🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
క్రోధ భైరవుడు
*భార్య: వైష్ణవి*
*వాహనం: గద్ద (గరుడ)*
*దిశ: నైరుతి*
*ఆరాధన ప్రయోజనాలు: భారీ చర్య తీసుకునే శక్తిని మీకు ఇస్తుంది.*
ఈయన నీలి శరీర ఛాయతో, మూడు కళ్ళతో, నాలుగు చేతులతో,దిగంబర శరీరంతో, వైష్ణవి శక్తితో కూడిన శాంత రూపంతో గరుడ వాహనారూడుడై ఉంటాడు. నాలుగు చేతుల్లో గద, చక్రం, పానపాత్ర, శంఖం ధరించి ఉంటాడు. వైష్ణవ ఉపాసకులు అంటే గరుడ, హనుమ, సుదర్శన, నారసింహ, వరాహ, కృష్ణ ఉపాసకులు ముందుగా ఈయన ఉపాసన చేయాలి. ఈయన విష్ణు స్వరూపుడు. నైరుతి దిశకు అధిపతి.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