🙏🌺 పూజ చేసిన తర్వాత పసుపు గణపతిని ఏమి చేయాలో తెలుసా🌺🙏

P Madhav Kumar


🌺హిందూ సంప్రదాయాల ప్రకారం మనం ఏ పూజ చేసినా., ఏ వ్రతం చేసుకున్నా., ముందుగా వినాయకుడి పూజ చేస్తుంటాం. అయితే ప్రథమ పూజ కచ్చితంగా వినాయకుడికే చేయాల్సి ఉంటుందని వేద పండితులు చెప్తుంటారు. 🌺



🌺అందుకే పసుపుతో గణపతిని తయారు చేసి… మనం చేసే పూజలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూడమని కోరుకుంటూ ముందుగా పూజ చేసు కుంటాం. అయితే పూజ అయిపోయన తర్వాత పసుపు గణపతిని ఏం చేయాలో చాలా మందికి తెలియదు. కొందరైతే స్నానం చేసే ముందు మొహానికి రాసు కుంటారు. అయితే అలా చేయొచ్చా.. పూజానంతరం పసుపు వినాయకుడిని ఏం చేస్తే మంచిదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


పూజానంతరం పసుపు గణపతిని మనసు నిండా ప్రార్థించాలి... ‘స్వామీ వచ్చే శుభకార్యలు, పూజల్లో మళ్లీ మీ పూజ చేసుకుంటాం… అప్పటి వరకు మమ్మల్ని చల్లగా చూడమని కోరుకుంటూ పసుపు గణపతిని ఉంచిన తమలపాకు తూర్పు దిశగా కదిలించాలి. ఆ తర్వాత మనం చేసుకునే వేరే పూజలు చేసుకోవాలి. అవి కూడా పూర్తైన తర్వాత ఆ హరిద్ర గణపతిని ప్రసాదంగా భావిస్తూ… ఇంట్లోని దేవుడి గదిలో ఉంచుకోవాలి. ఆ తర్వాత అంటే కొన్నాళ్ల తర్వాత మంచి రోజు చూసుకొని పుణ్య స్త్రీలు ఆ పసుపు గణపతిని మొహానికి రాసుకోవాలి. లేదా మంగళ సూత్రాలకు పూసుకోవాలి. కాళ్లు, చేతులు, శరీరం, పాదాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పూసుకోకూడదు. 🌺


🌺అందులోనూ ఎలాంటి మైల లేని రోజుల్లోనే ఆ పసుపు గణపతిని పూసుకోవాల్సి ఉంటుంది. కుదరదు అనుకున్న వారు ఇంట్లోని బావిలో లేదా పచ్చని చెట్ల వద్ద ఉంచి నీళ్లు పోయాల్సి ఉంటుంది. అలా అని తొక్కుడు పడే చోట ఎట్టి పరిస్థితుల్లోనూ పడేయొద్దు. బావిలో నిమజ్జనం చేయడం కూడా చాలా మంచిది. అంతే కాకుండా పుణ్య స్త్రీలు పసుపు గణపతిని ముఖానికి, మంగళ సూత్రాలకు పూసుకోవడం శుభప్రదం. అంతే కాకుండా సౌభాగ్య ప్రదం కూడా.


అందుకే ఇక నుంచి ప్రతీ ఒక్కరూ పసుపు గణపతిని మర్చిపోకుండా మంగళ సూత్రాలు లేదా మొహానికి రాసుకొని స్నానం చేయండి. ఆ స్వామి వారి కృపకు పాత్రులు కండి. వినాయకుడి కృప మనపై ఉంటే మనకొచ్చే ఎన్నో సమస్యలు మన దరి చేరవు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా చూస్తుంటాడు. 🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat