శివుడిని మూర్తి రూపంలో కంటే లింగరూపంలో... ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలు విశేషంగా ఉంటాయి...

P Madhav Kumar
స్వామియే శరణమయ్యప్ప

పరమేశ్వరుడి విగ్రహాన్ని పూజించేవారికంటే... శివలింగారాధన చేసేవరిలో తెజస్సు...శక్తి అధికంగా ఉంటాయని... కృష్ణపరమాత్మ మహాభారతంలో చెప్తారు...

మనకు లోకంలో చాలా రకాల లింగాలు కనిపిస్తాయి...

లింగం అంటే గుర్తు... ప్రతిరూపం (Symbol) అని అర్దం...

అన్నిటియందు ఆ పరమశివుడు అంతర్యామిగా ఉన్నాడు...

ఈ సృష్టి అంతా లింగమే...అందుకే రుద్రం... ఈ జగత్తు అంతా వ్యాపించి ఉన్న ... శివతత్వాన్ని ప్రకటించింది...

కొండలు, పర్వతాలు, నదులు, శిలలు, మొక్కలు, చెట్లు ... 

ఇలా కదలనివాటిని స్థావరములు అంటారు... 

ఈ స్థావరములన్నీ శివస్వరూపం అంటున్నది శివ పురాణం...

అందుకే ఇవన్నీ స్థావర లింగాలు అంటున్నది శివ పురాణం...

మనం మొక్కలకు నీరు పోస్తే (ఏ చెట్టైనా కావచ్చు)...
అది కూడా శివార్చనగా భావించి... అనుగ్రహం ప్రసాదిస్తాడు... పరమశివుడు...

అట్లాగే ప్రకృతి వనరులను విచ్చలవీడిగా... దోచుకోవడం స్థావర లింగ రూపంలో ఉన్న... శివుడికి చేసే అపచారం అయితే... ప్రకృతి వనరులను సంరక్షించుకోవడం... అవసరమైనంత మేర... వృధా చేయకుండా వాడుకోవడం... శివుడికి ఇచ్చే గౌరవం...ఇంకా చెప్పాలంటే నీరు వృధా చేయడం... కూడా శివుడికి అపచారమే...

ఇది దీని కిందే వస్తుంది...

రెండవది జంగమ లింగం...

జంగమాలంటే కదిలేవి అని అర్దం...

జంతువులు, మనుష్యులు, పక్షులు, క్రిమికీటకాలు లాంటివి...

ఇవి కూడా శివుడి స్వరూపాలే...

వీటిని జంగమ లింగాలు / లింగం అంటారు...

ఆపదలో ఉన్నవారికి పవిత్ర భావనతో... ఏ ఉపకారం ఆశించకుండా చేసే సాయం... ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం... దైవభావంతో పెద్దలకు... దీనులకు సేవ చేయడం జంగం లింగానికి చేసే అర్చన...

ఇక ఇది చలికాలం... అనేకమంది చలికి వణుకుతూ... రోడలపై పడుకుంటారుఅటువంటి వారికి దుప్పట్లు పంచడం... లేని వారికి కాసింత అన్నం పెట్టడం... చదువు యందు ఆసక్తి ఉన్న పేద విద్యార్ధులకు పుస్తకాలు పంచిపెట్టడం... ఫీజు కట్టడం కూడా ఈ జంగమ లింగానికి ... అర్చన క్రిందే వస్తుంది...

మనకు శివ పూజ చేయాలన్న తపన ఉండాలి... కానీ... అందుకు అనేక మార్గాలు చూపించాడు మహాశివుడు

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat