దేవాలయం అంటే లక్షోపలక్షల
భక్తుల పుణ్యధామం. ఆగమశాస్త్రబద్ధంగా దేవాలయాలను నిర్మించవలసి వుంటుంది.
ఆలయనిర్మాణం దేవుడు పడుకున్నట్లు శయనరీతిలో నిర్మిస్తారు. ఆలయ గోపురమే
భగవంతుని పాదాలు. గర్భగుడి భగవంతుని శిరస్సు. ఆలయ మంటపం భగవంతుని కడుపు.
దైవదర్శనం అంటే గుడిలోకి వెళ్ళి స్వామిని చూచి గంటకొట్టి నమస్కరించాలి
అనుకొంటుంటాం. ఆ పద్ధతినే పాతిస్తుంటాం. కాని దూరంగా వుండి కూడా
ఆలయగోపురానికి నమస్కరించినా స్వామి పాదాలకు నమస్కరించినట్లే అవుతుంది.
కాబట్టి ఆలయగోపురం ఎత్తుగా వుండాలి అంతేకాకుండా ..
దేవాలయం ఒక వ్యక్తికీ ఒక కుటుంబానికీ సంబంధించి వుండదు. సార్వజనిక ఆస్థిగా పరిగణింపబడుతూ, పోషింపబడుతూ, రక్షింపబడుతూ, దర్శింపబడుతూ వుండాలి. దాతలేవరైనా దేవాలయానికి దానాదికాలను చేయవచ్చు. పోషకులుగా వుండవచ్చు. వేశ్యలు కూడ దేవాలయాలను కట్టించి దాఖలాలు ఎన్నో వున్నాయి. సర్వజనానీకానికీ, పొరుగువూరివారికీ, పరదేశ వాసులకూ, క్రొత్తగా వచ్చినవారికీ దేవాలయం ఎక్కడ వున్నదో సులభంగా తెలుసుకోవటానికి బాగుటుంది. కాబాట్టి ఆలయగోపురం ఎత్తుగా వుండాలి.
దేవాలయ గోపురమే కాదు దేవాలయం కూడా ఎత్తుమీద వుండటం హితదాయకం. అందుకే ఎన్నో దేవా లయాలు కొండలు గుట్టలు చూచుకొని మరీ నిర్మిస్తారు. ఎందుకంటే, మానవు డెంతటి తెలివికలవాడై ప్రకృతిని జయించగల శక్తివంతుడు కాలేదు! కాలేడు! వరదబీభత్సాల తుఫానులు మొదలైన ప్రకృతి వైపరీత్యాలకు మనిషి భయపడి తీరవలసిందే. అటువంటి ప్రకృతి ప్రళయసమయాలలో ప్రాణాలు కాపాడగల్గిన స్థలం దేవాలయమే!
దేవుడు సర్వోన్నతుడు! ఈ సర్వోన్నత భావం దేవాలయాన్ని దర్శించిన ప్రతిసారీ మనిషికి, మనస్సుకీ బోధపడటానికి దేవాలయాన్నీ దేవాలయగోపురాన్నీ ఎంత వీలైతే అంతగా ఎత్తుకి నిర్మిస్తారు. హిందూదేవాలయాలేకాదు. మసీదుకి కూడా పొడవైన స్తంభం నిర్మిస్తారు. చర్చికి కూడా ముందుభాగంలో ఎత్తుగా దూరానికి కన్పించే విధంగా అంతస్థు నిర్మించి గంటను కడతారు.