శ్రీ శ్యామల దేవి నవరాత్రులు

P Madhav Kumar



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


దివ్యసింహాసనాసీనాం శుకవీణాలసత్కరామ్ !

సంగీత మాతృకాం వందే వరదాం సుస్మితాననామ్ !!


మాఘశుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు అమ్మవారిని శ్యామలాదేవిగా పూజించడం అనేది శాస్త్రంలో చెప్పబడింది.


మొదటిరోజు నుండి క్రమంగా తొమ్మిది రోజులు


శ్రీ లఘుశ్యామలాయై నమః ;

శ్రీ వాగ్వాదిన్యై నమః ;

శ్రీ నకులీశ్వర్యై నమః ;

శ్రీ కళ్యాణ శ్యామలాయై నమః ;

శ్రీ జగద్రంజనీ మాతంగిణ్యై నమః ;

శ్రీ వశ్యమాతంగిన్యై నమః ;

శ్రీ సారికాయై నమః ;

శ్రీ శుకశ్యామలాయై నమః ;

శ్రీ రాజశ్యామలాయై నమః ;


అనే ఒక్కొక్క నామంతో పూజించే పధ్ధతి కూడా ఉంది.


ఈవిషయంలో చాలా సందేహాలు కలుగుతాయి. శ్రీవిద్య లేకుండా శ్యామలాదేవిని ఆరాధించవచ్చా ? ఆ దేవికి సంబంధించిన మంత్రం ఉండాలా? ఈ అమ్మవారి పూజ తాంత్రికమా ? ఎవరైనా చేయవచ్చా ?

శ్యామలాదేవి అంటే ప్రసిద్ధిగా తెలియదు అనేవారు కూడా ఉన్నారు. కానీ వ్యవహారంలో ఎందరిలో ‘శ్యామల’ అనే పేరు ఉండడం సాధారణ విషయం.


అటువంటప్పుడు ఈవిడ అనాది కాలం నుండి సామాన్యులచే కూడా అర్చించబడి, వారిని అనుగ్రహించిన దేవతే అనేది సుస్పష్టం.


శ్యామలాదేవిని సాక్షాత్కరింపజేసుకున్న మహాకవి కాళిదాసు అప్పటికి ఏ మంత్ర - తంత్రాలు లేకుండా కేవలం ‘అమ్మ’ అనే భావంతో కరుణించమని విలపించాడు. ఆ నిష్కల్మషపు మనోవేదనకు అనుగ్రహించిన శ్యామలమ్మ ఎంతటి కరుణార్ద్ర హృదయో ద్యోతకమవుతోంది.

కాళిదాసుకు ముందుగా ‘మాణిక్యవీణను మీటుతూ ఇంద్రనీలమణులవంటి కాంతి’తో ప్రత్యక్షమైన తల్లి వెనువెంటనే ‘నాలుగు చేతులలో పుండ్రేక్షు పాశాంకుశాలు ధరించిన మాత’గా మారిందంటే శ్యామలకు, లలితాదేవికి అభేదాన్ని గ్రహించవచ్చు.


అమ్మవారి ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులలో , ఇచ్ఛాశక్తి లలితాదేవి, క్రియాశక్తి వారాహీ దేవి కాగా , జ్ఞానశక్తిగా శ్యామలాదేవి చెప్పబడుతోంది.


ఈ నవరాత్రులలో 5 వ రోజు ‘శ్రీపంచమి’నాడు సరస్వతిగా పూజలందుకునేది ‘జ్ఞాన’రూపిణి అయిన శ్యామలాదేవియే.


ఇచ్ఛ - క్రియా శక్తులు కూడా జ్ఞానశక్తితో కూడుకునే ఉంటాయి. అన్నిటికీ జ్ఞానశక్తియే మూలం. జీవుని యొక్క అన్ని వ్యవహారాలకు మూలం బుద్ధిశక్తి. ఆ బుద్ధిని ప్రేరేపించేది శ్యామలాదేవి.


శ్యామలాదేవి అనేక దేవతల సమాహార మూర్తి. చేతిలో వీణను ధరించిన సరస్వతీదేవి. పాశాంకుశాలు , చంద్రలేఖ , చెరకువిల్లు , ధరించిన లలితాదేవి. పద్మంలో ఆసీనురాలై , ఒక చేత్తో పద్మాన్ని ధరించిన శ్రీమహాలక్ష్మీ దేవి. నీలపు కాంతులలో నున్న వైష్ణవి. చంద్రలేఖ ధరించి , త్రినేత్రాలతో ఉన్న మాహేశ్వరీ శక్తి కూడా ఈ తల్లే. వీణను , చిలుకను దాల్చిన శారదామాతకు శ్యామలాదేవికి కూడా వేరు లేదు.


నిర్వికారుడు , నిర్గుణుడు అయిన పరమాత్మ లోకరక్షణకై అవతరించాల్సి వచ్చినప్పుడు తనయొక్క మాయాశక్తితో అవతరిస్తాడు. ఆ శక్తి లేకపోతే అవతారమే లేదు. ఉదాహరణకు నారాయణుడు వరాహ స్వామిగా అవతరించినపుడు , అమ్మవారి యొక్క వారాహీ శక్తి అతనిలో ప్రవేశించి , భూమిని ఉద్ధరించింది.


అందుకే అమ్మవారి స్తోత్రరాశి అయిన సౌందర్యలహరిలో శంకరుల వారు , ‘జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి’ – సంసారసాగరంలో మునిగిపోయిన వారిని వరాహ స్వామి వలె ఉద్ధరిస్తుంది అని వర్ణించారు.


ఆ నారాయణుడు శ్రీకృష్ణునిగా అవతరించినపుడు, దుర్గామాత యొక్క మాయాశక్తి ‘శ్యామల’గా కృష్ణావతారమంతా నడవడానికి కారణమయింది.

కృష్ణుడు ‘శ్యామ’వర్ణంతో ప్రకాశించడంలోని అంతరార్థం ఇదే. ‘శ్రీకృష్ణః శ్యామలాదేవీ’ అని ప్రసిద్ధ వాక్యం.


అనేక సందర్భాలలో భక్తులను అనుగ్రహించడానికి అమ్మవారి శ్యామలాదేవిగా ప్రకటితమయ్యారు.


శ్రీవిద్యలో శ్యామలాదేవిగా , దశమహావిద్యలలో మాతంగిగా అనుగ్రహించే దేవత. ఆ మాతంగియే ఒకానొక సందర్భంలో మతంగముని తపఃఫలితంగా అతని కుమార్తెగా ఉద్భవించి ఆ నామానికి మరో అర్థం కూడా కలిగించింది.


బ్రహ్మాండపురాణంలో భండాసురవధ సందర్భంగా శ్యామలాదేవి యొక్క విషయం విపులంగా చెప్పబడింది.

లలితాదేవి యొక్క బుద్ధిశక్తిగా శ్యామలాదేవి ఆవిర్భవించింది. శ్రీలలితాదేవి ఈమెను సకల పరివారానికి ‘మంత్రిణి’గా శ్రీమన్నగర రాజ్యభారాన్ని అప్పజెప్పి, తనయొక్క అంగుళీయకానని స్వయంగా శ్యామలదేవిచే ధరింపజేసింది.సుబ్బారెడ్డి


పిమ్మట ఏడు ఆవరణలతో కూడిన యంత్రానికి ప్రతీకగా గేయచక్రంలో సకల మంత్రశక్తులు దేవతారూపాలు ధరించి అర్చిస్తుండగా బిందుస్థానంలో శ్యామలాదేవి కొలువై బాధ్యతలను నిర్వహింపనారంభించింది.


అసురశక్తులు వివిధ రూపాలతో విజ్రుంభిస్తుంటే శ్యామలాదేవి నుండి అనేక రకముల దేవతా శక్తులు ఉద్భవించి అశేష సైన్యంతో రాక్షసులను నిర్మూలించింది.


ఈ తల్లే మన బుద్ధిని అధిష్ఠించి ఉన్నందువల్ల , ఆమెను శరణువేడితే మనలో కలిగే చెడు తలపులను పరిహరించి పరమాత్మకు చేరువ చెయ్యగలదు. అమ్మవారి నుండి వచ్చిన లఘుశ్యామల , వాగ్వాదినీ , రాజశ్యామల , నకులీ వాగీశ్వరి మొదలైన అనేకరూపాలు అసుర నాశనానికే కాక మనలను అనేక ఆపదలనుండి కూడా రక్షిస్తాయి.


శ్యామలాదేవి యొక్క రథం పేరు గేయచక్రం.

ఇది శ్యామలాదేవికి సంబంధించిన మంత్రశక్తులన్నీ కొలువై ఉన్న యంత్రం.

ఈ యంత్రానికి ఏడు ఆవరణలు. అంతేకాక ఈ శక్తులన్నిటితో శ్రీమన్నగరంలోని కదంబవనంలో ప్రత్యేకంగా కొలువై ఉండి స్మరణ మాత్రం చేత భక్తులను అనుగ్రహిస్తుంటుంది.


మహాకవి కాళిదాసు ఈ తల్లిని చూస్తూ శీర్షాది పాదపర్యంతం వర్ణించినదే ధ్యానయోగ్యమైన శ్యామలాదండకం.


ఈ అమ్మవారిని ఏ రూపంతో ఎలా ధ్యానిస్తే ఏ ఫలితం వస్తుందో కూడా చెప్పడంలోనే శ్యామలాదేవి సర్వ దేవాత్మిక అని తెలియజేయడమే కాక సర్వ తీర్థాత్మికే , సర్వ మంత్రాత్మికే(మంత్రమే దేవత కనుక 

సర్వ దేవాత్మికే) , 

సర్వ తంత్రాత్మికే , 

సర్వ ముద్రాత్మికే , 

సర్వ శక్త్యాత్మికే , 

సర్వ వర్ణాత్మికే , 

సర్వ రూపే అని అమ్మవారి యొక్క విశ్వరూపాన్ని తెలియజేసి, ఆ దండకానికి ముగింపుగా ‘జగన్మాతృకే’ అని సంబోధించి, తనయులు చేసిన తప్పులను తల్లివలె క్షమించాలని వేడుకుంటూ ‘పాహిమాం’ అని ముగించారు.


శ్యామలాదేవిని అమ్మవారి యొక్క ఒక రూపమనే కాకుండా , సకలదేవాత్మికగా అర్చిస్తే , ఆమె అనుగ్రహంతో సకల దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చును. అన్ని అక్షరములకు , సర్వవిద్యలకు మూలదేవతగానే కాక బ్రహ్మవిద్యాప్రదాయినిగా ముముక్షుత్వం ప్రసాదించగలిగే బ్రహ్మవిద్యాస్వరూపిణి.


జయ సౌభాగ్యదే న్రూణాం లోకమోహిని తే నమః !

సర్వైశ్వర్యప్రదే పుంసాం సర్వవిద్యాప్రదే నమః !

హే జగన్మాతృకే ! పాహిమాం పాహిమాం పాహిమాం.


*☘శ్రీ శ్యామల దేవి నవరాత్రులు☘*


శ్రీ విద్య సంప్రదయము లో 4 నవరాత్రులు మొత్తము


చైత్రములో వసంత నవరాత్రి 


ఆషాడము లో వారాహి నవరాత్రి


అశ్వయుజము లో శారదా నవరాత్రి  


మాఘము లో శ్యామల నవరాత్రి 


చైత్ర అశ్వయిజ నవరాత్రులు అందరకీ తెలుసు. మిగిలిన రెండు గుప్త నవరాత్రులు కేవలము సంప్రదాయం లో ఉన్నవారికే పరిమితము అయ్యాయి. అలా కాకుండా మూలమంత్ర అనుష్ఠానము లేని వారు కూడా ఈ గుప్త నవరాత్రులు చేసుకోవచ్చును. 


మాఘ మాసంలో వచ్చేవి శ్రీ శ్యామల నవరాత్రులు 

శ్యామలా దేవి లలిత పరబట్టరిక యొక్క మంత్రిని ఈ తల్లిని దశ మహా విద్యల్లో మాతంగి అని పిలుస్తారు.


ఈవిడకు 

నీల సరస్వతి , 

శుక శ్యామల , 

సారిక శ్యామల ,

రాజ మాతంగి , 

లఘు శ్యామల , 

గేయ చక్ర వసిని అని ఎన్నో నామాలు ఉన్నాయి.


ఈ సంవత్సరము 

జనవరి 22 నుండి 30 వరకు శ్యామల దేవి గుప్త నవరాత్రులు 

మూల మంత్రము లేని వాళ్ళు ఉపదేశము లేని వాళ్ళు పెద్దలు పిల్లలు సర్వులు చేసుకోదగ్గ 

శ్యామల షోడశ 16 నామాలు ఇస్తున్నాము.


శ్రీ గురువుల కృపతో 

అందరూ చేసుకోండి. అమ్మ అనుగ్రహము పొందండి. 


నీల సరస్వతి

సంగీత యోగిని 

శ్యామా

శ్యామలా

మంత్ర నాయిక

మంత్రిని

సచివేశి

ప్రధానేశీ

శుక ప్రియ

వీణా వతి

వైణికి

ముద్రిని

ప్రియక ప్రియా

నీప ప్రియ

కదంబెశి

కాదంబ వనవాసిని


ఈ 16 నామాలు నిత్యము కూడా అందరూ చేసుకోవచ్చును. 

దీని వలన అమ్మ అనుగ్రహము కలిగి సమస్తము మన వశము అవుతుందని ఫలశ్రుతి. 


*సర్వం శ్రీ గురు త్రిపురాంబ చరణారవిందర్పణ మస్తు*


 *ఈ తొమ్మిది రోజులూ శ్యామలాదేవిని క్రింది స్తోత్రంతో ఆరాధించుకుందాం*


మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసామ్ |

మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి || ౧ ||

చతుర్భుజే చంద్రకలావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే |

పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః || ౨ ||

మాతా మరకతశ్యామా మాతంగీ మదశాలినీ |

కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ || ౩ ||

జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే |

జయ సంగీతరసికే జయ లీలాశుకప్రియే || ౪ ||


*దండకమ్*


జయ జనని సుధాసముద్రాంతరుద్యన్మణీద్వీపసంరూఢ బిల్వాటవీమధ్యకల్పద్రుమాకల్పకాదంబకాంతారవాసప్రియే కృత్తివాసప్రియే సర్వలోకప్రియే, సాదరారబ్ధసంగీతసంభావనాసంభ్రమాలోలనీపస్రగాబద్ధచూలీసనాథత్రికే సానుమత్పుత్రికే , శేఖరీభూతశీతాంశురేఖామయూఖావలీబద్ధసుస్నిగ్ధనీలాలకశ్రేణిశృంగారితే లోకసంభావితే కామలీలాధనుస్సన్నిభభ్రూలతాపుష్పసందోహసందేహకృల్లోచనే వాక్సుధాసేచనే చారుగోరోచనాపంకకేళీలలామాభిరామే సురామే రమే , ప్రోల్లసద్వాలికామౌక్తికశ్రేణికాచంద్రికామండలోద్భాసి లావణ్యగండస్థలన్యస్తకస్తూరికాపత్రరేఖాసముద్భూత సౌరభ్యసంభ్రాంతభృంగాంగనాగీతసాంద్రీభవన్మంద్రతంత్రీస్వరే సుస్వరే భాస్వరే , వల్లకీవాదనప్రక్రియాలోలతాలీదలాబద్ధ-తాటంకభూషావిశేషాన్వితే సిద్ధసమ్మానితే , దివ్యహాలామదోద్వేలహేలాలసచ్చక్షురాందోలనశ్రీసమాక్షిప్తకర్ణైకనీలోత్పలే శ్యామలే పూరితాశేషలోకాభివాంఛాఫలే శ్రీఫలే , స్వేదబిందూల్లసద్ఫాలలావణ్య నిష్యందసందోహసందేహకృన్నాసికామౌక్తికే సర్వవిశ్వాత్మికే సర్వసిద్ధ్యాత్మికే కాలికే ముగ్ధమందస్మితోదారవక్త్రస్ఫురత్ పూగతాంబూలకర్పూరఖండోత్కరే జ్ఞానముద్రాకరే సర్వసంపత్కరే పద్మభాస్వత్కరే శ్రీకరే , కుందపుష్పద్యుతిస్నిగ్ధదంతావలీనిర్మలాలోలకల్లోలసమ్మేలన స్మేరశోణాధరే చారువీణాధరే పక్వబింబాధరే ,

సులలిత నవయౌవనారంభచంద్రోదయోద్వేలలావణ్యదుగ్ధార్ణవావిర్భవత్కంబుబింబోకభృత్కంథరే సత్కలామందిరే మంథరే దివ్యరత్నప్రభాబంధురచ్ఛన్నహారాదిభూషాసముద్యోతమానానవద్యాంగశోభే శుభే , రత్నకేయూరరశ్మిచ్ఛటాపల్లవప్రోల్లసద్దోల్లతారాజితే యోగిభిః పూజితే విశ్వదిఙ్మండలవ్యాప్తమాణిక్యతేజస్స్ఫురత్కంకణాలంకృతే విభ్రమాలంకృతే సాధుభిః పూజితే వాసరారంభవేలాసముజ్జృంభ

మాణారవిందప్రతిద్వంద్విపాణిద్వయే సంతతోద్యద్దయే అద్వయే దివ్యరత్నోర్మికాదీధితిస్తోమ సంధ్యాయమానాంగులీపల్లవోద్యన్నఖేందుప్రభామండలే సన్నుతాఖండలే చిత్ప్రభామండలే ప్రోల్లసత్కుండలే ,

తారకారాజినీకాశహారావలిస్మేర చారుస్తనాభోగభారానమన్మధ్యవల్లీవలిచ్ఛేద వీచీసముద్యత్సముల్లాససందర్శితాకారసౌందర్యరత్నాకరే వల్లకీభృత్కరే కింకరశ్రీకరే , హేమకుంభోపమోత్తుంగ వక్షోజభారావనమ్రే త్రిలోకావనమ్రే లసద్వృత్తగంభీర నాభీసరస్తీరశైవాలశంకాకరశ్యామరోమావలీభూషణే మంజుసంభాషణే, చారుశించత్కటీసూత్రనిర్భత్సితానంగలీలధనుశ్శించినీడంబరే దివ్యరత్నాంబరే ,

పద్మరాగోల్లస న్మేఖలామౌక్తికశ్రోణిశోభాజితస్వర్ణభూభృత్తలే చంద్రికాశీతలే వికసితనవకింశుకాతామ్రదివ్యాంశుకచ్ఛన్న చారూరుశోభాపరాభూతసిందూరశోణాయమానేంద్రమాతంగ హస్తార్గలే వైభవానర్గలే శ్యామలే కోమలస్నిగ్ధ నీలోత్పలోత్పాదితానంగతూణీరశంకాకరోదార జంఘాలతే చారులీలాగతే నమ్రదిక్పాలసీమంతినీ కుంతలస్నిగ్ధనీలప్రభాపుంచసంజాతదుర్వాంకురాశంక సారంగసంయోగరింఖన్నఖేందూజ్జ్వలే ప్రోజ్జ్వలే నిర్మలే ప్రహ్వ దేవేశ లక్ష్మీశ భూతేశ తోయేశ వాణీశ కీనాశ దైత్యేశ యక్షేశ వాయ్వగ్నికోటీరమాణిక్య సంహృష్టబాలాతపోద్దామ లాక్షారసారుణ్యతారుణ్య లక్ష్మీగృహితాంఘ్రిపద్మే సుపద్మే ఉమే ,

