కుటుంబంతో సహా..రమణాశ్రమానికి చేరుకున్నాక
'తన మనసును జయించారు భగవాన్ "అంటారు చలం.
"ఇప్పుడే విస్కీ త్రాగి వ్రాస్తున్నాను.అని మొదలు పెట్టి ' అరుణాచలం నుంచి తిరిగి రమ్మని ' శ్రీశ్రీ ' ఉత్తరం రాశారు...అయినా చలం కదల్లేదు.!
"విస్కీ కంటే గొప్ప మత్తు 'భగవాన్ ' సన్నిధి వలన
లభిస్తుంది "లభిస్తుందని...నువ్వే ఇక్కడకి రావల
సినదిగా తిరుగు జాబు వ్రాశారు చలం.తన జీవిత చివరివరకు చలం అరుణాచలంలో ఉండిపోయా
రు.తన నివాసానికి "రమణస్థాన్"అని పేరుపెట్టు
కున్నారు.!
*నేను…"..* నువ్వు " ఎవరో తెలుసుకుంటే
మహదానందమే అన్న భగవాన్ చింతన చలం
గారి తాత్వికలోక దర్శనానికి తెరతీసింది.
*భగవాన్ ' బోధనలు…
చలంగారి పై ప్రభావం..!!
లోకంలో గురుబోధ గొప్పది. ఆధ్యాత్మిక గురు బోధ
ఇంకా గొప్పది..అయితే గురుబోధ బాధలకు ఉపశ
మనమే కానీ....శాశ్వత పరిష్కారం కాదు. గురువు
దారి మాత్రమే చూపుతాడు.సాధనతో గమ్యానికి
చేరుకోవాల్సిన బాధ్యత మాత్రం మనదే...దానికి శరీరాన్ని కష్టపెట్టాలి.లౌకిక వాసనలకు దూరంగా వుండాలి.పరిసరాలు,ధ్వని, వాతావరణ కాలుష్యా
లకు ఎడంగా జరగాలి.మనసుకు పట్టిన జాడ్యాల్ని,
వికారాల కిలుంను వదిలించు కొని,మనసును తెల్ల
గా మల్లెపూవులా వుంచు కోవాలి..అప్పుడే మన పెద్దలు చెప్పినట్లు 'సాధనమున పనులు సమ
కూరుతాయి'.రమణులవారి బోధనలు ఫలితం
గా చలంగారు తనను తాను కష్టపెట్టుకున్నారు.
తనలోని…"నేను" గురించి తెలుసుకోడానికి నానాయాతనలు పడ్డారు.
*నేనెవరు ...? నువ్వెవరు. ?
ఈ రెండూ బోధపడితే మనిషి తన జన్మకు ఆన
వాళ్ళు,తన అస్తిత్వానికి మూలాలు తెలుసుకున్న
ట్లే..భగవాన్ ఆధ్యాత్మిక గురుబోధవల్ల మాత్రమే
ఈ రెండూ తెలుస్తాయి.
ఇవి తెలుసుకున్న రోజున మానవుడి ఆనందానికి అంతుండదు.అవధులుండవు. అనంతమైన ఈ జగత్తులో తాను పూసుకున్న లౌకిక భవబంధాల రంగువెలిసి పోతుంది కళ్ళకు కప్పిన మాయపొర తొలిగి….సత్యం తెలిసి పోతుంది.అప్పుడు విశ్వం
ఓ ఊయలవుతుంది .మనం అందులో పరుండే
పసి పాపగా మారిపోతాం..
ఇన్నాళ్ళు లోకంలో పెంచుకున్న స్వార్థపు రేఖలు
చెరిగిపోతాయి.భవబంధాల చిక్కుముడులు విడి
పోతాయి.మనం అనుభవించిన బాధలు,మానసిక
క్షోభ దూదిపింజలై ఎగిరిపోతాయి. మన ముందు
భూమ్యాకాశాలు కూడా పిల్లాడి చేతిలో ఆటవస్తు
వులుగా మారిపోతాయి.
చలం గారు భగవాన్ రమణుల వారిని గొప్ప
ఆధ్యాత్మిక గురువుగా భావించారు..సేవించారు.
