ఉత్రాఖాండ్ లో టేహ్రీగర్వాల్ జిల్లాలో సముద్రమట్టానికి 2723 అడిగుల ఎత్తులో ఉన్న
ఒక ప్రసిద్ధ పట్టణం దేవప్రయాగ.
ఉత్తరాంచల్ రాష్ట్రంలోని హృషికేష్ నుండి 70 కి.మీ., దూరంలో బదరీనాథ్ వెళ్లుదారిలో ఈ క్షేత్రం ఉంది. ఈ పట్టణంనకు ఇక్కడ నివసించిన ఒక ప్రఖ్యాత హిందూ యోగి దేవ్ శర్మ పేరు పెట్టారు.
108 దివ్యతిరుపతులలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన
ఈ క్షేత్రంలో కేదారీనాథ్ లో పుట్టిన మందాకినీ నది, బదరీనాథ్, కొండల్లో పుచ్చిన అలకనందా నది, గంగోత్రిలో పుట్టిన గంగానది మూడు నదులు ఇచ్చట కలుసుకుంటాయి.
త్రివేణి సంగమంగా పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రం శ్రౌద్ధకర్మలకు ప్రసిద్ధి చెందినది.
బ్రహ్మచర్య వ్రతంతో నాలుగు నెలల కాలం ఇక్కడ అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తే మోక్షప్రాప్తి కల్గుతుందని శివుడు నారదునితో చెప్పినట్లు స్కాంధపురాణం వివరిస్తుంది.
ఈ దేవ ప్రయాగ దగ్గర, గంగోత్రి నుండి వచ్చిన భాగీరథీ నది గంగానదిలో కలిసిపోతుంది.
దేవ ప్రయాగ తర్వాత ఉండే ప్రవాహం గంగానది
అనే పేరుతో పిలవబడుతుంది.
అటు భాగీరథి, ఇటు అలకనంద నదులు ఈ రెండు తమ ఉనికని ఈ దేవ ప్రయాగతో కోల్పోతాయి.
దేవ ప్రయాగ ఊరు కొండ ఏటవాలులో, వరుసలుగా మెట్లు మెట్లుగా ఉంటుంది.