"అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ" - చక్కటి వివరణ

P Madhav Kumar
అన్యధా శరణం నాస్తి
ఒకా నొక పండితుడు ఒక సంపన్నుని ఇంటియందు భాగవత ప్రవచనం చేస్తున్నారు.. అదే సమయంలో ఒక దొంగ ఆ ఇంట్లోకి ప్రవేశించి, ఒక మూల దాక్కున్నాడు. సరిగ్గా అదే సమయానికి ఆ పండితుడు చిన్ని కృష్ణుని గురించి చెప్తున్నారు.. భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల వర్ణన జరుగుతోంది. తల్లి యశోద, గారాల తనయుడు అయిన కృష్ణుడికి ఏమి నగలు వేసి పంపించేదో అని వివరించి చెప్తున్నారు.
ఆ రోజు ఒక దొంగ దోపిడీ కోసం ఇంట్లోకి ప్రవేశించగానే బంగారం, నగలు అనేమాటలు వినపడేసరికి ఆ దొంగ చాలా ఉత్సాహంగా ఆ బ్రాహ్మణుడు చెప్పే మాటల్ని వింటున్నాడు. అది వింటూ ఎంతలా లీనమయ్యాడంటే.. భాగవత ప్రవచనం పూర్తి అయ్యేదాకా ఉండి, బాల కృష్ణుడు కనిపిస్తే ఆ నగలు దొంగలిద్దాము అనుకునేంతగా లీనమయి వేచి చూస్తున్నాడు.. అలా బంగారు నగల గురించి ఆలోచిస్తూ, అసలా కృష్ణుడి జాడ పండితుడికి తెలుస్తుంది అనుకుని, దానికోసం ఆ పండితుడి వెంట పడ్డాడు. పండితుడు దొంగను చూసి భయపడి ‘నా దగ్గర ఏమీ లేదు ‘ అని చెప్తాడు.. అప్పుడు దొంగ, మీ దగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశ పడటంలేదు. మీరు ఇందాక వర్ణించి చెప్పారు కదా.. ఆ నగలు ధరించిన కృష్ణుడు ఎక్కడ ఉంటాడో చెప్పండి’ అని అడిగాడు..
అప్పుడు ఆ పండితుడు ఆలోచించి, బృందావనంలో యమునా నది తీరం దగ్గరకు రోజూ ఇద్దరు పిల్లలు వస్తారు. వారిలో ఒక పిల్లవాడు నల్ల మబ్బు రంగులో ఉండి , పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటాడు. ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు , తెల్లటి పట్టు వస్త్రము ధరించి ఉంటాడు. ఆ ఇద్దరిలో నల్ల మబ్బు ఛాయలో, పిల్లన గ్రోవి వాయిస్తూ ఉండే వాడే, నేను ఇందాక చెప్పిన కృష్ణుడు అని చెప్పి, ఆ దొంగ నుండి తప్పించుకుని వెళ్తాడు.. .
అయితే దొంగ పండితుడి మాట నమ్మి బృందావనానికి వెళ్తాడు. యమునా నది తీరం వద్ద కూర్చుని, ఆ ఇద్దరి పిల్లల రాక కోసం ఎదురు చూస్తుంటాడు.. ఇంతలో పిల్లన గ్రోవి వినిపిస్తుంది.. అటు పక్కాగా చుస్తే ఇద్దరు పిల్లలు వస్తు కనిపిస్తారు.. ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి, పిల్లల దగ్గరకు వెళ్తాడు దొంగ. ఆ బాల కృష్ణుడిని చూడగానే, దొంగ మనసులో ఆనందం కలిగి, అతని కళ్ళమ్మట నీళ్లు కారుతూ.. ఏ తల్లి కన్న బిడ్డో, ఇంత అందంగా ఉన్నాడు అని అనుకుంటాడు.. నగల సంగతి, దొంగతనం సంగతి మర్చిపోతాడు.. ఆ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు వస్తుంది…. తరువాత చూసుకుంటే ఆ దొంగ భుజం మీద నగలు నిండి ఉన్న ఒక మూట ఉంటుంది.. ఆ దొంగ అది తీసుకుని, ఆ పండితుడి దగ్గరకి వెళ్లి జరింగింది అంతా చెప్తాడు..
ఆ పండితుడు ఆనందబాష్పాలతో కృష్ణుడిని చూసిన చోటు, తనకు కూడా చూపించమని దొంగని అడుగుతాడు.. సరే అని ఇద్దరు కలిసి వెళ్లారు.. అలా ఇద్దరూ కలిసి ఆ చోటికి వెళ్ళగానే దొంగకి కనిపించిన బాల కృష్ణుడు, పండితుడికి కనిపించడు..
అప్పుడు ఆ పండితుడు బాధపడి, నిరాశతో కృష్ణుడిని నిలదీస్తాడు… ఒక దొంగని అనుగ్రహించావు కానీ కృష్ణా.. నాకు దర్శనం ఇవ్వవా.... అని అడుగుతాడు.. అప్ప్పుడు కృష్ణ భగవానుడు ఇలా అంటాడు.. నీవు భాగవత పురాణమును కేవలము ఒక కథగా మాత్రమే అనుకుని చదివావు , కాని , ఇతను నువ్వు చెప్పిన కథని, మాటలని మనస్ఫూర్తిగా నమ్మాడు. అదంతా నిజమే అని నాకోసమై వచ్చాడు.. అలా అపార నమ్మకం, సమర్పణ, శరణాగతి, ప్రేమ ఉన్న చోటే నేను ఉంటాను. అని చెప్తాడు.. 
దీన్నే 
"అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ" అని భాగవతంలో చెప్పబడింది..


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat