🔥ఇంట్లో చేయవలసిన మహిమనిత్యమైన పూజలు🔥

P Madhav Kumar



🌹🌹🌹🌹🌹🌹🌹🌹


 ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు. ఒకటి ఇలవేలుపుని కొలుచుకోవడం, రెండు ఇంటి ప్రధాన గుమ్మం "గడప"కు పూజ చేయడం కార్తీకం, మార్గశిరలోనలో చూస్తాము.


ఇంటి గడపను సింహ ద్వారమని, లక్ష్మీ ద్వారమని, ద్వారలక్ష్మి అని అంటారు. ఈ గడపకు పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టడం వరకు చాలా మందికి తెలిసినదే ఎందుకు చేయాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సంప్రదాయంగా ఆచరిస్తున్నారు. గడపలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు.



గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు, దేవతలకు ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకడం. ఎటువంటి అమంగళం ఈ గడపదాటి ఇంట్లోకి రాకూడదు అని కోరుకోవడం.


ఇప్పుడు ఈ గడప పూజతో కొన్ని సమస్యలకు పరిష్కారం తెలుసుకుందాం.


పెళ్లి కాని అమ్మాయిలు ఎన్ని సంబంధాలు చూసిన కుదరక జాతకాల విషయంలో అంతరాయాలు ఏర్పడే వాటికి కట్న,కానుకల విషయంలోను ఏదో ఒక ఆటంకంతో ఆలస్యం అవుతున్న అమ్మాయిలు 16 రోజులు ఇంటి ప్రధాన గడపకు పూజ చేయాలి.




🔸 పూజ విధానం


1. ఉదయం 5 గంటలకు ఈ పూజ చేయాలి 16 రోజులు పాటు ఆటంకం లేకుండా అదే సమయంలో చేయాలి.


2. మొదట గడపను నీటితో మూడు సార్లు కడగాలి. తర్వాత పాలుపోసి కడగాలి అంటే అభిషేకం చేసిన విధంగా కొద్దీ పాలతో పోసి చేతితో గడపను పాలతో తుడవాలి. తర్వాత చివరిగా ఇంకోసారి నేటితో గడపను శుభ్రం చేయాలి.


3. గడపకు పసుపుకుంకుమ, పువ్వులు పెట్టి అలంకరించాలి.


4. చిన్న పళ్లెంలో మూడు ఒత్తులు ఒకే దీపంలో పెట్టి ఆవు నెయ్యి కానీ, నూనె కానీ పోసి వెలిగించాలి.


5. ఇంకో పళ్లెంలో బెల్లం అటుకులు, తాంబూలం పెట్టి ముందుగా వినాయకుడికి నమస్కారం చేసుకునే మంచి పెళ్లి సంబంధం కుదరాలి ఆ ఇంట్లో శుభకార్యం జరగాలి అని సంకల్పం చెప్పుకుని వెంకటేశ్వరస్వామి అష్టోత్తరం, లక్ష్మి అష్టోత్తరం చదువుకుని హారతి ఇవ్వాలి.


6. గడప దగ్గర పెట్టిన దీపానికి నమస్కరించి కొండ ఎక్కే వరకు ఉంచి తర్వాత తీసేయాలి.


7. పూజ అయిన వెంటనే వెళ్లి నిద్రపోకూడదు, ఒక అరగంట అయినా ఆగి తర్వాత నిద్రపోయినా ఫర్వాలేదు.


8. ఆ పదహారు రోజులు పూజ గదిలో దీపం వెలిగించిన చాలా శుభం.


పెళ్లి కాని అబ్బాయిలు కూడా ఇదే విధంగా ఉదయం 3 గం౹౹లకు పూజ చేసి ఆ ఇంట మంచి అమ్మాయి భార్యగా రావాలి అని కోరుకోవాలి.


లేదా ఆ పిల్లవాడి తల్లి, కొడుకుకు సంబందించిన వస్త్రం ఏదైనా భుజాన వేసుకుని ఆ ఇంట కోడలు అడుగు పెట్టాలి అని కోరుకుని పదహారు రోజులు ఈ గడప పూజ చేయచ్చును.


ఇంట్లో సమస్య, ఇంటిపైన అప్పు కానీ, ఇంటి పత్రాలు తాకట్టులో ఉండి ఏదైనా కోర్ట్ గొడవ ఇంటి పైన ఉన్నను, ఆ ఇంటి యజమాని కానీ భార్య భర్తల ఇద్దరు కలసి కానీ..,


లేదా భర్త ఆరోగ్యం సహకరించని స్థితిలో భార్య అతని వస్త్రం భుజాన వేసుకుని ఇంటి సమస్య తీరాలి అని వేడుకుని పైన చెప్పిన విధంగా గడపకు పూజ చేసి లక్ష్మి నారాయణ అష్టోత్తరం, మణి ద్వీపవర్ణన చదువుకుని హారతి ఇవ్వాలి.


ఆ ఇంటిలో ఉన్న సమస్య తీరిపోతాయి. ఈ విధంగా గడపకు పూజలు చేసి ఎన్నోసమస్యలు పరిష్కరించే వారు పూర్వీకులు...

.

యంత్ర మహిమ ప్రయోజనం


( అది సాక్షాత్తు భగవంతుని ప్రతిబింబం)


యంత్రం అనేది ఎవరైనా ఒక దేవతామూర్తి యొక్క బీజాక్షరాల సమూహముతో జ్యోతిష్య మరియు తాంత్రిక శాస్త్రాల రీత్యా ఉన్న మంత్రములతో ఆ ప్రత్యేకమైన చక్రములలో నిక్షేపము చేసి మొత్తానికి ఆ యంత్రములో సర్వ శక్తులను, అష్ట దిగ్పాలకులను ఆవాహనం చేసే ఒక దివ్యమైన చక్రం. యంత్రములో ఉన్నటు వంటి బీజాక్షరాల ప్రభావం వలన నెగెటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జి పెరుగుతుంది.


ఎక్కడైతే యంత్ర స్థాపన జరుగుతుందో అక్కడి నుండి నెగెటివ్ ఎనర్జీ దూరమయి పాజిటివ్ ఎనర్జి వచ్చి చేరుతుంది. ఈ యంత్ర సాధనా ప్రభావం మన మనస్సుపై పడుతుంది. మానవుని శరీరమును నిత్యం ప్రభావితం చేసేది మనస్సు మాత్రమే. ఆ మనస్సు పై మానవుని సకల ఆరోగ్యము కూడా ఆధారపడి ఉంటుంది.మనం ఏదైనా దేవాలయమునకు వెళ్ళినపుడు మన మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆ దేవాలయము నుండి అడుగు బయట పెట్టగానే ఏదో మాయ కమ్మినట్టు మన మనస్సు యధా విధిగా మారిపోతుంది. దీనికి కారణం ఏమిటంటే దేవాలయములో ప్రతిష్ట చేసిన విగ్రహాల క్రింద వివిధ వేద మంత్రములతో, బీజాక్షరములతో ఒక యంత్రమునకు జీవం పోసి ప్రతిష్ట చేసి స్థాపితం చేస్తారు.ఆ మాహత్యం గల యంత్ర ప్రభావము చేతనే ఆ ప్రాంతం మొత్తం పాజిటివ్ శక్తిగా ఉంటుంది.


ఆ పాజిటివ్ శక్తి మన మనస్సు పై పడి మన మనస్సును ఉత్తేజ పరుస్తుంది. ఏ సమస్య గురించి మనకు బాధలు కలుగుతున్నాయో అలాంటి ప్రతి సమస్యకు ఒక నిర్ధిష్టమైన యంత్రమును తెలియ జేయడం శాస్త్రమును అవపోసన పట్టిన ఒక్క జ్యోతిష్యునికే ఇది సాధ్యపడుతుంది. ఆ నిర్ధిష్టమైన యంత్రమును ప్రత్యేక బీజాక్షరాలతో, నిర్ధిష్టమైన రోజుల కాలము పాటు శ్రద్ధగా పూజించినట్లైతే సమస్యల నుండి విశ్రాంతి లభిస్తుంది.


ఒక విధంగా చెప్పాలంటే యంత్రం అనేది భగవంతునికి ప్రతిబింబం లాంటిది.యంత్రము అనగా నియమ నిష్టలతో నియంత్రించేది అని అర్థం. దేవతలకు నివాసయోగ్యమైన గృహము అని అర్థము. ఈ యంత్రమునే దేవతా నగరం, దేవత ఆవాస స్థానం అని కూడా అంటూ ఉంటారు. యంత్రములో కొలువైయున్న సమస్త దేవతా మూర్తులు సకల దోషములను నివృత్తి చేసి మానవజాతికి శుభములు చేకూరుస్తారు. కాబట్టి యంత్రములను సిద్ధిచేసి పరిపూర్ణమైన పంచోపచార పూజ ప్రక్రియలు అన్నీ శ్రద్ధగా చేసి స్థాపన చేసినట్లైతే యంత్రము యొక్క పరిపూర్ణ ఫలితములు పొందవచ్చు.


యంత్రము, మంత్రము, తంత్రము ఇవన్నీ కలిస్తేనే పూజా అని అంటారు. కొందరు తాంత్రికము అనగానే అది ఏదో చెడు కలిగించే ప్రక్రియ అని అంటారు. కానీ ఇది ఎంత మాత్రము నిజము కాదు. ఇతరులకు చెడు కలిగించే ప్రక్రియను 'కుతంత్రము' అంటారు. ఔషధ ప్రయోగముకు గృహనిర్మానముకు, దేవాలయ నిర్మాణముకు, దేవాలయ ఉత్సవాలకు, దేవాలయ నిత్య ఆరాధనలు, దేవాలయ ఆగమ శాస్త్రములు, వామచారము ఇవన్నిటిని తంత్రములు అని పిలుస్తారు.


యంత్రములోని మధ్యభాగములో దైవశక్తి కేంద్రీకరించబడి ఉంటుంది అని తంత్ర శాస్త్రములోని నమ్మకము. ఒక్కొ యంత్రము ఆ యా దేవతామూర్థులకు సంబంధించి నిర్ధిష్టమైన రేఖా చిత్రాల రూపములో చెక్కబడి ఉంటుంది. తంత్ర శాస్త్రములో శక్తికి, శక్తి యొక్క ప్రతిరూపాలకి ఈ యంత్రమును ఉపయోగిస్తారు. ఎంతో శక్తివంతమైన యంత్రములు వాటికి సంబంధించిన బీజమంత్రములతో ధ్యానము గావించి , నిర్ధిష్టమైన రోజుల పాటు, నిర్ధిష్టమైన సంఖ్య సార్లు జపించి సిద్ధి పొంది ఆ యంత్రము నుండి పరిపూర్ణ ఫలితములు పొందవచ్చు...


🌹సర్వేజనాసుఖినోభవంతు 🌹

.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat