ఆధ్యాత్మికంగా " పంచము - ఐదు " అనే పదానికి ఉన్న ప్రాముఖ్యత - Panchamu and its Importance in Spiritual
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

ఆధ్యాత్మికంగా " పంచము - ఐదు " అనే పదానికి ఉన్న ప్రాముఖ్యత - Panchamu and its Importance in Spiritual

P Madhav Kumar

సనాతన ధర్మంలో ‘ఐదు’ ప్రాముక్యత

మన పురాణాలలో ‘ఐదు’ కు అత్యంత ప్రాముఖ్యత ఉంది. పంచాక్షరీ మంత్రంతో మొదలై పంచభూతాలు, పంచనదులు, పంచయజ్ఞాలు అంటూ ఐదు సంఖ్యతో కూడిన సంగతులు అనేకం!

వాటిలో కొన్ని వివరాలు:

పంచామూర్తులు: శ్రీగణపతి, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, శ్రీపరమశివుడు, శ్రీపార్వతీదేవి, శ్రీచండీకేశ్వరుడు మొదలైన ఐదుగురు మూర్తులను శైవక్షేత్రాలలో పంచామూర్తులుగా పూజిస్తుంటారు.

పంచాయతనం: ఒకే పీఠం పై ఐదుగురు దేవతలను ఆవాహన చేసుకుని పూజించడం.

పంచమాతలు: తన తల్లి, గురువు భార్య, రాజు భార్య, తన భార్య తల్లి (అత్త)లను మాతలుగా భావించి పూజిస్తారు. అందుకే వీరిని పంచమాతలు అనంటారు.

పంచపితృమూర్తులు: జన్మనిచ్చిన తండ్రి, విద్య బోధించిన వ్యక్తి, మంత్రోపదేశం చేసిన వ్యక్తి, అన్నంపెట్టిన వ్యక్తి, భయాన్ని పోగొట్టిన వ్యక్తులను పంచపితృమూర్తులుగా భావిస్తారు.

పంచప్రతిష్ట: పాంచరాత్రాగమాన్ని అనుసరించి ఐదు రకాలైన ప్రతిష్ఠలు జరుగుతుంటాయి.

స్థాపన: నిల్చున్న భంగిమలో చేసే ప్రతిష్ఠ

ఆస్థాపన: కూర్చున్న భంగిమలో చేసే ప్రతిష్ఠ

మైస్థాపన: పడుకున్న భంగిమలో చేసే ప్రతిష్ఠ

పరస్థాపన: వాహనాలపై పలు భంగిమలలో చేసే ప్రతిష్ఠ

ప్రతిష్ఠాపన: షణ్మార్చనతో చేసే ప్రతిష్ఠ

శివపంచాయతనం: మధ్యలో శివలింగాన్ని ప్రతిష్టించి చుట్టూవున్న ప్రదక్షిణంలో సూర్యుడు, వినాయకుడు, అంబిక విష్ణువులను ప్రతిష్టించి పూజించడమే శివ పంచాయతనం.

పంచయజ్ఞాలు: జల్లెడ, రుబ్బురోలు, చీపురు, రోలు, కుండ ఈ ఐదింటిని వాడటంవల్ల పాపం వస్తుంది. వీటి నివారణకు చేసే యజ్ఞాలను పంచమహాయజ్ఞాలనంటారు.

దేవయజ్ఞం: అగ్నితో హోమం చేయడం.

పితృయజ్ఞం: పితృకార్యాలను చేయడం.

భూతయజ్ఞం: జంతువులకు ఆహారాన్ని అందివ్వడం

మానుషయజ్ఞం: విందును ఇవ్వడం

బ్రహ్మయజ్ఞం: రోజూ వేదపఠనం చేయడం

పంచాహోమాలు:

గణపతి హోమం: అనుకున్న కార్యాలు నిర్విఘ్నంగా నెరవేరేందుకై చేసే హోమం.

చండీహోమం: దరిద్రం, భయాలు తొలగేందుకు చేసే హోమం.

నవగ్రహ హోమం: గ్రహదోషం తొలగేందుకు నవగ్రహ హోమం.

సుదర్శన హోమం: సమస్త దోషాలు తొలగేందుకు చేసే హోమం.

రుద్రహోమం: అయుర్ వృద్ధి, ఆరోగ్యం కోసం చేసే హోమం.

పంచయాగాలు:

కర్మయాగం: భగవంతునికి పూజ చేయడం.

తపయాగం: వ్రతం చేయడం.

జపయాగం: మంత్రాలను జపించడం.

ధ్యానయాగం: భగవన్నామాన్ని ధ్యానించడం.

మంత్రయాగం: వేదగ్రంథాలను పఠించడం.

పంచాతాండవం: ఆనందతాండవం, సంధ్యాతాండవం, త్రిపురతాండవం, ఊర్థ్వతాండవం,

ముని తాండవం

పంచనాథ స్థలాలు:

కాశీ – శ్రీవిశ్వనాథుడు

గుజరాత్ – శ్రీసోమనాథుడు

పూరి – శ్రీజగన్నాథుడు

రామేశ్వరం – శ్రీ రామనాథుడు

వైదీశ్వరం – శ్రీవైథీశ్వరుడు

పంచభగవతి స్థలాలు:

కొల్లూరు – మూకాంబిక

వడగరా – లోకాంబిక

పాల్ ఘాట్ – హోమాంబిక

కొడూంగబారు – మహాభగవతి

కన్యాకుమారి – బాలాంబిక

పంచదేవి: దుర్గ, రాధ, లక్ష్మీ, సరస్వతి, సావిత్రిలను పంచదేవిలు అనంటారు.

పంచనదం: దూతపాప, కిరాణానది, ధర్మనది, గంగ, యమునా నదులను కలిపి పంచనదాలంటారు. ప్రస్తుత పంజాబ్ కూడ ఒకప్పుడు పంచనదం అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి ఐదు నదులు ప్రవహిస్తుంటాయి.

పంచపర్వాలు: ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదానాలు.

పంచబ్రహ్మాసనం: భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. దృశ్యమానప్రపంచం వీటి వల్లే ఏర్పడుతోంది.

పంచలింగాలు:

పృథివీలింగం – కంచి

ఆపల్లింగం – జంబుకేశ్వరం

తేజోలింగం – అరుణాచలం

వాయులింగం – శ్రీకాళహస్తి

ఆకాశలింగం – చిదంబరం

పంచవటం: గోదావరి తీరంలో ఉంది. ఇక్కడ ఐదు వటవృక్షాలు (మర్రిచెట్లు) ఉండటంతో పంచవటి అని అన్నారు. ఈ ఐదు మర్రివృక్షాలు గత జన్మలో గంధర్వులు. అగస్త్యుడిని ఎటూ కదలకుండా చేయాలని ప్రయత్నించి, అతని శాపానికి గురై వృక్షాలుగా మారుతారు. శ్రీరామదర్శనంవల్ల శాప విమోచనమవుతుందని చేయుతాడు. ఇక్కడే రావణాసురుడు సీతాదేవిని అపహరించాడు.

పంచాక్షరీ: నమశ్శివాయ అనే ఐదాక్షరాల మంత్రం.

పంచాయతనం: కాశీలోని శివుని విగ్రహం. శివుని ఐదు ఆత్మలు ఐదు ఆయతనాలు – అవి: శాంతి, అతీత శాంతి, పరాపర విద్య, ప్ర్రతిష్ట, నివృత్తి.

పంచపాండవులు: పాండురాజు కుమారులు.

పంచత్రంత్రం: చిన్న పిల్లలకు జీవితమ పట్ల అవగాహన కలిగేందుకు విష్ణుశర్మ రాసిన కథల పుస్తకం.

పంచద్వారక: బద్రీనాథ్, పూరీ, అయోధ్య, ద్వారక, పండరీపురం.

పంచాక్షరీ

ఈశ్వరుని పంచముఖాల నుండి శ్రీశివపంచాక్షరీ మంత్రంలోని ఐదు బీజాక్షరాలు (న – మ – శి – వా – య) అందులో నుండి పంచభూతాలు, వాటి నుండి ఈ సమస్త జగత్తు పుట్టిందని చెబుతారు. అందువల్లనే ఈ లోకాలన్నింటికీ పంచాక్షరీ మహామంత్రం తల్లిగా నిలిచి శుభాలను కలిగిస్తోంది.

ఆసేతు హిమాచలం శివారాధన వ్యాప్తమై ఉన్నది. వేదాలు, పురాణాలు, ఆగమాలు, కావ్యాలు, ధర్మశాస్త్రాలు కూడ శివతత్త్వాన్ని, శివయోగాన్ని బహువిధాలుగా విశదపరిచాయి.

ఓంకారవదనే దేవి ‘వ’ ‘య’ కార భుజద్వయీ ‘శి’కార దేహమధ్యాచ ‘న’ ‘మ’ కార పదద్వయీ పంచాక్షరీ మంత్రానికి ఓంకారం ముఖం వంటిది. ‘వ’కార, ‘య’కారాలు బాహువులు. ‘శి’కారం నడుము అయితే, ‘న’, ‘మ’కారాలు పాదయుగ్మములు.


నమశ్శంభవే చ మయోభవేచ నమశ్శంకరాయ చ

మయస్కరాయ చ నమశ్శివాయ చ శివ తరాయచ


అని నమకంలొ శంభు – శంకర – శివ అంటూ మూడు దివ్యనామాలతో, ఆ పరాత్పరుని కీర్తించాయి. ‘శివయోగం’ సర్వోత్కృష్టమని, శాస్త్రాలు చెప్పడమేకాదు, కాశ్మీరశైవం, శుద్ధ శైవసిద్ధాంతం, వీరశైవం, పాశుపతం, మిత్రశైవం వంటి అనేక సంప్రదాయాలు మన భారతదేసమంతా వ్యాప్తి చెంది ఉన్నాయి.

‘శివ’ శబ్దానికి అనేక నిర్వచనాలున్నాయి. ‘శుభం, క్షేమం, శ్రేయం, మంగళం’ అని కొన్ని అర్థాలు. జాగ్రత్, స్వప్న, సుషుప్తి అవస్థలకు అతీతమైన ధ్యానావస్థలో గోచరించే తురీయతత్త్వమే శివుడు. శాంతమే శివుడు. అదే శివతత్త్వం. అన్నింటికీ ప్రకాశవంతం చేసే మూలచైతన్యమే శివుడు. వశి – శివ సమస్తాన్నీ తన వంశంలో ఉంచుకున్న వాడే సర్వేశ్వరుడు. అతడే ఇచ్ఛా – జ్ఞాన – క్రియా శక్తులతో కూడిన పరమేశ్వరుడు, సర్వ జగత్కారణుడు, ఆ తత్త్వమే ఆయన పంచాముఖాలలో గోచరిస్తుంటుంది.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow