రాగం ఖమాస్ (మేళకర్త 28, హరికాంభోజి జన్యరాగ)
ఆరోహణ: స . . . . మ1, గ3 మ1 . ప . ద2 ని2 . స'
అవరోహణ: స' . ని2 ద2 . ప . మ1 గ3 . రి2 . స
తాళం: చతుస్ర జాతి త్రిపుట తాళం (ఆది)
రూపకర్త: చిన్నకృష్ణ దాసర్
పల్లవి
సాంబశివాయనవే రాజితగిరి
శాంభవీమనోహరా పరాత్పరా కృపాకరా శ్రీ
చరణం 1
నీవే గురు దైవంబని యే వేళను సేవింపుచు సదా మదిని శివ
చరణం 2
పరమ దయానిధి వనుచు మరువక నా హృదయమున
మహాదేవ మహాప్రభో సుందర నయన సురవర దాయక భవభయ హరశివ
చరణం 3
స్థిర మధురాపురమున వరములొసగు హరుని నిరతమును దలచి
చరణం 4
శ్రీ శుభకర శశి మకుటధర జయ విజయ త్రిపురహరా-
శ్రితజన లోలాద్భుత గుణశీలా కృతనుతపాలా పతితుని లోలా-
ముదంబల రంగ పదాబ్జములందు పదంబులుజేర్చు పశుపతిని
జ్ఞానము ధ్యానము స్నానము పానము
దానము మానము అభిమానమనుచు
కనికరమున చరణంబులు కను-
గొను శృతులన్నుతుల శరణనుచు (సాంబ)
చరణం 5 (ఖండ గతి - 5 కాల)
సారెసారెగు నీ నామ మంత్రం కోరినాను నీ పాదాంబుజ మంత్రం
దాసుడౌ చిన్ని కృష్ణునికి దిక్కు నీవేయని శొక్కనాథుని నమ్ముకొని
స్వరాః
పల్లవి
స' , , , । స' , ని , । ద , ప , । , మ గ , ।
సా - - - । - - ంబ - । శి - వా – । - య న - ।
మ , , , । , , గ , । మ , ప , । ద , ని , ॥
వే - - - । - - రా - । జి - త - । గి - రి - ॥
స' , , రి' । ని , , స' । ద , , ని । ప , , ద ।
శాం - - భ । వీ - - మ । నో - - హ । రా - - ప ।
మ , , ప । మ , , గ । మ , , ప । ద , , ని ॥
రా - - త్ప । రా – - కృ । పా - - క । రా - - శ్రీ ॥
చరణం 1
స' , రి' , । స' ని - ని । స' – ని ద । ద , ని , ।
నీ - వే - । గు రు దై - । వం - బ ని । యే - వే - ।
ద ప - ప । ద - మ గ । స మ - గ । మ ప ద ని ॥
ళ ను సే - । విం - పు చు । స దా - మ । ది ని శి వ ॥
(సాంబ శివాయనవే)
చరణం 2
స' రి' స' ని । స' , , , । ని స' ని ద । ని , , , ।
ప ర మ ద । యా - - - । ని ధి వ ను । చు - - - ।
ద ని ద ప । ద , , , । ప ద ప మ । ప , , , ॥
మ రు వ క । నా - - - । హృ ద య ము । న - - - ॥
స స స స । మ మ మ మ । ప ప ప ప । ద ద ద ద ।
మ హా దే వ । మ హా ప్ర భో । సున్ - ద ర । నా - య క ।
ని స' ని స' । ని , ద ప । ద ప మ గ । మ ప ద ని ॥
సు ర వ ర । దా - య క । భ వ భ య । హ ర శి వ ॥
(సాంబ శివాయనవే)
చరణం 3
ద స' ని ద । ప మ గ మ । ప , , , । ప ద ని ద ।
స్థి ర మ ధు । రా పు ర ము । న - - - । వ ర ము లొ ।
ప మ గ గ । మ , , , । ప ని ద ని । ద ప ద ని ॥
స గు హ రు । ని - - - । ని ర త ము । ను ద ల చి ॥
(సాంబ శివాయనవే)
చరణం 4
స' , , , । , , స' ని । ని ద ద ప । ప మ గ గ ।
శ్రీ - - - । - - శు భ । క ర శ శి । మ కు ట ధ ।
మ , , , । , , ప ద । ని ద మ గ । మ ప ద ని ॥
రా - - - । - - జ య । వి జ య త్రి । పు ర హ రా ॥
స' మ' గ' స' । స' , స' , । స' రి' స' స' । ని , ని , ।
శ్రి త జ న । లో - లా - । ద్భు త గు ణ । శీ - లా - ।
ని స' ని ద । ద , ద , । ప ద ప మ । ప , ప , ॥
కృ త ను త । బా - లా - । ప తి తు ని । లో - లా - ॥
స మ , మ । గ ప , ప । మ ద , ద । ప ని , ని ।
ము దం - బ । ల రం - గ । ప దా - బ్జ । ము లన్ - దు ।
ద రి' , రి' । ని స' , స' । ని స' ని ద । ప , , , ॥
ప దం - బు । లు జే - ర్చు । ప శు ప తి । ని - - - ॥
మ , ప మ । ప , ద ప । ద , ని ద । ని , స' ని ।
జ్ఞా - న ము । ధ్యా - న ము । స్నా - న ము । పా - న ము ।
స' , రి' స' । రి' , స' ని । స' రి' స' , । ని ద ప మ ॥
దా - న ము । మా - న ము । అ భి మా - । న మ ను చు ॥
గ మ ప ద । ని స' ని రి' । స' , , , । స' రి' ని స' ।
క ని క ర । ము న చ ర । ణం - - - । బు లు క ను ।
ద ని ప ద । మ , , , । ద ప మ గ । మ ప ద ని ॥
గొ ను శృ తు । లన్ - - - । ను తు ల శ । ర ణ ను చు ॥
(సాంబ శివాయనవే)
చరణం 5 (ఖండ గతి - 5 కాల)
స' , రి' స' , । ని , ద ని , । స' , ని ద , । ప , , , , ।
సా - ర సా - । రే - గు ని - । నా - మ మన్ - । త్రం - - - - ।
ప , ద ని , । ద , ప మ , । ప , మ గ , । మ , , , , ॥
కో - రి నా - । ను - నీ ప - । దా - బ్జ మన్ - । త్రం - - - - ॥
మ , గ మ , । ప , మ ప , । ద , ప ద , । ని , ద ని , ।
దా - సు డౌ - । చి - న్ని కృ - । ష్ణు - ని కి - । ది - క్కు నీ , ।
స' , రి' స' , । ని , ద ని , । స' , ని ద , । మ , ప ద , ॥
వే - య ని - । శొ - క్క నా - । థు - ని న - । మ్ము - కొ ని - ॥
(సాంబ శివాయనవే)