ఒంటికాలు మీద నిలబడనేకూడదు ! అది ప్రమాదకరం.
పిల్లల ముందు దుర్భాషలాడనేకూడదు ! అది ఆరోగ్య లక్షణం కాదు.
ఒకరు విడిచిన దుస్తులను మరొకరు ధరించనేకూడదు ! అది అనారోగ్యం.
పిల్లల జగడంలో పెద్దలు తల దూర్చనేకూడదు ! అది ప్రమాదకరం.
సోదరుల మధ్య మిత్ర బేధం చేయనేకూడదు ! అది కుటుంబ క్షేమం కాదు.
పాడుపడిన కొంపలో నివాసముండనేకూడదు ! అది అరిష్టము.
అధిక శబ్దముగా మాట్లాడనేకూడదు ! అది ఇతరులకు ఇబ్బంది కరము.
తెలిసీ తెలియక మంత్రోశ్చరణ చేయనేకూడదు ! అది పాపము.
ఎదుటి మనుషి చెడి పోవాలని తలవనేకూడదు ! చెడపకురా చెడేవు.
వాహనములను వేగంగా నడపనేకూడదు ! అది అపదకు మూలం.
మత్తు పానీయాలు సేవించి వాహనాలు నడుపనేకూడదు ! నీకే ప్రమాదం.
దాహమని సముద్రపు నీరుతాగనే కూడదు ! అది నిష్ప్రయోజనం.
పూజలో ఆవళింపు పెట్టనేకూడదు ! అది అరిష్టం.
తడి బట్టలు కట్టుకొని పూజ చేయనేకూడదు ! అది అపచారం.
పూజ మధ్యలో లేచిపోనేకూడదు ! అది సంస్కారం కాదు.
దైవ ప్రసాదమును ధిక్కారము చేయనేకూడదు ! అది అపరాధమగును.
ఏకవస్త్రముతో పూజ చేయనేకూడదు ! అది ఆచార హీనము.
అవిటివారలను అవహేళన చేయనేకూడదు ! అది మానవతము కాదు.
చదువుకొనే పుస్తకాలను కాళ్ళతో తొక్కనేకూడదు ! అది అపచారము.
చేతులు శుభ్రం చేసుకొనక భోజనంచేయనేకూడదు ! అది అనారోగ్యము.
దక్షిణముఖంగా అమరి భోజనం చేయనేకూడదు ! అది అచారము కాదు.
దక్షిణదిశగా దీపం వెలిగించనేకూడదు ! అది అశుభమగును.
దక్షిణదిశగా సాష్టాంగ నమస్కారం చేయనేకూడదు ! అది ఆరోగ్యకరం కాదు.
ఉత్తర దిశగా తలపెట్టి పడుకోనేకూడదు ! అది శాస్త్ర విరుద్ధము.
పూజా సమయంలో తప్ప మిగిలిన వేళలో గంట మోగించనేకూడదు !
తల వాకిటి మెట్లపై కూర్చోనేకూడదు ! అది ఆచార హీనమగును.
ఈశాన్య భాగాన బరువు పెట్టనేకూడదు ! అది వాస్తు దోషమగును.
సాయం సంధ్యావేళలో ఆహారం స్వీకరించనేకూడదు ! అది అజీర్తికరం.
చీకటిలో భోజనం చేయనేకూడదు ! అది రాక్షస గుణమగును.
పర్వదినాలలో రాత్రిపూట తులసిని కోయకూడదు ! అది పాపము.
దీపం పెట్టాక తెల్లని వస్తువులను ఇల్లు దాటనీయకూడదు ! అది అరిష్టం.
భోజనం చేయగానే స్నానమాడనే కూడదు ! అది అశుభ సూచకం.
శత్రువు బలగము తెలియకపోరాటమునకు దిగనేకూడదు ! అది అవివేకం.
పెండ్లిలో అశుభం గూర్చి మాట్లాడనేకూడదు ! అది ధర్మము కాదు.
చెప్పుడు మాటలు విని చెడిపోనేకూడదు ! అది మూఢత్వము.
లాభము లేని వ్యాపారము చేయనేకూడదు ! ఇది కాలయాపనము.
మూఢనమ్మకాల బారిన పడనేకూడదు ! ఇది ఆపత్కరం.
ఇతరులు అసహ్యంచుకొనేలా నడవడి యుండనేకూడదు ! ఇది నిజం.
వేషభాషలు చూసి మనిషిని లెక్కకట్టనేకూడదు ! అది అమాయకత్వం.
అక్కరకురాని చుట్టము గూర్చి తలవనేకూడదు ! అది కాలయాపనము.
సాయంచేసిన వ్యక్తిని మరవనేకూడదు ! అది నీధర్మం.
తనతప్పులను ఇతరులపై మోపనేకూడదు ! అది ద్రోహము.
శత్రువుల వెంట నడవనే కూడదు ! అది ప్రాణహాని.
వియ్యాలవారింట వ్యంగ్యముగా మాట్లాడనేకూడదు ! అది కలహానికి మూలం.
దాన ధర్మాలు చేయుటకు వెనుకాడనేకూడదు ! అది విద్యుధర్మం.
దారితప్పినవానితో నడవనేకూడదు ! అది లక్ష్యహాని.
సర్వం తనకు తెలుసునని అనుకోనేకూడదు ! అది అహంభావం.
దొరకని దానిమీద ఆశను పెంచుకోనేకూడదు ! అది వృధాప్రయాస.
చుట్టాల వద్ద కష్టాలను చెప్పనేకూడదు ! అది అవమానకరం.🙏
🙏 స్వామి శరణం అయ్యప్ప 🙏