*సత్య శ్రవణం :..!!
మనం ఏది విన్నా….దాని ప్రభావం సున్నితమైన మన మనస్సుపై బలంగా పడుతుంది.అందుకే…
ఏది పడితే అది వినకుండా..వినేటపుడు జాగ్రత్త
వహించాలి. మంచి మాత్రమే మనసుకు ' మైల' అంటకుండా చేస్తుంది.అందుకే మంచినిమాత్రమే వినాలి. ఎందుకంటే విశ్వంలో అదే సత్యం.నిత్యం.
ఈ సత్య వస్తువును గురించిన శ్రవణం రెండు రకాలని రమణుల వారు చెబుతారు.
*మొదటిది గురువు వివరించి చెప్పగా వినడం.
*రెండవది తనకుతానే ప్రశ్నించుకోవడం…
గురువు వివరించి చెబితే..అది ద్రాక్ష పాకం.తేలిగ్గా
తెలిసిపోతుంది......సులభంగా బోధ పడుతుంది.
రెండోది నారీకేళ పాకం..ఇది మనకు మనమే సాధిం
చుకోవాల్సోన మార్గం.ఇది కొంతకష్టం.తినగాతినగా
వేము తీయని అన్నట్లు..నిరంతర సాధనతో అభ్యా
సంతో సాధించుకోవాలి.అఖండమైన ' నేను ' గా తనయందే అన్వేషించి, సమాధానం కనుగొనాలి.
అయితే..ఈ రెండింటిలో ఏది గొప్పదంటే.. రెండో
మార్గమే గొప్పదంటారు రమణుల వారు..గురువు
దారి చూపుతాడు.. శిష్యుడు స్వయంగా ప్రయా
ణించి అమృతభాండాన్ని కనుగొనాలి.ఆ తర్వాత
అందుకొని,సేవించి అలా అలౌకమైన ఆత్మానందా
ను భూతిని పొందాలంటారు రమణుల వారు….
చలం గారు తన జీవిత చరమాంకం వరకు ఈ
ఆత్మానందానుభూతి కోసమే తపించారు.తపస్సు
చేశారు.
*"మిధ్య" అంటే ..?
"నేను " అని మీరంటున్నారే... ఆ " నేను "
ఎవరో తెలుసుకుంటే... ఆ తర్వాత మీకే తెలు
స్తుంది." అంటారు భగవాన్ రమణుల వారు.....
మనం " నేను " అనే భౌతిక ప్రపంచం లో ఉన్నాం.
గాడు నిద్రలో మాత్రం " నేను " ఎక్కడా కనబడదు.
'నేను ' అనేది పనిచేయదు.మనం నిద్రలో ఉన్న
పుడు నిద్రలోని 'నేనే' మెళుకువలోనూ ఉంటుంది.
అయితే వ్యత్యాసం నిద్రలోని నేను..... ఆలోచించే మనసుతో కలవడం లేదు మెలుకువలో కలుస్తోంది
అంతే...
*నీ నిజ స్వరూపం ఏది ?
నీ నిజం స్వరూపం ఏది? ఆలోచన తో కలిసి పోవడమా.?లేక కలగకుండా వేరుగా ఉండడమా?" ఇప్పుడు అంటే ...మెలుకువలో ఇలా చెప్తున్నావు మరి నిద్రలో ఇలా అనలేవు కదా పోనీ... నిద్రలో ' నేను' అని అనగలవా?".
*నిజానికి అనలేము.....
" రెండు అవస్థలలొను...నీవు ఉన్నావు.... అసలు ఉండుటనేది "ఆత్మ" లక్షణము... ఉన్నాను అను స్ఫురణను ...అనుభవిస్తూనే ఉన్నావు.. ఈ ఆత్మే నీ అసలు స్వరూపము…"..అంటారు భగవాన్ .
మరైతే..ఈ సత్యాన్ని తెలుసు కోవడానికైనా…
ఆలోచించాలి కదా? అన్న అనుమానం వస్తుంది.
అప్పుడెలా? అంటే….