సురుచిరనవరత్నపీఠస్థితే సుస్థితే రత్నపద్మాసనే రత్నసింహాసనే శంఖపద్మద్వయోపాశ్రితే విశ్రుతే తత్ర విఘ్నేశదుర్గావటుక్షేత్రపాలైర్యుతే మత్తమాతంగ కన్యాసమూహాన్వితే భైరవైరష్టభిర్వేష్టితే మంచులామేనకాద్యంగనామానితే దేవి వామాదిభిః శక్తిభిస్సేవితే ధాత్రి లక్ష్మ్యాదిశక్త్యష్టకైః సంయుతే మాతృకామండలైర్మండితే యక్షగంధర్వసిద్ధాంగనా మండలైరర్చితే , భైరవీ సంవృతే పంచబాణాత్మికే పంచబాణేన రత్యా చ సంభావితే ప్రీతిభాజా వసంతేన చానందితే భక్తిభాజం పరం శ్రేయసే కల్పసే యోగినాం మానసే ద్యోతసే ఛందసామోజసా భ్రాజసే గీతవిద్యా వినోదాతి తృష్ణేన కృష్ణేన సంపూజ్యసే భక్తిమచ్చేతసా వేధసా స్తూయసే విశ్వహృద్యేన వాద్యేన విద్యాధరైర్గీయసే , శ్రవణహరదక్షిణక్వాణయా వీణయా కిన్నరైర్గీయసే యక్షగంధర్వసిద్ధాంగనా మండలైరర్చ్యసే సర్వసౌభాగ్యవాంఛావతీభిర్ వధూభిస్సురాణాం సమారాధ్యసే సర్వవిద్యావిశేషత్మకం చాటుగాథా సముచ్చారణాకంఠమూలోల్లసద్వర్ణరాజిత్రయం కోమలశ్యామలోదారపక్షద్వయం తుండశోభాతిదూరీభవత్ కింశుకం తం శుకం లాలయంతీ పరిక్రీడసే ,

పాణిపద్మద్వయేనాక్షమాలామపి స్ఫాటికీం జ్ఞానసారాత్మకం పుస్తకంచంకుశం పాశమాబిభ్రతీ తేన సంచింత్యసే తస్య వక్త్రాంతరాత్ గద్యపద్యాత్మికా భారతీ నిస్సరేత్ యేన వాధ్వంసనాదా కృతిర్భావ్యసే తస్య వశ్యా భవంతిస్తియః పూరుషాః యేన వా శాతకంబద్యుతిర్భావ్యసే సోపి లక్ష్మీసహస్రైః పరిక్రీడతే , కిన్న సిద్ధ్యేద్వపుః శ్యామలం కోమలం చంద్రచూడాన్వితం తావకం ధ్యాయతః తస్య లీలా సరోవారిధీః తస్య కేలీవనం నందనం తస్య భద్రాసనం భూతలం తస్య గీర్దేవతా కింకరి తస్య చాజ్ఞాకరీ శ్రీ స్వయం ,

సర్వతీర్థాత్మికే సర్వ మంత్రాత్మికే , సర్వ యంత్రాత్మికే సర్వ తంత్రాత్మికే , సర్వ చక్రాత్మికే సర్వ శక్త్యాత్మికే , సర్వ పీఠాత్మికే సర్వ వేదాత్మికే , సర్వ విద్యాత్మికే సర్వ యోగాత్మికే , సర్వ వర్ణాత్మికే సర్వగీతాత్మికే , సర్వ నాదాత్మికే సర్వ శబ్దాత్మికే , సర్వ విశ్వాత్మికే సర్వ వర్గాత్మికే , సర్వ సర్వాత్మికే సర్వగే సర్వ రూపే , జగన్మాతృకే పాహి మాం పాహి మాం పాహి మాం దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమః ||



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat