నీలగిరి ఎక్కుట ఇక అయిపోయినది అనుటకు గుర్తు... అప్పాచ్చిమేడు అనెడి స్థలము...
అచ్చట కొంచెము విస్తీర్ణమైన స్థలము లో...
పచ్చి గడ్డి పెరిగి ఉండును...
అచ్చట కన్నిస్వాములు మరికొన్ని సంప్రదాయములను... అనుష్టించవలసి యుండును...
ఈ మిట్ట యొక్క మధ్య భాగమునుండి...
వెళ్ళుదారి శబరిగిరికి పోవును...
బాటయొక్క రెండు ప్రక్కలనూ అప్పాచ్చికుయి అనియూ... ఇప్పాచ్చికుయి అనియూ పేరుగల...
రెండు గంభీర లోయలు కలవు...
గురువు యొక్క ఆజ్ఞ ప్రకారము...
కన్ని స్వాములు బియ్యపు ఉండలు ...
బెల్లపు ఉండలు ...
మొదలగునవి ఆ లోయలలో వేయుదురు...
ఈ భూతనాథుని యొక్క ఆజ్ఞలను...
మిక్కిలి శ్రద్ధతో నిర్వహించు కడూరవుడు...
మొదలగు వారిని తలచుకొని ...
వారి యొక్క తృప్తి కొరకే ...
ఈ సంప్రదాయమును పాటించవలయు ననియూ ...
పళమ స్వాములు విశ్వసించుటయునూ ...
దానిని కన్నిస్వాములైన స్వాములకు ఉపదేశించి ...
విశ్వసింప జేయుటయూ జరుగును...
ఇవన్నియూ గాక దారిలో ...
రెండువైపుల యందు కూర్చుని ...
యాచించెడి యాచకులకును...
కన్ని అయ్యప్పలచే వారి వారి శక్తి కొలది...
దాన ధర్మములు చేయించెదరు...
ఇటువంటి పద్ధతులన్నియూ నిర్వహించిన పిదప...
అచ్చట నుండి బయలు దేరుదురు...
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🙏
శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప🙏
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప🙏
లోకాః సమస్తా సుఖినోభవంతు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