2. శ్రీ ఆంజనేయ దండకం

P Madhav Kumar
( సకలభూత ప్రేత, భయహారణ కొరకు)
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం కే వాయుపుత్రం భజేవాలగాత్రం భజేహం పవిత్రం భజేసూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రము ఏదునామంబు సంకీర్తనల్ చేసి నీరూపు వర్ణించి నీ మీదనే దండకం బొక్కటిన్ చేయ నూహించి నీమూర్తిగావించి నీ సుందరంబెంచి నీదాసదాసుండనై రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్ నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ జేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భన్వయాదేవ నిన్నెంచ నేనెంత వాడన్ దయాశాలివై జూచితే దాతవై బ్రోచితే దగ్గరుంబిల్చితే తొల్లి సుగ్రీవు కున్మంత్రివై స్వామి కార్యంబు నందుండి శ్రీరామ సౌమిత్రులన్ జూచి వారిన్విచారించి, సర్వేశు పూజించి, యబ్బానుజుంబంటు గావించి యవ్వాలినిన్ జంపి కాకుత్థ్స తిలకం దయా దృష్టి వీక్షించి కిష్కిందకేతెంచి శ్రీరామకార్యార్థమై |లంకకేతెంచియున్ లంకిణిన్ జంపియున్ లంకయున్2. గాల్చియున్ | యాభూమిజన్ జూచి యానందముప్పొంగ యా యుంగరంబిచ్చి యారత్నము దెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతోషునిన్ చేసి సుగ్రీవుడున్ అంగదున్ జాంబవంతాది నీలాదులం గూడి యా సేతువున్ దాటి వానరుల్మూకలై పెన్మూకలై రైతులందుంచగా రావణుండంత కాలాగ్నియుగ్రుండనై కోరి బ్రహ్మాండమైనట్టి యాశక్తియున్ వేసి యా లక్ష్మణున్ మూర్ఛనొందిప అప్పుడే బోయి సంజీవియున్ దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాది వీరాళితో పోరాడి చెండాడి.. శ్రీరామ బాణాన్ని వారందరిన్ రావాణుంజంపగా నంత లోకంబులానందమై యుంద నవ్వేళలన్ నవ్విభీషణున్వేడుకన్ దోడుకన్వచ్చి పట్టాభిషేకంబు జేయించి సీతామహాదేవిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి నయోధ్యకున్ వచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న నీకన్న నాకెవ్వరున్ గూర్మిలేరంచు మన్నించినన్ శ్రీ రామభక్తి ప్రశస్తంబుగా నిన్ను నీ నామ సంకీర్తననే జేసితే పాపముల్బాయునే భయములు నీరునే భాగ్యముల్గల్గునే సకల సామ్రాజ్యములకల సంపత్తులన్ గల్గునే వానరాకార యోభక్త మందార యోపుణ్యసంచార యోవీర యోశూర నీవే సమస్తంబు నీవే మహాఫలమ్ముగా వెలసి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠించున్ స్థిరముగా వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామయంచున్ మనఃపూతమై యెప్పుడున్ తప్పకన్ తలతు నాజిహ్వయందుండి నీ దీర్ఘదేహంబు త్రైలోక్య సంచారివై రామనామాంకిత ధ్యానివై బ్రహ్మవై బ్రహ్మతేజంబునన్ రౌద్ర నీజ్వాలకల్లోల హావీరహనుమంత ఓంకార హ్రీంకార శబ్దంబులన్ భూతప్రేత పిశాచ శాకిని ఢాకిని గాలి దెయ్యంబులన్ నీదువాలంబున్ జుట్టి నేలంబడగొట్టి నీ ముష్టి ఘాతంబులం బాహుదండంబులం రోమఖండంబులంద్రుంచి కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మ ప్రభాసితంబైన నీ దివ్యతేజంబునుంజూచి రారా నా ముద్దు నరసింహ యంచున్ యాదృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి నమస్తే సదాబ్రహ్మచారి నమస్తే వాయుపుత్ర నమస్తే నమస్తే నమస్తే నమోనమః ॥

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat