ధర్మసందేహాలు:
గర్భిణి యగు కోరిన వస్తువు దెచ్చియిచ్చుట ముఖ్యము. చిరాయుష్యము గల పుత్రుడు కల్గును. లేనిచో దోషము కల్గును.
సముద్ర స్నానము, చెట్టు నరుకుట, క్షౌరము, శవము మోయుట, విదేశ ప్రయాణమును చేయకూడదు.
సప్తమ మాసము మొదలుగు క్షౌరము మైధునము తీర్థయాత్రయు శ్రాద్ధభోజనమును నావ ఎక్కుటయు విడువవలెను.
యుద్ధాదికము, గృహాది నిర్మాణము, నఖకేశములు కత్తిరించుట, చౌలకర్మశవము అనుసరించి వెళ్లుట, వివాహము ఉపనయనము పిండదానము అన్నివిధముల ప్రేతకర్మయు చేయగూడదు.
గర్భిణీపతికి క్షౌరనిషేధమున్నప్పటికిని నిమిత్త మున్నచో జేసుకొనతప్పదు. మఱియు ప్రేతకర్మజేయుటకు నిషేధమున్నప్పటికిని పితృప్రేతకర్మ చేయకతప్పదు.