బదరీనాథ్ నుండి దక్షిణంగా 38 కి.మీ., దూరంలో విష్ణు ప్రయాగ ఉన్నది.
విష్ణు ప్రయాగకు తూర్పుగా కొంతదూరంలో
‘నితి’ అనే లోయ ప్రదేశం ఉంది.
ఆ లోయలో ఉన్న కొండశిఖరాల మీద నుండి వాలుగా జారపడిన నీరు, ఒక నదీ ప్రవాహంగా మారి దౌలి గంగ (ధవళ గంగ) అనే పేరుతో పడమటి దిక్కుగా ప్రవహిస్తూ వచ్చి విష్ణు ప్రయాగ దగ్గర అలకనంద నదిలో కలిసిపోతుంది.
విష్ణుమూర్థి వీర నారాయణ రూపం ధరించి,
తపస్సు చేయడానికి బదరికావనం వెళుతూ,
ఈ సంగమం దగ్గర కొంతకాలం ఉండి,
తపస్సు చేశాడట.
అందువల్ల ఈ పవిత్ర ప్రదేశానికి విష్ణు ప్రయాగ
అనే పేరు వచ్చింది.
ఇక్కడ ఒక పురాతన ఆలయం ఉంది.
అందులోని దైవం శ్రీ మహావిష్ణువు.