నామము
కొన్ని నెగటివ్ కిరణాలను అడ్డుకుంటాయి
దిష్టి తగలదు అందంగా కనిపిస్తారు
ఇవి మనకు పెద్దలు చెప్పిన మాటలు
( #అక్షర_సత్యాలు)
నాకు అనిపించిన మరో కోణం
పలానా వారి అబ్బాయి
పలానా వారి అమ్మాయి అని
మనల్ని ఇతరులు గుర్తిస్తే ఎంత గర్వంగా ఉంటుంది
వారి నాన్నగారు వీరు
వారి అమ్మగారి వీరు అని
మన తల్లితండ్రులను ఇతరులు గౌరవిస్తే
మనకు జన్మ ఇచ్చి పోషించే
తల్లితండ్రులకు ఎంత ఆనందంగా ఉంటుంది
నామానికి ఈ మాటలకు ఏమి సంభందం అంటారేమో వస్తున్నా అక్కడికే వస్తున్నా
తల్లితండ్రులను బట్టి మనల్ని గుర్తిస్తే సంబరపడే మనము
ప్రతి నిత్యం మనము ఆరాధన చేసే మనము నమ్ముకున్న
#శ్రీమన్నారాయణుడి అనుచరులుగా దాసులుగా
మనల్ని అందరూ గుర్తిస్తే ఇంకెంత ఆనందపడాలో కదా!!
#తిరునామము తప్పకుండా ధరించండి
కొన్ని కోట్ల విలువ చేసే వాహనానికి
5 రూపాయల నిమ్మకాయ కాపాడుతుంది అని నమ్మే
మనము నామము మనల్ని కాపాడుతుంది అంటే
నమ్మడానికి ఎందుకు అంత ఇబ్బంది
నిమ్మకాయ వల్ల వాహనం కాస్త రంగు మారొచ్చు
కానీ నామము వల్ల నీలో కొత్త కళ వస్తుంది
నమ్మి చెడ్డవాడు లేడు
#శ్రీమన్నారాయణుడి_నామమే_మనకు_సర్వదా_రక్ష
#తిరు_నామమే_మన_దేహానికి_రక్ష