జీవితమంటే పుట్టటం, బతకటం, చావడమే కాదు.

P Madhav Kumar


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


జీవితం తర్వాత కూడా జరగాల్సింది చాలా ఉంటుంది. ఈ మానవశరీరం జీవుడికి ఒక వాహనం మాత్రమే.*

❤️ *మనమొక తీర్థయాత్రకు వెళ్లాలంటే బస్సు,కారు,రైలు ఏదో ఒకటి ఎక్కుతాం. కొంత సమయం ప్రయాణిస్తాము. తర్వాత అనివార్యంగా వాహనం వదిలేసి వెళ్లవలసిందే. వాహనంలో చేసే ప్రయాణమే తీర్థయాత్ర కాదు కదా!వాహనం దిగినాక మందిరానికి వెళ్లి దైవదర్శనం చేసుకొని వస్తేనే తీర్థయాత్ర పూర్తి అయినట్టు.* 

💓 *అలాగే జీవునికి కూడా ఈ మానవశరీరం ఒక వాహనం మాత్రమే. వాహనం దిగిన తర్వాత కూడా చేయాల్సింది ఎంతో ఉంటుంది. కానీ మనం వాహనమే(జీవితమే)మన గమ్యం అనుకుంటున్నాము.* 

💞 *అందుకే మరణానికి అవతల ఉన్న విషయం గ్రహించలేక పోతున్నాం. జీవుడు పరమాత్మలో ఐక్యమయ్యే అవకాశాన్ని మనం చేతులారా విస్మరిస్తూ జీవితకాలాన్ని వృధాచేస్తున్నాం. కానీ మనలో ఉన్న జీవాత్మ పరమాత్మలో ఐక్యమైతేనే ఈ ప్రయాణం పరిపూర్ణంగా అయినట్టు భావించాలి. మనలో ఉన్న జీవుడు ఎన్నో రకాల జన్మలు ఎత్తిన తరువాత ఈ మానవజన్మ స్వీకారం చేశాడు.*

❤️ *మిగితా జన్మలలో లాగా కాకుండా మానవజన్మలో ఉన్న విచక్షణాజ్ఞానంతో ఉపనిషత్తుల సారాంశం అభ్యాసం చేసి ఆత్మజ్ఞానాన్ని పొంది, ఆత్మ సాక్షాత్కారం కోసం భక్తితో జ్ఞాన వైరాగ్యములు పొందాలి.*

💝 *జన్మజన్మల నుండి క్షణికమైన ఇంద్రియసుఖాలను అనుభవిస్తూనే ఉన్నాము. జీవితమంతా భోగలాలసలో ముగిసిపోతూనే ఉంటుంది, ఈ జన్మలో కూడా చాలా సంవత్సరాలుగా ఎన్నోరకాల వస్తు ప్రపంచాల్లో ఈ ఇంద్రియభోగాలను అనుభవిస్తూనే ఉన్నాం.*

💕 *ఐనా ఇంకా సంతృప్తి లేకపోతే ఇంకెప్పుడు ఎప్పుడు వస్తుందా సంతృప్తి ? ఎడారిలో మృగతృష్ణ వెంట నీటికోసం పరుగులు తీస్తున్నట్లు ఈ భోగలాలస, ఇంద్రియ సుఖాలు మనల్ని సత్యంవైపు కాకుండా మిథ్యవైపు పరుగులు పెట్టిస్తుంది.*

💞 *ఈ ఇంద్రియసుఖాలు మనల్ని వంచిస్తూ,మోసగిస్తూనే ఉంటాయి. మనస్సు పరిపరివిధాలుగా మనల్ని బౌతికసుఖాల వైపు లాగుతూనే ఉంటుంది.*

💝 *ఓర్పు, సహనంతో…త్యాగం, వైరాగ్యం వంటి లక్షణాలను అలవర్చుకోవాలి. ఆత్మసాక్షాత్కారాన్ని పొంది, అనంతమైన ఆత్మసంతృప్తినీ, ఆనందాన్నీ పొందాలి. మనం నిద్ర పోతున్న అజ్ఞానం నుండి మేల్కోవాలి.*

💝 *మనం కట్టుకున్న బట్టలకు నిప్పంటుకుంటే శీఘ్రంగా నీటిలోకి దూకి మంటలార్పుకోడానికెలా ప్రయత్నిస్తామో అలాగే ఈ భవ సంసారంలో మాడి, మసి అవ్వక ముందే అజ్ణానాంధకారం నుండి మేల్కోవాలి.* 

💖 *మనలో వైరాగ్యం, ముముక్షత్వం కోసం కోరిక ఉదయించాలి. ఎంత తీవ్రంగా కోరిక ఉండాలంటే ఏ గురువో మనల్ని శీఘ్రంగా సంసార దుఃఖసాగరం నుంచి కాపాడేలాగా, మోక్షంవైపు తోసివేసేలాగా ఈ ఇంద్రియసుఖాల వెంట పరుగులు పెట్టడంవల్ల ఆయాసం, అనారోగ్యం పెరిగి అవయవపటుత్వం తగ్గి, శక్తి హీనత కలుగుతుంది.* 

💓 *ఇంద్రియసుఖాలను అనుభవించాలనే తపన చెందుతూ మేథాశక్తిని క్షీణింపచేసుకుని ఆత్మను మర్చిపోయి, ఆత్మసాక్షాత్కారానికి దూరమైపోతున్నారు. యాభై సంవత్సరాల్లో గడిపిన జీవితాన్ని ఒక్క గంటసేపటి కలలో గడిపేయొచ్చు. మేల్కొన్న వెంటనే అది “కల” అనీ, “భ్రమ” అనీ అనిపిస్తుంది.*

💝 *అలాగే ఆత్మసాక్షాత్కారం పొందిన వెంటనే ఈ జీవితం కూడా “మిధ్య” గా, ఒక దీర్ఘ ఘనీభవించిన “కల”గా మారిపోతుంది.*

💖 *ఏకాగ్రతను పెంచుకోడానికి “ఉపాసన” యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని మనం గ్రహించాలి.*


🌹సర్వేజనాసుఖినోభవంతు 🌹

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat