సుందరకాండ ఎందుకు చదవాలి ?

P Madhav Kumar

 

సుందరాదిమ సర్గస్థ హనూమద్విక్రమాధికం
శృత్వాపస్మార కుష్ఠాధి
భూతభేతాల నాశనమ్

ఎవరైతే హనుమంతుడి పరాక్రమానికి హేతువైన సీతారాముల ఎడబాటును రూపుమాపి ఆనందాన్ని పంచిన పరమాధ్భుతమైన ఈ సుందరకాండ ని గానీ కనీసం అందులోని మొదటి సర్గని కానీ సుచిగా ఎవరైతే పారాయణం చేస్తారో అట్టి వానికి అన్ని గ్రహ భాధలూ కుష్టు మొదలైన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్మాదం కూడా నశించి కార్య జయము ను చేజిక్కించుకో గల సమర్ధులుగా ఫలమును పొందగలరు.

ఎవరు చదవాలి
ఎవరైనా సరే చదవవచ్చు
ఎలాంటి సమయం లో చదవాలి

శుచిగా ఉన్న రోజుల్లో తలస్నానం చేసి బ్రహ్మచర్యం పాటిస్తూ భూశయన యుక్తులై (రాత్రి పూట నేలపై పడుకోవాలి తప్ప మంచాన్ని వాడకూడదు.) భోజనం కూడా ఒక్కపూటనే పగలు చేయాలి రాత్రికి అల్పాహారం తీసుకోవచ్చు
ప్రాత్హకాలముననే అనగా ఉదయం 6గంటలలోపల దీపారాధన చేసి పూజను ప్రారంభించడం విశేష ఫలహేతువు.
మీరు ఏ కార్యాన్ని తలచి చేస్తున్నారో అది మీ మనసుకి తెలిస్తే చాలు ఆ పారాయణము చేసినన్ని రోజులూ ఎవరితోనూ వాదులాటలకి క్షమాపణలు కి కానీ నోటివెంట రాకుండా ఉంచుకోవాలి.

పెళ్లి కానివారు,
అన్యాయం గాకోర్టు కేసు ల్లో చిక్కినవారు
దంపతుల మధ్య మనస్పర్ధలు ఉండి సఖ్యం లేని వారు
సంతానోత్పత్తి ఆలస్యం అయినవారు.
కార్యాలయంలో వేధింపులకు గురయ్యేవారు
మానసిక ప్రశాంతత ని కోరుకునేవారు…
మీ మీ కోరికలను మనసు లో చెప్పుకోండి చాలు
(స్వామి పటంముందు చెప్పవద్దు)
మీ నమ్మకాన్ని బట్టే ఫలితం ఉంటుంది
నిష్ఠ, సమయపాలన నిజాయితీ తో మనసు పెట్టి చదవండి మీ సమస్య నుకొట్టి అవతల పారేయగల సమర్థతగల కాండ సుందరకాండ అని గుర్తుంచుకుంటే చాలు.

శ్రీరామరక్ష సర్వజగద్రక్ష

 

 

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat