🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌸ఈ శ్రీచక్రానికి మించిన చక్రము ఈ సృష్టిలో ఏదీ లేదు. అందుకే అది “చక్రరాజము” అయినది. సమస్త దోషములను నివారించి సమస్త కోరికలను తీర్చి, సకల సౌభాగ్యాలు ఇచ్చే దివ్యమైన యంత్రమే ఈ శ్రీచక్రం.
🌿శ్రీవిద్యోపాసన, శ్రీచక్రార్చన అందరికీ సులభ సాద్యం కాదు. ఐనా పట్టుదలతో చేస్తే సాధించలేనిది అంటు ఏమి లేదు ఈ లోకములో కాస్త కష్టమే ఐనా అసాద్యము మాత్రము కాదు సుమా.
🌸మన దేహమే ఈ శ్రీచక్రము. సాధకుడి దేహము ఈ శ్రీచక్రమనే దేవాలయము
మన దేహము నవ రంద్రములతో ఏర్పడింది అని మనమేరుగుదుము అటులనే,
🌿ఈ శ్రీచక్రము తొమ్మిది ఆవరణలతో ఏర్పడిన చక్ర సమూహమే ఈ శ్రీచక్రము' మనిషి శరీరంలో ఉన్న షట్చక్రాలకూ, ఈ శ్రీచక్రము లో ఉన్న తొమ్మిది అవరణలు అవినాభావ సంబధము కలదు.
🌸శరీరంలోని నవ ధాతువులకు ఈ నవ ఆవరణలు ప్రతీకలు. ఈ శ్రీచక్రముని 9 బాగాలు విడమర్చి 9 ఆవరణములుగా చెప్పెదరు' అందుకే శ్రీచక్రమునకు నవావరణ పూజ అనే పూజని చేయ్యటం మనలో చలామందికి తేలుసు.
🌿4 శివ చక్రములు, 5 శక్తి చక్రములు కలసి మొత్తం తొమ్మిది చక్రములతో ఆ పరదేవత విరాజిల్లుతూ వుంటుంది. ఈ 9 చక్రములను విడదీసి విడివిడిగా ఒక్కో చక్రానికి ఒక్కో దేవత అదిష్టానం వహిస్తూ ఉంటుంది.
🌸ఇక చిట్ట చివరన బిందు స్తానంలో కామేశ్వరుడితో కామేశ్వరి ఆలింగన ముద్రలో వుంటారు. ఇక్కడ శివుడు శక్తి ఏకమై ఉండడం వలన మనకు బిందువుని చూచిక గా చేబుతారు పెద్దలు శివడు శక్తితో కలసి ఈ చక్రములతో నివసించడం వలన శివశక్తైక్య రూపిణి వీరిరువురూ కలయికే ఈ లలితాంబిక అయినది.
🌿అర్ధనారీశ్వర తత్వమే ఇక్కడకూడా ఆ పరమేశ్వరుడి లీలా వినోదం ఏమని చేప్పిగలo, కామ కామేశ్వరుల నిలయము, సృష్టికి మరో రూపమై వెలుగుచున్న ఈ శ్రీచక్ర వైభవాన్ని వేనోళ్ళ పోగడడం తప్ప ఇంకేం చేప్పగలను.
🌸ఈ అనంత సృష్టికి సూక్ష్మ రూపమే ఈ శ్రీచక్రమని చేప్పనా. లేక పర దేవి నిలయమే ఈ శ్రీచక్రమని చేప్పనా. లేక ఆ పరాదేవియే ఈ శ్రీచక్రమని చేప్పనా లేక మహోగ్ర రూపిణీ ఆ వారాహినే ఈ చక్ర సామ్రాజ్య సేనాదీ కాపు గాస్తుందని చేప్పనా యంతని చేప్పను ఏమని చేప్పను.
🌿ఈ శ్రీచక్రము 3 రకములుగా ఆరాదించబడుతుంది ఈ లోకంలో 1 మేరు ప్రస్తారము. 2 కైలాస ప్రస్తారము 3 భూ ప్రస్తారము.
🌸సకల కోటి మహా మంత్రములతో సకల దేవి దేవతల సమిష్టి రూపమే ఈ శ్రీచక్రము ఇటుటువంటి చక్రరాజాన్ని ఉపాసించడం వలన ,సకల మంత్ర తంత్ర మూలికా గుఠికా జ్ఞానము మరియూ ముక్తి ప్రాప్తించునని నని మన పూర్వ సాదకులు మరియు మన ఋషులు నోక్కీ ఓక్కాణ్ణిoచి చేప్పియుంనారు.
🌿ఈ శ్రీచక్రము యొక్క నాలుగు ద్వారాలు మహా వాక్యాలకు గుర్తులు.