నేల మీద కుర్చునేటప్పుడు కనీసం చిన్న గుడ్డ ముక్కెనా వేసుకుని కూర్చోవాలి. ఋషులు తపస్సు సమయాల్లోనూ, హోమాదిసమయాల్లోనూ కటికి నేలపై ఆసీనులవ్వరు. కనీసం పసుపు కలిపిన అక్షింతలైన వేసుకుని కార్యక్రమాలు జరిపిస్తారు. మానవుని శరీరంలో విద్యుత్తు ఉంటుంది. అదే మనల్ని నడిపిస్తుంది. భూమికి ఆకర్షణ శక్తి ఎక్కువ. దాంతో శరీరంలోని విద్యుత్తుని లాక్కుంటుంది. అలా జరగటం ద్వారా శరీరంలో శక్తి, యుక్తి సన్నగిల్లుతాయి. అందుకనే కటికి నేల మీద కూర్చుని భోజనం కానీ, నిద్ర కానీ, పూజ గానీ చేయరాదు.