గాయత్రి దండకం

P Madhav Kumar

 

(కార్య విజయము, శతృవిజయము కొరకు)


శ్రీ మన్మహాదేవి | చిద్రూప విభ్రాజితే | సర్వసర్వేశ్వరీ | జ్ఞానసంధాత్రి || భూతాది యావజ్జగత్సృష్టి సంవర్ధనోచ్ఛేద రక్షే ॥ శివే | శుద్ధసత్వాత్మికే నామరూపాన్వితో పాధి శూన్యే | వియన్మధ్యమార్తాండ సహస్ర సంజాశ దేదిప్యం మాన ప్రభా భాసురే | దేవి శ్రీచక్ర మధ్యస్థచిద్బును పీఠాన్తరస్థే | చతుర్వింశతి స్తుత్యతత్వాత్మికే | శ్రీశ గౌరీశ వాణీశ దేవేశ సంసేవ్యమాన । లసద్భాల సూర్యప్రభాభాస మానాంఫ్రీ పద్మద్వయే | వజ్రవైఢూర్య గోమేధికాపుష్యరాగాది నానామణి మాలికాలాంకృతో రస్థపతే | దీపముక్తాఫలస్ఫీత కాంచీ విరాజత్కటీ మండలే | కోటిపిండాండ బ్రహ్మాండ భాండోదరి | క్షుత్పిపాస్తా మయద్వేష మాత్సర్యసంజాత సంస్కర్ణ సన్తాపజీవాళి సంరక్షణోద్యోగ దీక్షే సమారూఢ హృత్పుండరీకే | గదాశజ్ఞ చక్రాది దివ్యాయుధోపేతహస్తే । లనన్మల్లికా మాధవీ పద్మకల్హార మందార చాంపేయ జాతికనద్దివ్య సౌగంధికారి ప్రసూనాంచితానర్హమాలాంచితానేక సౌవర్ణమాణిక్య హారాద్యలంకార సంశోభి కంఠస్థలే | దివ్యముక్తా ప్రవళాచ్ఛ హేమంబుదశ్వేత వర్ణాతిలా వణ్య గుణ్యోరుపంచాననే । సూర్యచంద్రాగ్నితేజశ్చటా విస్ఫురన్మంజకంజాత పత్ర యతాక్షిత్రయే । నవ్యకేయూర తాటంక చూడామణీ రత్నమాలాది భూషావళీభూషితే । దివ్యరత్నాంచ తానూన కోటిర సంధాత్రి। శ్రీశాంకరి | శ్రీకరిః ప్రాణి దుఃఖాపహృన్మంత్ర రాజస్వరూపే | భవారణ్య దావాగ్ని కీలాయితే | భక్తి గమ్యే | పరాశక్తిరూపే | మహాదేవి | శ్రీ రాజరాజేశ్వరి | బ్రహ్మి | భోగప్రదాత్రి | |వయంభావుకే | | మంత్రయంత్రాత్మికే | సర్వతంత్రాత్మికే । దేవవంద్యే | మహాదివ్యకారుణ్య మూర్తే | స్వభక్తానోద్యోగ సంసూచనాబద్ధ నిర్భీతి ముద్రావహే | శత్రునిర్మూలనోద్యద్గదాఖడ్గ చాపాంకుశాద్యాయుధాలాకృతే | భుక్తిముక్తి ప్రదే | | దేవి : సావిత్రి | గాయత్రి మాం పాహి మాం పాహి మాతస్త్వదన్యం నజానే నమస్తే నమస్తే నమస్తే నమః ||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat