*చెట్టు ఎంత గట్టిగా ఉన్నా*
*కాలాన్ని బట్టి ఆకులు, పూలు*
*వస్తుంటాయి.రాలుతుంటాయి*.
*అలాగే నువ్వెంత నీతిగా బ్రతికినా*
*కష్టాలు, కన్నీళ్లు వస్తుంటాయి*,
*పోతుంటాయి.*
*ఇక్కడ మనం నేర్చుకోవలసింది*
*తడబడడం కాదు, నిలబడడం..*
*అప్పుడే మనం అనుకున్నది*
*సాధించగలం.*
చెట్టులాగ, పుట్టలాగ ఎవరు ఎవరితో పోల్చుకోకుండా ఎవరికి వారే నిత్యానందంగా జీవిస్తూ ఉండాలి... మనసు నిలకడగా ఉండేందుకు శ్వాస మీద ధ్యాస పెట్టీ సాధన మొదలు పెట్టినా అంతర్లీనంగా మనసు మాయ చేయడానికీ వదల బొమ్మాళి లాగా పట్టు వదలని విక్రమార్కుడిలా పని చేస్తూనే ఉంటుంది... అక్కడే అసలు సిసలైన మాయ మొదలు... ఆ మాయను జయించి నపుడే అసలు సిసలైన ఆత్మ జ్ఞానం....సమస్యలు అన్నీ కర్మ సిద్దాంతం ఆధారంగా ఏర్పడినవే... ఎవరు ఎవరి చెడు కర్మలు తగ్గించలేరు, తీసివేయలేరు... ఎవరికి వారు సరైన సాధన ద్వారా మాత్రమే వారి వారి చెడు కర్మల బంధం నుండి బయటపడతారు... 🙏