*గర్భములో శిశువు పిండ రూపంలో వున్నప్పుడు భగవంతుని ప్రార్థిస్తాడా? ఎలా?

P Madhav Kumar



▪️స్త్రీ గర్భములోనే శేషన దు:ఖముతో జీవుడు ప్రవేశిస్తాడు. *ఫలదీకరణము జరిగిన తరువాత శిశువు పరిణామక్రమము*.


▪️ఒక రోజుకు ఖలిలమౌతాడు.


▪️ఐదు రోజులకు బుద్భుదాకారము పొందుతుంది.


▪️పది రోజులకు బదరీఫలములాగా కఠినమైన మాంసపు ముద్దగా తయారవుతాడు.


▪️ఒక నెలకు శిరస్సు ఏర్పడుతుంది.


▪️రెండు నెలలకు బాహువులు తదితర అవయవాలు ఏర్పడుతాయి.


▪️మూడు నెలలకు గోళ్లు, రోమాలు, చర్మము, లింగము, నవరంధ్రములు ఏర్పడుతాయి.


▪️నాలుగు నెలలకు సప్త ధాతువులు ఉద్భవిస్తాయి.


▪️ఐదు నెలలకు ఆకలి దప్పికలు ఏర్పడుతాయి.


▪️ఆరు నెలలకు జరాయువు, మావిచేకప్పబడి గర్భంలో దక్షిణాన తిరుగుతుంటాడు.


▪️మాతృ భుక్తాన్న పానీయాలచే క్రమక్రమంగా వృద్ది చెందుతూ *దుర్గంధ భూయిష్టమైన మల మూత్రాల గుంటలో ఉన్న పురుగులు, సుకుమారమైన శరీరాన్ని కరుస్తూ ఉండగా, ఆ బాధకు తట్టుకోలేక మాటిమాటికి మూర్చబోతాడు*. నరకయాతన, నరకాను భవము జీవుడు మాతృ గర్భంలోనే అను భవించడం ప్రారంభమవు తుంది.


▪️తల్లి తీసుకునే ఆహారములోని, దుస్సాహాలైన కట్వామ్ల(ఉప్పు) లవణాది పదార్థముల వలన సర్వాంగాల యందు వేదన కలుగుతూ ఉంటుంది. *మావి చేత ప్రేవుల చేత చుట్టబడి వక్రీభూతమై పృష్ఠశిరోధరుడై, అధః శిరస్కుడై తల్ల కిందులుగా ఉంటాడు. పంజరంలో పక్షి లాగా జీవుడు గర్భంలో బంధింప బడి ఉంటాడు. *అప్పుడు భగవంతుని దయ వలన, పూర్వ జన్మలలో చేసిన పాపములు గుర్తొస్తాయి*. అపుడు గత జన్మలో చేసిన పాప పుణ్యముల కారణంగానే కదా ఈ జన్మమునకు వచ్చింది, అని బాధ పడుచూ ఉంటాడు. *కర్మ ఫలితం అనుభవించడానికే కదా మరలా ఈ జన్మ అని గుర్తుకు వచ్చి బాధపడుతూ ఉంటాడు*. అలా పరితపిస్తూ జీవుడు బంధభూతాలైన సప్తధాతువులు కలిగి, భగవంతుని మీద కృతజ్ఞతతో ( *మరలా మానవ జన్మ ఇచ్చినందుకు*) గద్గద స్వరంతో భగవంతుని ప్రార్థించడం గర్భంలోనే ప్ర్రారంభిస్తాడు.


▪️ *గత జన్మలలో చేసిన పాపపుణ్యముల సంఘాతమే కదా ఈ మానవజన్మ?. అని తలంచుచూ భగవంతునికి మాతృ గర్భంలో ఉన్నప్పుడే మాట ఇస్తాడు*. ప్రమాణం చేస్తాడు.


▪️ *ఓ శ్రీహరీ! నీ మాయచే మోహితుడు కావడం వలన బిడ్డలు, భార్య, అహంకారము, మమకారము, కామము వీటియందు పడి, సంసార నిమగ్నుడనై, సంసారమే బ్రతుకని మంచి, చెడులను విడచి ధర్మము, అధర్మము అని చూడకుండా, ధన సంపాదనేధ్యేయంగా,చేయకూడని, చెప్పుకోలేని పాపములు జరగ డానికి కారకుడయ్యాను*. అలా సంపాదించిన ధనము, భాగ్యములను నా భార్యాబిడ్డలు అనుభవించుచున్నారే కానీ నన్ను గురించి పట్టించుకోవడం లేదు. *నేను సంపాదించిన ఆస్తిపాస్తులు బిడ్డల పాలు; పాపములు మాత్రం నా పాలు అయినది*.

ఓ భగవంతుడా ఈ దుర్గంధముతో ఈ గర్భములో ఇక ఉండలేను. దయచేసి నన్ను బయటపడవేయుము. *నేను బయటపడితే ఈ సారి పాప కృత్యముల జోలికిపోను. నన్ను నమ్ముము*. 🕉️మీ చరణార విందములను విడువను. ఎల్లప్పుడూ మీ చరణాలనే స్మరిస్తూ ఉంటాను. ఈ సారైనా ముక్తి✅️ పొందడానికి ప్రయత్నము చేస్తాను. *ఈ సారి నాకు సంసారబంధము లను కట్టబెట్టవద్దు. పొరపాటున కూడా సంసారము జోలికి పోను*. పరాత్పరా!ఈ మల మూత్ర కూపములోని దుర్గంధమును భరిచలేక, మరియు *జఠరాగ్ని రూపంలోని వేడి వలన మాడిపోవుచున్నాను. భరించలేకున్నాను*. నన్ను బయట పడవేయుము. *మిమ్ములను మరచిపోను అని ప్రార్థిస్తాడు జీవుడు*.


▪️మరి మాతృ గర్భంలో భగవంతునికి ఇచ్చిన మాటను మనము నిలబెట్టుకుంటున్నామా? *ఆలోచించండి*. మీరే తగు నిర్ణయం తీసుకోండి. *ఎందుకంటే మనము విజ్ఞులము*.


🕉️గరుడ పురాణ ప్రధమాధ్యాయ ఐహిక, ఆనుష్మిక, దుఃఖ నిరూపణము నుండి...🙏🏻🕉️ హరిః ఓమ్.




#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat