శ్రీ వాణి, శ్రీగౌరీ ! శ్రీ దేవికారూపిణి ! శ్రీ శక్త్యాత్మకే సంతోషిదేవివైయున్న యోదేవతా సార్వభూమామణీ నిత్య సంతోషిణీ లోకసంచారిణీ, భక్త చింతామణీ, దుష్ట శిక్షామణీ ! మంజు భాషామణీ ! పావనీ ! నిన్ను వర్ణింప బ్రహ్మాది శేషుండు మున్నోపగాలేరే ! నేనెంతవాడన్ దయాసాగరీ మున్ను యాదానవానీక దుర్మార్గముల్ బాపగా పెక్కు రూపంబులన్ పెక్కు నామంబులన్ ఉద్భవంబొందవే!
'తొల్లి దుర్మార్గులౌ రక్కసుల్ సొక్కి స్వర్గాది లోకంబులన్ చేరి పుణ్యాత్ములన్ గాంచి కల్లోలముల్ చేయగా దేవతానీకముల్ బాధలన్ చిక్కి తా జేయునద్దేదియున్ గానకోయమ్మ యోదేవీ ! యోశాంభవీ! శాంకరీ ! కనకదుర్గా ! యో కంచి కామాక్షీ ! యోకాళీ ! యో పార్వతీ ! శ్రీ భవానీ ! దేవ దేవీ యటంచున్ కడున్ దీనతన్ పొంది ఆపన్నులై వేడయవతారముల్ దాల్చియున్ పెక్కులున్ బాహువుల్ ఖడ్గముల్ శూలాద్యనేకాయుధాల్ పట్టి ఝుంకార మొప్పార, క్రోధాగ్ని జ్వాలా ప్రకాశంబులన్ వెల్గుచున్ వచ్చు నీ మోహమున్ గాంచి ఆ రాక్షసానిక బృందము లబ్బబ్బ ఈ రూపమేనాడు జూడంగ లేదంచు యోతల్లీ! యోమాత! యోదేవీ రక్షింపవే యటంచున్ తగన్ వేడుచున్నట్టి యవ్వారలన్ వీడి దుర్మార్గులన్ ద్రుంచియున్ బుట్టి వర్ధిల్లునీ మానవానీక మయ్యయ్యో నీయాగ్రహంబందునన్ గల్గగా చేసితే కేకలార్భాటముల్ క్లగా చేసితే రొప్పుచున్ పెక్కులున్ పొక్కు లెక్కించితే దేహ మాయాసమున్, నొప్పులున్ తీపులున్ కల్గగన్ చేసితె నోటికారోగమున్ బాపితే నోటిరుచులన్ నేత్రరోగంబులన్ గల్గగా చేసితేవారె నినుగొల్చిన యుత్సవం బొప్పుగా వించియోతల్లి యోదేవియంచుం కడుంబెక్కుదండంబులన్ పెట్టగన్ జాలియున్ పొంది ఆరోగ్యమున్ పొందంగజేసితే వారు ఆరోగ్యమున్ పొంది స్నానములన్ చేసి యానందవారాశినిన్ దాల్చి నీ యుత్సవం బొప్పుగా చేయుచున్ పండ్లు పక్వాన్న పానీయముల్ మధుర భక్ష్యంబులున్ భక్తితో తెచ్చి నీ కర్పణం బొప్పుగా చేయ సంతోషమును చెంది సర్వార్థముల్ యిచ్చు నీ తల్లీ సర్వార్ధసాధినీ! నిత్యసంతోషిణీ భక్తరక్షామణీ ! నీ కృపాదృష్టిచే మమ్ము కాపాడు నీకన్న మాకెవ్వరున్ వేల్పులున్నారు. నిన్ గొల్చివారవారంబులన్ శుక్రవారంబు నీ పూజలన్ చేసి యానందమున్ బొందు చున్నంత మమ్మెల్ల బ్రోచునన్ మా తప్పులను సైరించి మొప్పగా భావించి మా జేయు, లోపంబులేవైన కలనేని తల్లిగా భావించి రక్షించి కాపాడుమో తల్లి నిన్నుయీ రీతి స్తోత్రంబులన్ చేయు మా బిడ్డలంగాంచి మాయాపదల్ దీర్చి మా తల్లివై బ్రోవుమా; మా తండ్రివై గావుమా మా ఇష్టముల్ దీర్చి మమ్మెల్లకాపాడుమా ! నీ యందు ఎనలేని భక్తియున్ శ్రద్ధయున్ సమకూర్చవే తల్లి యీ దండకం బెప్పుడున్ భక్తిచే బల్కునెవ్వరికిన్ శ్రద్ధచే | మోక్షమున్ గల్గచేయగా గోరితిన్ నాదు వాక్యంబులందున్న లోపంబులన్ ఎంచకే ప్రొద్దు నీదాసదాసున్ నన్ను రక్షింపుమో తల్లి ఓ తల్లి సంతోష సామ్రాజ్య ఆనందసామ్రాజ్య రక్షామణీ ! నిత్య సౌభాగ్య సంరక్షణీ భక్తచింతామణీ దేవి ! సంతోషి నమస్తే నమస్తే నమస్తే నమః.