గుళ్లోకి వెళ్లే ముందు గడపకు ఎందుకు నమస్కరిస్తారు?

P Madhav Kumar
*గుళ్లోకి వెళ్లే ముందు గడపకు*🙏🪷

 ఎందుకు నమస్కరిస్తారు? దేవాలయంలోని గడప మనఇంట్లో మాదిరిగా చెక్కతో కాకుండా రాతితో నిర్మిస్తారు. రాయి పర్వతానికి చెందినది. భద్రుడు అనే భక్తుడు భద్రమనే పర్వతంగానూ, హిమవంతుడు అనేక భక్తుడు హిమాలయముగానూ, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగానూ అవతరించాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. భగవంతుడు ఆ భక్తుల కోసం ఆ కొండల మీద వెలిశాడు. ఆ కొండలలో నుంచి వచ్చిన రాయినే గడపగా మార్చి ఉంచుతారు. నిత్యం దేవుణ్ణి దర్శించే ఆ గడప పుణ్యానికి నమస్కరిస్తూ అంతటి భక్తుణ్ణి దాటుతున్నందుకు క్షమించమని, మన్నించమని వేడుకోవటమే గడపకు నమస్కరించడం, అలాగే నరసింహస్వామి వారు కూడా హిరణ్యకశ్యపుడిని వధించింది గడప వద్దే. కావున దేవాలయాల్లో గడపని తొక్కి దాటకండి. కేవలం దాటండి.

 *ఓం నమో నారాయణాయ*
సేకరణ:-
        🦋#శుభమస్తు🦋
     ⚜️🕉⚜️🕉⚜️🕉⚜️


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat