శ్రీ గురుభ్యోనమః
శ్రీశైలం లో హఠకేస్వర స్వామీ దేవాలయం అని ఉంటుంది అక్కడ బయట మర్రి రావి ఉసిరి కలిపి ఉంటాయి వృక్షాలు ఈ గుడి గురించి ప్రస్తుత కాలం లో చాలా మందికి తెలియని విషయం ఒకటి ఉంది పూర్వం రోజుల్లో పిల్లలు లేని వాళ్ళు అసలు ఎన్ని ప్రయత్నాలు చేసినా పిల్లలు పుట్టని వాళ్ళు ivf చేసిన పిల్లలు పుట్టన వాళ్ళు ఈ గుడికి అక్కడ ప్రాదక్షణలు చేసి స్వామీ కి కేవలం దండం పెట్టుకుంటే చాలు మీకు యీ కర్మ వల్ల పిల్లలు పుట్టడం లేదో ఆ కర్మాని స్వామీ తొలగించ తీసేస్తారు దానికి గుర్తుగా బయటకి రాగానే ఏదో ఒక చెట్టు నుండి ఫలాలు రాలేవి వాటిని బార్య బర్త తీసుకుని తిని మళ్ళీ సంవత్సరానికి పిల్లలతో స్వామీ దర్శనానికి వచ్చే వారు శంకరులు ఈ స్వామీ పై అష్టకం కూడా చేశారు
సిద్ధ నాగార్జునుడు రసవేది ఈ ప్రాంతం లోనే చేసేవాడు అని చెప్తారు పెద్దలు ఇంకో గొప్ప విషయం ఆ చెట్ల క్రింద భైరవుడు ఉంటాడు
పరమాచార్య స్పర్శ కూడా ఉంది అది ఎప్పుడైనా చెప్తాను ఎంతో మంది ఋషులు గురువులు యోగులు స్పర్శ ఉన్న దేవాలయం అద్బుతం గా ఉంటుంది పిల్లల కోసం అయితే కచ్చితం అయిన నిదర్శనం ఉంటుంది అక్కడ
రేపు స్వామీ వారి అష్టకం కూడా పెడతాను శుభం జై మహా కాళీ శక్తీ సహిత మహా భైరవేశ్వర స్వామీ నమః