స్మరణ చేయి చాలు.. మోక్షం ఇచేస్త అని ఈశ్వరుడు చెప్పారు...
పాపం ఎంత అయిన ఉండనివ్వు ..
పుణ్యం ఎంత అయిన ఉండనివ్వు...
అసలు పాప పుణ్యాలు లేవు.. కేవలం రెండే రెండు పదాలు స్మరించు చాలు.. రోజు నువ్వు చేసే పనిలో నన్ను ఒక్కసారి తలచుకో చాలు....
"అరుణాచల శివ"..
ఈ స్మరణ చేయి.. నీకు ఇంకొక జన్మ కాదు.. మోక్షమే ఇచ్చేస్తాను అని చెప్పారు....
14 కిలోమీటర్లు కేవలం పాదాల స్పర్శతో గిరి ప్రదక్షిణ చేస్తే ఎంత పుణ్యమో.... అంగ ప్రదక్షిణ చేస్తే అంతకుమించి రెట్టింపు పుణ్యం ఇస్తాను అని చెప్పారు ఈశ్వరుడు...
ఎవరైతే పడుకొని అంగ ప్రదక్షిణ చేస్తారో.. వారి యొక్క శరీరం వజ్ర తుల్యం అవ్తుంది అని వరం ఇచ్చారు...
అరుణాచలం లో ఎంతో మంది మహానుభావులు చెప్పులు లేకుండా చేశారు.. అంగ ప్రదక్షిణ చేశారు.. ఇంకొంత మంది అయితే మోకాళ్ళ మీద గిరి ప్రదక్షిణ చేశారు...🙏🏻
టోపీ అమ్మన్, కొంత మంది సిద్ధ పురుషులు... ఇలా చాలా మంది మనకి గిరి ప్రదక్షిణ మార్గంలో కనిపిస్తూ ఉంటారు....
మనం ఎంత దూరం ఉన్న.. ఎన్ని వేల కిలోమీటర్లు దూరంలో ఉన్న, యే పనిలో నిమగ్నం అయ్యి ఉన్న కానీ.. భగవంతుడికి మనం దగ్గరగా ఉంటాము.. ఎలా అంటే..
కేవలం స్మరణ మాత్రం చేత.. "అరుణాచల శివ".. ఈ నామాన్ని మనసులో తలిస్తే చాలు... ఒక్క నిమిషం అరుణాచలం లో ఉన్నట్లు ఉంటుంది...
కాబట్టి ఈ నామాన్ని మనం నిత్యం స్మరిద్దాము...🙂
అరుణాచల శివ...🙏🏻