బాదం పప్పుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇక పాలలో అయితే కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు ఉంటయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు.
కొంతమంది బాదం పప్పులను పాలలో వేసుకుని తాగుతుంటారు. ఎందుకంటే పాలు టేస్టీగా ఉంటాయని. కానీ ఇలా ఈ రెండింటినీ మిక్స్ చేసి తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు తెలుసా? నిజానికి బాదం, పాలు వేర్వేరుగా వాటి స్వంత ప్రయోజనాలను కలిగి ఉంటాయి. బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి.
పాలలో క్యాల్షియం, విటమిన్లు, మినరల్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన శరీర అవసరాలను తీర్చడానికి సహాయపడటమే కాకుండా.. చర్మ సమస్యలు వంటి ఇతర బాహ్య సమస్యలను కూడా పరిష్కరిస్తాయి. చలికాలంలో బాదం పప్పును పాలతో కలిపి తీసుకోవడం వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..
బాదంలో మెగ్నీషియం, విటమిన్ ఇ, డైటరీ ఫైబర్ వంటి విలువైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పాలలో మూడు లేదా నాలుగు బాదం పప్పులను వేసి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. రోజూ బాదం కలిపిన పాలను తాగడం వల్ల శరీరంలో విటమిన్ ఇ స్థాయి పెరుగుతుంది. ఇది మీ చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.
పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా చాలా అవసరం. బాదం పాలు తాగడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఎముకలు బలంగా తయారవుతాయి. ఒక కప్పు బాదం పాలలో 39 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఈ పాలు ఆకలిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. బరువు తగ్గడానికి ఇది ఒక గొప్ప పానీయం. బాదం పాలు బరువు నిర్వహణలో కూడా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గుప్పెడు బాదం పప్పులను పాలలో వేసి తినడం లేదా బాదం పలుకులను కలిపిన పాలను తాగడం వల్ల జీర్ణశయాంతర ప్రేగు కదలికను నిర్వహించడానికి, మలబద్దకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలో పోషకాల శోషణను పెంచుతుంది.
బాదంలో మెగ్నీషియం, విటమిన్ ఇ తో పాటుగా ఇతర పోషకాలు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇకపోతే ఎముకలకు అవసరమైన కాల్షియంను పాలు అందిస్తాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుండటమే కాకుండడా వివిధ చర్మ సమస్యలు, హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతాయి. మరి బాదం పాలను ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కావల్సిన పదార్థాలు
గుప్పెడు బాదం పప్పులు
1 గ్లాసు పాలు
1 టేబుల్ స్పూన్ పంచదార
ఎలా తయారు చేయాలి
ముందుగా బాదం పప్పులను మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో పాలు, పంచదార వేసి కలపాలి. అంతే ఆరోగ్యకరమైన బాదం పాలు రెడీ అయినట్టే..