శివుని లింగరూపంలో ఎందుకు పూజిస్తారు. ఏదైనా శాపమా?

P Madhav Kumar

 ధర్మసందేహాలు - సమాధానాలు

#జ : శాపాలేవీ కావు. సదాశివునికి 1.అకల, 2.సకల అనే రెండు తత్త్వాలున్నాయి. 

 అకలం - నిరాకారం, నిరంజనం, నిర్గుణం.

 సకలం - సగుణం.

 మొదటిది - బ్రహ్మ జ్యోతి స్వరూపం.

 రెండవది - భక్తానుగ్రహ విగ్రహం.

' అకల - తత్త్వాన్ని తెలియజేసేదే - అవయవరహితమై, జ్యోతి స్వరూపంగా, ఆద్యంతములు లేని లింగరూపం.

' సకలం 'గా - చంద్రశేఖర, శూలధారి, చర్మాంబరుడు

 మొదలైన దివ్యమూర్తులు.

 ఈ అకల, సకల తత్త్వాలు రెండు ఆరాధ్యాలే.

' లింగం ' అంటే 'చిహ్నం' అని అర్థం. పరతత్త్వానికి చిహ్నం లింగం.

' లయనాల్లింగముచ్యతే ' అని నిర్వచనం. సర్వం దేనిలో లీనమై ఉంటుందో ఆ పరమాత్మే లింగరూపి. ఈ కారణంచేతనే లింగ రూపంలో శివుని ఆరాధిస్తారు. ఈ సమాధానానికి ప్రధాన ఆధారం శివ పురాణాదులు.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat