఎత్తాల్సిన అవసరం లేదట అయితే ఆ తర్వాత కూడా మనసు ధర్మబద్ధంగానే ఉండాలి కానీ చేసిన పుణ్య పాప కర్మలు ఉన్నంతవరకు తిరిగి తిరిగి జన్మించటం తప్పదు కదా అందుకే ఓ మంత్రం ఉచ్చరించమన్నారు దాన్ని గోప్యంగా చెప్పారు పెద్దలు
🙏🏽🌹
సాంతం యాంతం త్రివారం ప్రణవనే సహితమ్ అంటూ సవర్ణంలో చివరగా హ ఉంటుంది య వర్ణంలో రెండో అక్షరం ర ఆ రెండిటికీ ముందు ఓంకారాన్ని చేర్చాలి ఓం హర ఓం హర ఓం హర అని మూడుసార్లు పలకాలి శృంగమధ్యంలో నుండి శివున్ని చూస్తే పుణ్య పాపకర్మలన్నీ ఆహరుడు తీసుకొని మనకు జన్మరహిత్యం ఇస్తాడు అంతేకాదు ఈ విధంగా శివ దర్శనం చేసిన వారికి మూడు వేదాలు ఏడు కోట్ల మహామంత్రాలు వశమవుతాయి🙏🏽🌹
ఆ మంత్రం జపించిన వారు అంత్యంలో పరమశివునిలో ఐక్యమవుతారు అయితే ఈ మంత్రాన్ని ఎవరికి వారే మనసులో జపించుకోవాలి శివాలయములో ప్రదోషములో ఈ మంత్రాన్ని నిత్యం జపిస్తూ ఉంటే శని కుజాది గ్రహదోషాలు సంసారంలో కలతలు అభివృద్ధిని అడ్డుకునే ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి ఇది సత్యం ఇలా చేసి నందికి ఈ శ్లోకం చదివి నమస్కరించాలి🙏🏽🌹
నందీశ్వర నమోస్తుభ్యం సామానందా ప్రదాయక
మహాదేవస్య సేవాద అనుగ్రహం దాతు మహర్షి 🙏🏽🌹
ఓ నందిసా శివునికి ఆనందం ఇచ్చేవాడా శివున్ని సేవించుకోవడానికి ...గర్భగుడిలోకి వెళ్లడానికి అనుమతినివ్యు ఇదే నీకు నమస్కారం ఇంత వినయం గా ప్రార్థించాలి నంది మనల్ని లోపలికి వెళ్ళనిస్తాడు అప్పుడే శివుడు అనుగ్రహిస్తాడు🙏🏽🌹
ఓం నమః శివాయ హర హర మహాదేవ 🌹🙏🏿