🌺కొబ్బరికాయ కొట్టేముందు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలంటున్నారు జ్యోతిష్య నిపుణులు. పూజ చేశాక కొబ్బరికాయ కొట్టడం అనేది మనకు ఉన్న పద్ధతి, ఆచారం పూజ పూర్తయిన తరువాత టెంకాయ కొట్టేశాం, నైవేద్యం పెట్టేశాం, తంతు పూర్తయిందని అనుకుంటూ ఉంటాం. కానీ టెంకాయ కొట్టడంలో కూడా ఒక పద్ధతి ఉంది.🌺
🌺శాస్త్రం ప్రకారం కొబ్బరికాయ కొట్టడంలో కొన్ని నియమాలున్నాయి. టెంకాయ కొట్టేటప్పుడు స్వచ్ఛమైన నీటితో కడిగి ఆ తరువాత టెంకాయ పీచు ఉన్న ప్రదేశంలో పట్టుకోవాలి. టెంకాయ కొట్టేటప్పుడు ఆ రాయి ఆగ్నేయ దిశగా ఉండాలి దానిని 9 అంగుళాల ఎత్తుపై పెట్టి దాని పైన కొబ్బరికాయను కొడితే మంచిది. కొబ్బరి కాయ సరిగ్గా రెండు భాగలుగా పగలాలి అంటారు. కొద్దిగా అటూ, ఇటూ అయినా పర్వాలేదు.
కొన్నిసార్లు టెంకాయ లోపల నల్లగా ఉంటుంది. అదేదో అశుభం అనుకోనక్కర్లేదు. దానివల్ల ఎలాంటి అశుభాలు జరుగవు. అలా కొబ్బరికాయ లోపల నల్లగా వుంటే శివాయ నమహా అంటూ 108 సార్లు జపించితే అంతా మంచే జరుగుతుంది.
కొంతమంది టెంకాయ కొట్టినా రెండు చిప్పలను చేతితోనే పట్టుకుని పూజ చేస్తుంటారు. అలా చేయకూడదు. అలాగే టెంకాయను కొట్టి ఒక గ్లాసులో ఆ నీటిని తీసుకుని వేరుగా ఉంచాలి. పాత్రలోని కొబ్బరి నీటితో మాత్రమే దేవునికి సమర్పించాలి. ఇలా కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించేటప్పుడు ఆ నీటిలో పంచదార వేసి నైవేద్యంగా పెడితే మంచిది.🌺
🌺మనము ఎంత సాకేతిక కాలములో ఉన్న, మన సంప్రదాయము, పూజ మరియు పుణ్య కార్యాలు మనుకోకూడదు