🎻🌹🙏 అమావాస్య తిథి గురించి కొంచెం వివరణ..

P Madhav Kumar


🌸ఉగ్ర భూతాలు, పిశాచాలు, బ్రహ్మ రాక్షసులు, భూత గణాలు, అసురి శక్తులు , తమో గుణ, రజో గుణ శక్తులు ఇవ్వన్ని లోకాన్ని పిడించేవి.


🌿వీటి ద్వారా లోకం లో ఉన్న జీవ గణాలు చాలా ఇబ్బందులు పడ్డారు. గమనిక:- శివ భూత గణాలు వేరు. అవి కైలాసం లో ఉంటాయి. 


🌸వీటి బాధలు పడలేక ప్రజలు సిద్ధ సాధువులను, యోగులకు ఆశ్రయించారు. వీటిని యోగులు కూడా కట్టడి చేయలేకపోయారు. 


🌿అప్పుడు అందరూ కలిసి శివుణ్ణి 

ప్రార్థన చేశారు. హే భగవాన్ మీరు ఈ ఉగ్రభూతాలను కట్టడి చేయాలి. మమ్మల్ని కాపాడాలి. అని ప్రార్థన చేశారు. 


🌸అప్పుడు హా ప్రార్థనను, వారి కోరికను శివుడు ప్రసన్నంగా స్వీకరించాడు. అందరికి 

అభయం ఇచ్చాడు. ప్రియ భక్తులార మీకు అభయం ఇస్తున్నాను. 


🌿ఈ భూతాలను సిద్ధ సాధువులు, యోగులు, దేవతలు కట్టిడి చేయలేరు. కాబట్టి ఇక నుండి 

నేనే స్మశానం లో ఉంటాను. వాటిని నా అదుపులో ఉంచుకుంటాను అని అన్నాడు.


🌸అప్పటి నుండి ఈ సర్వ భూతాలు, అన్ని తమో, రజో శక్తులు , బ్రహ్మ రాక్షస శక్తులను

శివుడి కి భయపడి అణిగి మణిగి ఉన్నాయి.


🌿అప్పుడు భూతాలు, పిశాచలూ

అన్ని తమో గుణ రజో గుణ శక్తులు, బ్రహ్మ రాక్షస శక్తులు శివుణ్ణి ఈ విదంగా ప్రార్థన చేశాయి.


🌸యే భగవాన్ మమ్మల్ని మీరు స్మశానంలో కట్టడి చేశారు. మేము కూడ మిమ్మల్ని పూజించాలి అని కోరాయి. 


🌿అప్పుడు శివుడు సరే అని మీరు 

ప్రతి అమావాస్య తిథి నాడు నా ఆలయంలో మీరు దర్శనం , పూజలు చేసుకోండి. ఆ తిథి నాడు నా ఆలయంలో ఉండండి అని వరం ఇచ్చాడు.


🌸అలాగే నా భక్తులని మీరు ఏమీ చేయవద్దు అని హా భూతాలను హెచ్చరించాడు. నా సాధారణ భక్తులకు మీరు కనపడవద్దు అని వారికి చెప్పాడు.


🌿వాటికి అన్ని భూతాలు ఒప్పుకున్నాయి. ప్రతి అమావాస్య తిథి నాడు అన్ని భూతాలు శివ ఆలయం లో ఆరాధన చేస్తాయి. కొన్ని బ్రహ్మ రాక్షస భూతాలు శివ ఆలయంలోని వెనుక భాగంలో గురక పెట్టి నిద్రపోతాయి.


🌸కాబట్టి ఆలయ వెనుక భాగాన్ని ముట్టవద్దు. తాక వద్దు. ఇక పౌర్ణమి తిథి నాడు శివుడు దేవతలకి, యోగులకు, సత్వ గుణ శక్తులకి అవకాశం ఇచ్చాడు. 


🌿ఈ అమావాస్య తిథి మరియు పౌర్ణమి తిథి నాడు శివ ఆరాధన చేసి నిరుపేదలకు వస్త్రదానం, అన్నదానం, ధన దానం రహస్యంగా చేయడం ద్వారా ఈ పిచాచ, భూత, రజోగుణ, తమో గుణ శక్తుల పీడలు పోతాయి...స్వస్తి.....

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat