Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

అందం అంటే ఏంటి నాన్నా అని ఎనిమిదేళ్ళ కూతురు తన నాన్నను అడిగితే,..?

P Madhav Kumar
అందం అంటే.....
అందం అంటే ఏంటి నాన్నా అని ఎనిమిదేళ్ళ కూతురు తన నాన్నను అడిగితే, వాళ్ళ నాన్న చెప్పిన సమాధానం.....
రోజూ లేవగానే నువ్వు నానమ్మకు గుడ్ మార్నింగ్ నానమ్మా  అని చెప్తావు చూడు..ఆ పలకరింపే అందం అంటే.
స్కూల్ కి నిన్ను తీసుకెళ్లేటప్పుడు టర్నింగ్ లో నువ్వు చేతితో సిగ్నల్ ఇస్తావు చూడు అదే అందమంటే..
ఒకరోజు నీ ఫ్రెండ్ నీకు తెలీకుండా నీ పెన్సిల్ తీసిందని నీకు తెలిస్తే మళ్లీ ఎప్పుడూ అలా చెయ్యకు కావాలంటే నన్నడుగు అంటూ షేరింగ్ ఈజ్ కేరింగ్ అని అన్నావు చూడు అదే అందమంటే.
షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఏదన్నా బొమ్మ నచ్చితే .. కాస్ట్లీ అయితే వద్దు నాన్నా అంటావు చూడు అదే అందమంటే..
అమ్మకూ నాకూ గొడవైనప్పుడు నా దగ్గరికొచ్చి స్మైల్ నాన్నా అంటావు చూడు అదే అందమంటే.
నీకు ఐస్ క్రీం కొన్నప్పుడు బయట నుంచి ఆశగా చూస్తున్న ఇద్దరి పిల్లలకు కూడా తీసుకో నాన్నా అన్నావు చూడు అదే అందమంటే.
అమ్మకి ఒంట్లో బాలేనప్పుడు ఇంటి పనిలో నాకు సాయం చేస్తావు చూడు అదే అందమంటే..
నా బాధ నీకు తెలీకుండా నీతో మాట్లాడినప్పుడు అలా ఉన్నావేంటి నాన్నా..అంతా ఓకే అవుతుందిలే అంటావు చూడు అదీ అందమంటే.
అని అనగానే..అందం అంటే హర్ట్ లో ఉంటుంది కదా నాన్న, అంటున్న ఆయన కూతురు సమాధానం విన్న నాకు మనసంతా ఆనందంతో నిండి పోయింది.



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Type text to search
📢 Follow