శ్రీవారి అనంత సంపదకు శంఖనిధి, పద్మ నిధి కారణమా ...?

P Madhav Kumar

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

🌿 తిరుమల శ్రీవారి సంపదలు, నవనిధులను రక్షించే దేవతలు శంఖనిధి, పద్మ నిధి. 

🌸వీరిలో ఎడమ వైపున అంటే దక్షిణ దిశలో శంఖనిధి, కుడి వైపున అంటే ఉత్తర భాగాన పద్మనిధి ఉంటారు. 

🌿శంఖనిధి చేతుల్లో శంఖాలు, పద్మనిధి చేతుల్లో పద్మాలు ఉంటాయి. 

🌸శ్రీవారి ఆలయ మహాద్వారానికి ఇరుపక్కల ద్వారపాలకుల్లా సుమారు రెండడుగుల ఎత్తైలో ఈ పంచలోహ విగ్రహాలు ఉంటాయి.

🌿ఆలయంలోనికి ప్రవేశించే ముందు కాళ్లను ప్రక్షాళన చేసుకునే దగ్గర గడపకు ఇరువైపులా కనిపిస్తారు. 

🌸ఈ నిధిదేవతల పాదాలవద్ద ఆరంగుళాల పరిమాణంగల రాజవిగ్రహం నమస్కార భంగిమలో నిల్చొని ఉంటుంది.

🌿ఇది విజయనగర రాజు అచ్యుత దేవరాయల విగ్రహం. బహుశా అచ్యుతరాయలే ఈ నిధి దేవతలను ప్రతిష్టించి ఉంటారని భావిస్తున్నారు. 

🌸ఆగమ శాస్త్రం ప్రకారం సాధారణంగా నిధి దేవతలను ఆలయానికి మూడో ప్రాకార ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేస్తారు.

🌿 కాబట్టి, తిరుమల ఆలయం కూడా మూడు ప్రాకారాలు కలిగినదేనని తెలుస్తోంది. 

🌿ఇక, పరమేశ్వరుడు ఉపదేశించిన ప్రకారం నిధులు నాలుగు రకాలు.. అవి కచ్చప, మకర, శంఖ, పద్మ. వీటిలో కచ్చప, మకర మాత్రమే స్థిరంగా ఒకేచోట ఉంటాయి. 

🌸వీటిని ప్రయత్నం, శివానుగ్రహంతో మాత్రమే పొందగలం. శంఖ, పద్మ నిధులు మానవుని శబ్దం వినపడిన వెంటనే చంచలమై వేరొక స్థానానికి వెళ్లిపోతాయి. 

🌿వీటిని సాధించడం అసంభవం. 
శివ, విష్ణు, అమ్మవారి అనుగ్రహం పొందిన వారికి మాత్రమే అవి దక్కుతాయి. 

🌸భూమి నుంచి తామర పువ్వుల వాసన వచ్చే ప్రదేశం, డేగలు, కాకులు, కొంగలు లాంటి పక్షులు ఎక్కువగా సంచరించే చోట, కాకులు విశేష ప్రీతితో సంభోగం చేసే ప్రదేశాల్లో నిధులు ఉంటాయట.

🌿 వృక్షాలు అనేకం ఉన్న ఒకే చెట్టుపై పక్షులన్నీ కలిసి నివసించే స్థలం, పురాతన దేవాలయం, పాడుబడిన చెరువులు, గ్రామాలు, నిత్యం పశువులు మేస్తున్నా తిరిగి తెల్లవారే సరికి నిధి ఉన్న ప్రదేశంలో గడ్డి తొందరగా పెరుగుతుందట. 
ఇది ఒక నమ్మకం...🚩🌞🌹🙏🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat