🔱సప్త రుద్ర తాండవ క్షేత్రాలు🔱

P Madhav Kumar


            🚩🚩


తమిళనాడు లోని తిరువారూరు, తిరునల్లారు, తిరునాగైక్కారోణమ్, 

తిరుక్కారాయిల్, తిరుక్కోళిలి, తిరువాయ్ మూర్, తిరుమరైక్కాడు అనే ఏడు శైవక్షేత్రాలు సప్త

నటరాజ తాండవ క్షేత్రాలుగా ప్రసిధ్ధి చెందాయి. ఒక్కొక్క తాండవ స్ధలంలో

ఒక్కొక్క తాండవ భంగిమతో విశిష్టత కలిగివుంది.


తిరునళ్ళారు.. 

ఈ ఆలయంలో నటరాజస్వామి ఉన్మాదంతో తలను త్రిప్పుతూ చేసే తాండవం. ఈ తాండవానికి

'ఉన్మత్త తాండవం అని పేరు.


తిరుమరైక్కాడు.. 

ఈ ఆలయంలో నటరాజు హంసవలే అడుగులు వేస్తూ

చేసే తాండవం "హంసపాద తాండవం".


తిరునాగైక్కారోణమ్...

సముద్రంలో ఉత్తుంగ తరంగాలలా ఎగసిపడుతూ నటరాజస్వామి చేసే నృత్యానికి

"పారావర తరంగ తాండవం"అని పేరు.


తిరువాయ్ మూర్...

కొలనులో గాలికి ఊగే తామరపుష్పం గాలికి మెల్లిగా అటూ ఇటూ ఆడుతున్నట్లు చేసే తాండవం 

"కమల తాండవం" .


తిరువారూరు..

పైకి క్రిందకి ఎగురుతూ పడుతూ ముందు వెనుకలకు కదులుతూ

చూసేవారి మనసులు రంజింపజేయడానికి నటరాజస్వామి యీ ఆలయంలో చేసే తాండవమే

"అజపా తాండవం".


తిరుక్కారై...

కోడిపుంజులా నడయాడుతూ చేసే తాండవం.

ఈ తాండవానికి "కుక్కుట తాండవం " అని పేరు.


తిరుక్కోళిలి..

పుష్పాలచుట్టూ పరిభ్రమిస్తూ భ్రమరం వెళ్ళి ఆడే విధంగా

చేసే తాండవం. ఈ తాండవాన్ని

"భృంగ తాండవం " అంటారు.



Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat