శ్లో𝕝𝕝 వ్యాధస్యాచరణం ధ్రువస్య చ వయో విద్యా గజేన్ద్రస్య కా
కుబ్జాయాః కిము నామరూపమధికం కిం వా సుదామ్నో ధనం।
వంశః కో విదురస్య యాదవపతే రుగ్రస్య కిం పౌరుషం
భక్త్యా తుష్యతి కేవలం న చ గుణైః భక్తప్రియో మాధవః॥
*_… *శ్రీవత్సాఙ్కశ్రీసూక్తిః* …._*
తా𝕝𝕝 "గుహుడి నడవడి ఎట్టిది? ధ్రువుడి వయస్సు ఎంత? గజేంద్రుడి చదువెంత? కుబ్జ సౌందర్యమెట్టిది? కుచేలుడు ఎంతటి సంపన్నుడు? విదురుడి ఆభిజాత్యమెట్టిది? యాదవపతి ఉగ్రసేనుడెంతటి పౌరుషవంతుడు? - వీరందరి గుణదోషములెట్టివైననూ మాధవుడు వీరందరియందు ఎంతో ప్రీతిని చూపించెనుగదా! *భక్తప్రియుడైన మాధవుడు భక్తినే చూచును కానీ ఇతరగుణములను చూడడు*...."
🧘♂️🙏🪷🌻