*సుమంగళి స్త్రీలు నెత్తిన కుంకుమ లేకుండా ఎప్పుడు వుండకూడదు.*
*రెండు చేతులతో తల గీరుకోరాదు.*
*అయినదానికీ కానిదానికి ఎప్పుడు కంట నీరు పెట్టుకోరాదు*. *ఇది దారిద్ర్యమును తెచ్చిపెట్టును.*
*ఒక ఆకులో వడ్డించిన దానిని తీసి మరియొక ఆకులో వడ్డించ కూడదు.*
*ఇంటికి వచ్చిన సుమంగళి స్త్రీలకు పసుపు, కుంకుమ,* *తాంబూలాదులు విధిగా ఇచ్చి సత్కరించ వలెను.*
*గర్భిణి స్త్రీలు టెంకాయ పగులకొట్ట రాదు*.
*గర్భిణి నిమ్మకాయను కోసి దీపము వెలిగించ కూడదు*.
గర్భిణి స్త్రీలు గుమ్మడి కాయ కొట్టకూడదు.
గర్భిణి స్త్రీలు గృహప్రవేశానికి వెళ్ళరాదు.
సూర్యోదయం పూర్వమే ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేయడం లక్ష్మి కటాక్షము.
పలుకుదుర ఇంటిలో ఈ పని చేయడానికి మనిషి ఉన్న ఇంటి యజమానురాలు చేయడం లక్ష్మి లోగిలోకి రావడానికి దోహదం చేస్తుంది.
చేతితో ఎప్పుడు అన్నం, ఉప్పు, కూరలు వడ్డించకూడదు.గరిటేతో మాత్రమే వడ్డించాలి.
ఏ వస్తువు అయిన ఇంట్లో లేకపోతే లేదు అనకుండా తీసుకురావాలి లేక నిండుకుంది అనాలి..
నాస్తి నాస్తి అంటుంటే మనకు అన్ని నాస్తిగానే అవమని
అశ్వినిదేవతలు మరియు తథాస్తు దేవతలు కూడా పలుకుదురు
.