(🕉️మనిషి జీవితానికి ముడిపడే ప్రతిబింబాలు... *చదవండి జీవితాన్ని సార్ధకం చేసుకోండి!* 🕉️)
▪️ *#ఐకమత్యం అంటే* - మనం కుక్కమీద రాయి విసిరితే కుక్కపారిపోతుంది. అదే.. తేనెతుట్టి మీద విసిరితే మనమే పారిపోవాలి !_
♦️_ఇద్దరు కొట్టుకుంటే.. ఒక్కరే గెలుస్తారు. రాజీపడితే... ఇద్దరూ గెలుస్తారు !_
▪️_దేవుడికోసం తీర్ధాలు, పుణ్యక్షేత్రాలంటూ తిరుగుతావ్, ఆయనెక్కడోలేడు. *శ్వాస తీసుకుంటూ సృష్టితో నువ్వేసుకున్న 'లంకె'లోనేవున్నాడు*._
▪️_సృష్టంతా అద్భుతమే. అందులో నువ్వూ భాగమే. ఆ అద్భుతమే భగవానుడు. అది తెలుసుకుని దాన్ని అనుభవించు, ఆనందించు._
▪️_కష్టమొస్తే భగవంతుణ్ణి కొలుస్తావు. ఆయన నీకు రాబోయే కష్టాన్ని ఆపడు. *నిత్యం స్మరిస్తే కొండంత కష్టాన్ని గోరంత చేసి, సులువుగా దాటే శక్తి నీకిస్తాడు*. కష్టాలు కుంభవృష్టిలా నిన్ను ముంచేస్తే... నీకు గొడుగుపట్టి కాపాడతాడు... గుర్తుంచుకో !_
▪️_జ్ఞానం.. ఆలోచించి మాట్లాడుతుంది. *అజ్ఞానం.. మాట జారాక ఆలోచిస్తుంది*. అమాంతం అజ్ఞానం పోయి జ్ఞానంరాదు._
▪️_కొబ్బరిచెట్టు పెరిగేకొద్దీ పాతమట్టలు రాలిపోతాయి. *జ్ఞానం కలిగేకొద్దీ తనపర భేదాలు తొలగిపోతాయి._*
▪️_పుండు మానితే పొలుసు అదేపోతుంది. పుండు మానకుండానే పొలుసు పీకేస్తే… పుండు తీవ్రమై రక్తం కారుతుంది ! *జ్ఞానసిద్ధి అంచెలంచెలుగా కలగాలి. ఆత్రపడితే లాభంలేదు !_*
▪️_సముద్రమంత సమస్యొచ్చిందని దిగులుపడకు. *ఆకాశమంత అవకాశం కూడా వుంది*. తలెత్తి చూడు ముందు. నీపై నీకు నమ్మకం కావాలి._
▪️ *_నీపై నమ్మకం నీకుబలం*. నీపై అపనమ్మకం అవతలివారికి బలం !నీబలం ఎవరికీ తెలియకపోయినా నీవు బ్రతికేయవచ్చు.. నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు నిన్ను నిన్నుగా బ్రతకనివ్వరు !_
▪️_మరణం అంత మధురమైనదా ? ఒక్కసారి దాన్ని కలిసినవారు వదిలిపెట్టలేరు ?ప్రకృతికి కూడా అదంటే ఎంత పక్షపాతం ! *ప్రాణంపోయిన జీవుల్ని నీళ్ళలో తేలుస్తుంది. ప్రాణమున్న జీవుల్ని నీళ్ళలో ముంచుతుంది !_*
▪️_నీపరిసరాలనెంత శుభ్రంగా వుంచినా నీకు అనారోగ్యం రావచ్చు. *బుద్ధి అనే ఆసుపత్రిలో ఆలోచనలు అనే వైద్యుడు నీ రోగాలను తగ్గించగలడు*. వాటిని ఆరోగ్యంగా వుంచుకో._
▪️_వెంటరాని ఇంటిని, ఒంటిని రోజూ కడుగుతావ్.. *నీవెంట వచ్చే మనసునెప్పుడు కడుగుతావు* ?_
▪️_నిజాయితీపరులు సింహంలాంటి వాళ్ళు. సింహం కూర్చోటానికి సింహాసనమెందుకు ? అదెక్కడ కూర్చుంటే అదే సింహాసనం. *నిజమైన నిజాయితీపరులకు గుంపు అక్కర్లేదు !_*
▪️_ముని-మహర్షి-తపస్వి-యోగి.. వీరు వేరువేరు._
_మౌనంగావుండేవాడు ముని._
_నియమనిష్టలతో తపింపచేసుకునే వాడు తపస్వి._
_అతీంద్రియ శక్తుల్ని ఆకళింపు చేసుకున్నవాడు ఋషి._
_ధ్యానంలో మునిగి వుండేవాడు యోగి._
▪️_పండు తింటే అరిగిపోతుంది. తినకపోతే ఎండిపోతుంది. జీవితం నువ్వు ఖుషీగా గడిపినా, భయపడుతూ గడిపినా కరిగిపోతుంది !_
▪️_ఇప్పటిదాకా ఇతరుల కోసమే (నావాళ్ళనుకుంటూ) బతికేశావు. *ఇప్పటికైనా ఆరోగ్యంగా, ఆనందంగా నీకోసం నువ్వు బతుకు._*
▪️_వచ్చే జన్మలో నువ్వెవరో, ఎక్కడ, ఎలా పుడతావో, అసలు జన్మవుందో లేదో తెలీదు._
▪️_నువ్వు 'నావాళ్ళు నావాళ్ళు' అనుకుంటుంటే వాళ్ళు తర్వాత 'వాళ్ళవాళ్ళకోసమే' బతుకుతారు. నీకంటూ ఎవరూ ఉండరు. ఏమీ మిగలదు !_
▪️_అర్ధం చేసుకుంటే.. పుట్టిందగ్గర్నుంచీ- పోయేందుకే మన ప్రయాణం ! ఈమాత్రం దానికి పుట్టటమెందుకో తెలియదు. *తెలుసుకోటంలోనే వుంది కిటుకంతా.. అందుకే ఈ జీవితమంతా !_*
▪️_మరణం దగ్గరపడితేనే మహాసత్యాలు బోధపడ్తాయ్._
▪️_పని చేయటానికి పనిమనిషి దొరుకుతుంది. వంట చెయ్యటానికి వంటవాళ్ళు దొరుకుతారు. *రోగమొస్తే నీబదులు భరించటానికి ఎవరూ దొరకరు._*
▪️_వస్తువుపోతే దొరకచ్చు.. జీవితం పోతే మళ్ళీ దొరకదు తెరపడేరోజు ఏంతెలిసినా ప్రయోజనమేంటి ?_
▪️_పక్కనెంతమందున్నా,ఎంత సంపదున్నా ఏంటి ?_
_30 లక్షల కారైనా, 3 వేల సైకిలైనా రోడ్డు ఒకటే.. *పదంతస్తుల మేడైనా, పూరిగుడిసైనా వదిలేసే పోవాలి* !_
▪️_జనరల్ బోగీలో వెళ్ళినా, ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించినా స్టేషన్ రాగానే ఒకేసారి దిగిపోతారు !_
♦️ *_మానవులుగా బతకటం కాదు.._*
*_మానవత్వంతో బతకాలి !_*
🌹సర్వేజనాసుఖినోభవంతు! 🌹
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
హరిః ఓమ్.