తల స్నానం చేసే వెళితే శరీరము మొత్తం శుచిగా ఉంచుకొని దర్శనం చేసుకున్నట్టు. మన నిత్య కృత్యాలతో మనసు ఎల్లప్పుడు అనేక విధాలుగా కామ, క్రోధ, లోభ, మదాలతో నిండి ఉంటుంది. ఆ మనసుని పవిత్రంగా, పరిశుద్ధంగా చేసుకొని వెళ్లే ఆధ్యాత్మిక శక్తి మనసుకు లేదు గనుక, కనీసం శరీరం మొత్తాన్ని శుభ్రపరుచుకొని దర్శించుకుంటున్నాము.
ఈ శరీరంలా మనుసును శుచిగా, నిర్మలంగా ఉండేలా చెయ్యమని అర్థమే పూర్తి స్నానము యొక్క భావము .