తిల చతుర్థి, తిల చతుర్థిరోజు నువ్వులు ఎందుకు తినాలి?

P Madhav Kumar

 🌸🫐🌸


మాఘమాసం లో వచ్చే ముఖ్యమైన రోజులలో తిల చతుర్థి కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తిలలు అంటే నువ్వులు కదా. ఈ రోజు నువ్వులతో చేసిన పదార్థాలు తినాలని చెపుతోంది మాఘపురాణం. నువ్వులు అనగానే మనకి వంటల్లో వాడే పదార్థాలతో పాటు , పర్వదినాల్లో వదిలే పితృ తర్పణాలు కూడా గుర్తొస్తాయి. ఈ తిల చతుర్థి రోజు నువ్వులతో చేసిన వంటకాలు తినటమే కాదు , నువ్వుల ఉండలు చేసి పంచుతారు , నువ్వులని బ్రాహ్మణులకు దానమిస్తారు. మాఘమాసం మొదలయ్యకా వచ్చే ఈ తిథినాడు నువ్వులు తినటం వెనక ఒక శాస్త్రీయ రహస్యం కూడా దాగి ఉంది. చలికాలం వెళ్లి ఎండాకాలం వచ్చే ఇలాంటి సమయంలో వచ్చే ఎండలకి ఆరోగ్యంలో మార్పులు చోటుచేసుకుంటాయి. సూర్య కిరణాలు చర్మంపై పడి చర్మ కణాలు ప్రమాదాలకి గురవుతాయి , నువ్వులను తినటం వలన చర్మ కణాలకు కలిగే సమస్యలను తగ్గిస్తుంది. సూర్య కిరణలకు బహిర్గతమైనపుడు చర్మ కణాలకు కలిగే మరకలను , మచ్చలను నువ్వులలో ఉండే మూలకాలు శక్తి వంతంగా తగ్గిస్తాయి.


*నువ్వులతో ఉపయోగాలు:*


ఎముకల బలహీనతతో బాధ పడే వారు చెంచాడు నువ్వుల్ని నానబెట్టి ఉదయాన్నే పాలలో కలిపి సేవిస్తే ఈ రుగ్మతల నుంచి బయట పడవచ్చు. పిల్లలకిగానీ , పెద్దవారికి గానీ , రక్త హీనత తగ్గి రక్తం బాగా వృద్ధిచెందాలంటే , టీస్పూన్‌ నువ్వులు నానబెట్టి నిత్యం మూడునెలలపాటు తీసుకుంటే రక్తం వృద్ధిచెందడమే కాకుండా ఉదర సంబంధ వ్యాధుల్ని నిర్మూలిస్తుంది. నువ్వుల నూనెలో క్యాల్షియం అధికంగా ఉండటంవల్ల కీళ్ళ ను కాపాడుతుంది. కొబ్బరినూనె లేదా మస్టర్డ్ వంటి ఇతర నూనెలతో పోల్చినప్పుడు , నువ్వులు నూనె చాలా తేలికగా జీర్ణం అవుతుంది. ఈ నూనె మీ పెద్దప్రేగు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అంతేకాదు నువ్వుల నూనెలో ఉన్న మెగ్నీషియం ఆస్తమా , లో బ్లడ్ ప్రెషర్ వంటి వాటిని తగ్గిస్తుంది.మధుమేహగ్రస్తుల్లో హైబ్లడ్ ప్రెజర్ ఉన్నప్పుడు నువ్వుల నూనె చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. నువ్వులు దంత క్షయాన్ని పోగొడుతుంది. దంత సమస్యలు , చిగుళ్ళ సమస్యలను , చిగుళ్ళ నుండి రక్తం కారటాన్ని తగ్గిస్తుంది , థ్రోట్ ఇన్ఫెక్షణ్ తొలగించి , పళ్ళకు బలాన్ని చేకూర్చుతుంది. నువ్వుల నూనెతో ఆయిల్ పుల్లింగ్ కూడా చెయ్యొచ్చు. 


ఇన్ని గుణాలు ఉన్నాయి కాబట్టె తిల చతుర్థి అని నువ్వులకి కూడా ఒక ప్రత్యేక రోజుని కేటాయించారు మన పెద్దవాళ్ళు.


🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat