గురుగ్రహ దోష నివారణకు హయగ్రీవస్తోత్రం............!!

P Madhav Kumar

 గురుగ్రహ దోష నివారణకు హయగ్రీవస్తోత్రం............!!


జాతకంలో గురుగ్రహ దోషం ఉన్నవారు 

ప్రతిరోజు హయగ్రీవ స్తోత్రం చదివితే గురుగ్రహ 

అనుగ్రహం కలుగుతుంది.

భక్తి బావనలు..

ఉన్నత విద్య..

విదేశి విద్య..

కలగాలంటే గురుగ్రహ అనుగ్రహం ఉండాలి.


గురుగ్రహానికి అధిదేవత హయగ్రీవుడు.

సకల విద్యాధి దేవతయైన శ్రీమన్నారాయణుడు ‘హయగ్రీవుని’గా అవతరించాడు.


సరస్వతీదేవి, వేదవ్యాసుడు హయగ్రీవుని నుండి విద్యాశక్తిని సముపార్జించారని ‘హయగ్రీవ స్తోత్రం’లో దేశికాచార్యులు పేర్కొన్నారు.

హయగ్రీవోపాసన వాక్‌శక్తిని, విద్యాశక్తిని, జ్ఞానశక్తిని సిద్ధింపచేస్తుంది.


జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్..

ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే..!!


జ్ఞానం, ఆనందం, మూర్త్భీవించిన దైవస్వరూపం హయగ్రీవుడు. 

నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వవిద్యలకు ఆధారభూతమైన విద్యాధిదేవత హయగ్రీవునకు నమస్కారము.


హయగ్రీవుని పూజించడంవల్ల విద్య, ఐశ్వర్యం, అధికారం, ఆయువు మొదలైనవన్నీ లభిస్తాయి. విద్యార్థులు హయగ్రీవుని పూజించడంవల్ల చదువు 

బాగా వస్తుంది.

పిల్లలున్న ఇంట హయగ్రీవ పూజ పిల్లలకు 

విద్యాటంకాలు తొలగించి, ఉన్నత విద్యను అందిస్తుంది.


హయగ్రీవస్తోత్రం....

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం |

నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః||


హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ |

తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్మా ప్రవాహవత్||


హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోధ్వనిః |

వి శోభతే చ వైకుంఠ కవాటోద్ఘాటన ధ్వనిః||


ఫలశ్రుతి :

శ్లోకత్రయ మిదం దివ్యం హయగ్రీవ పదాంకితం |

వాదిరాజయత్రిప్రోక్తం పఠతాం సంపదాంప్రదం||



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat