*పూర్ణఫలాలు.*భగవంతునికి సమర్పించడానికి ఎన్ని ఫలాలున్నప్పటికీ.....!

P Madhav Kumar

*భగవంతునికి సమర్పించడానికి ఎన్ని ఫలాలున్నప్పటికీ అరటికాయ, కొబ్బరికాయలకే తొలి ప్రాధాన్యం. ఎందుకంటే వాటికి పూర్ణఫలాలు అని పేరుంది.*

*సృష్టిలో అన్నిఫలాలను మనం ఆరగించి, వాటిలోని విత్తనాలను నోటినుంచి ఊసేస్తాం. దానివల్ల ఆ విత్తనాలు ఎంగిలిపడుతాయి.*

*కొన్నిపండ్లను పక్షులు తిని, వాటి విత్తనాలను విసర్జిస్తాయి. అవి మొలకెత్తి, తిరిగి పుష్పించి ఫలిస్తాయి. మనం తిరిగి ఆ ఫలాలనే భగవంతునికి సమర్పిస్తాం. అది అంత శ్రేష్టం కాదు.* 

*అయితే, అరటి లేదా కొబ్బరి చెట్ల విషయంలో అలా జరగదు. అరటి, చెట్టుద్వారా కాకుండా పిలకలద్వారా మొలిచి పండ్లను ఇస్తుంది. కొబ్బరిచెట్టు విత్తనం కలిగిన చెట్టే అయినప్పటికీ దానికి ఎంగిలి దోషం అంటదు.*

*అందుకే అరటిపండు, కొబ్బరికాయలు పూర్ణ ఫలాలయ్యాయి.*


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat