జ. దేవాలయంలో ప్రదక్షిణలు చేసిన తర్వాత ధ్వజస్తంభానికి నమస్కరించుకుని, ఆలయంలోకి వెళ్లాలి. అంతేకానీ దానిని తాకకూడదు.
మనకు వెన్నుముక ఎటువంటిదో ఆలయానికి ధ్వజస్తంభం అటువంటిది.పరమాత్మ స్థానం గుండె. వెన్నుముక ఈ గుండెను దాటి అంటే విశుద్ధిచక్రం వరకు ఉంటుంది. సహస్రార చక్రంతో అనుబంధాన్ని కలిగి ఉంటుంది. అలాగే దేవాలయంలోని ధ్వజస్తంభం గర్భగుడిని అంటే దైవవిగ్రహాన్ని దాటి ఉంటుంది. వెన్నుముక ఒకే ఒక్క ఎముక. అలాగే ధ్వజస్తంభం ఏకాండి కొయ్య. ప్రత్యేక అర్హతలు ఉన్న కొయ్యనే ధ్వజస్తంభంగా వాడతారు.
సేకరణ....