శ్రీకనకధారా స్తోత్రమ్‌ (సువర్గధారా స్తోత్రమ్‌) | Sri kanakadhara Stotram (Suvargadhara StoTram)

P Madhav Kumar

 

శ్రీకనకధారా స్తోత్రమ్‌ (సువర్గధారా స్తోక్రమ్‌)

వందే వందారుమందార మిందిరానందకందలమ్‌
అమందానందసందోహబంధురం సింధురాననమ్‌.
  ఇది గణపతి స్తుతి. భక్తులకు కల్పవృక్షం. లక్ష్మీదేవికి ఆనందాన్నిచ్చే మొలక, అత్యధికమైన ఆనందరాశితో మనోహరుడు అయిన గజముఖునికినమస్కరిస్తున్నాను.

అంగంహరేః పులకభూషణమాశ్రయంతీ భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్‌,
అంగీకృతాఖిలవిభూతిరపాంగలీలా మాంగల్యదా స్తు మమ మంగళదేవతాయాః 1
   లక్ష్మీదేవి కడగంటి చూపు(సాగసు) సకల సంపదలకు నిలయమైంది. మొగ్గలతో అలంకృతమైన చీకటి చెట్టును ఆడుతుమ్మెదవలె ఆచూపు, శ్రీ మహావిష్ణువు శరీరాన్ని ఆశ్రయించి, గగుర్పాటుఅనే ఆభరణాన్ని చేకూరుస్తుంది. అట్టి లక్ష్మీదేవి కదగంటి చూపు నాకు సకల శుభాలను అనుగ్రహించుగాక!

ముగ్దా ముహుర్విదధతీ వదనే మురారేః ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని,
మాలాదృశోర్మధుకరీవ మహోత్పలే యా సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః. 2
   లక్ష్మీదేవి చూపులవరుస గొప్ప నల్లకలువ పైకి ఆడుతుమ్మెదలె శ్రి శ్రీమహా విష్ణువు ముఖంమీదికి ప్రేమతోను, సిగ్గుతోను మాటిమాటికి రాకపోకలు సాగిస్తూ, ముగ్ధమనోహరంగా ఉంది. ఆ చూపుల వరుస నాకు సంపదను ప్రసాదించుగాక!

విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్ష- మానందహేతురధికం మురవిద్విషో౭. పి,
ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థ- మిందీవరోదరసహోదరమిందిరాయాః 3
   లక్ష్మీదేవి కడగంటి చూపు సమస్తమైన దేవేంద్ర వైభవాన్ని అనుగ్రహించడానికి సమర్థమైనట్టిది. శ్రీమహావిష్ణువుకు కూడా అధికమైన ఆనందాన్ని ఇవ్వగలిగినట్టిది. అట్టి ఆచూపు నాపై క్షణకాలం నిల్చుగాక!

ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుంద-మానందకంద మని మేషమనంగతంత్రమ్‌,
ఆకేకరస్థితకనీనికపక్ష క్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః 4
   లక్ష్మీదేవి యొక్క అరవిరిసిన కంటిచూపు సమ్మోహన శక్తి గలిగి, రెప్పపాటు లేనిదై, ఆనందానికి ఆధారమై, సంతోషంతో విష్ణువును పొంది, ఆయనకు పారవశ్యాన్ని కలిగించునట్టిది. అట్టిచూపు నాకు ఐశ్వర్యాన్ని అనుగ్రహించుగాక!

భాహ్వంతరే మురజితః శ్రితకౌస్తుభఖే యాహారావళీవ; హరినీలమయీ విభాతి,
కామప్రదా భగవతో £ పి కటాక్షమాలా కల్యాణమావహతు మే కమలాలయాయాః. 5
   లక్ష్మీదేవి కడగంటి చూపులు (వరుస) కౌస్తుభమణితో ప్రకాశించే విష్ణువు వక్షస్థలం మీద ప్రసరించి, ఇంద్ర నీలమణుల హారాల వలె వెలుగొందుతున్నాయి, ఆయన యొక్క కోరికలను కూడ తీర్చగలిగివున్నాయి. అట్టి చూపులు నాకు శుభం కలిగించుగాక!

కాలాంబుదాళిలలితోరసి కైటభారే - ర్థారాధరే స్ఫురతి యా తటిదంగనేవ,
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తి- ర్బద్రాణి మే దిశతు భార్గవనందనాయాః 6
   కారుమబ్బులో మెరుపుతీగలాగా, నీలమేఘశ్యాముడైన విష్ణువు వక్షస్థలంలో ప్రకాశించే లోకమాత, లక్ష్మీదేవి. ఆమెఅద్భుతరూపం నాకు శుభాలను ప్రసాదించుగాక!

ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్‌మాంగల్యభాజి మధుమాథిని మన్మథేన,
మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్థం మందాలసంచ మకరాలయకన్యకాయాః 7
   సముద్రరాజు కూతురైన లక్ష్మీదేవి యొక్క కడగంటి చూపు తిన్ననై, నెమ్మదై, మధథించే స్వభావం కలిగింది. ఆచూపు ప్రభావంతో మంగళ నిలయుడైన విష్ణువుయొక్క మనస్సులో మొట్టమొదట మన్మథుడు స్టా స్తానం పొందగలిగాడు గదా! అట్టిచూపు ఇక్కడ నామీద 'ప్రసరించుగాక!

దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా మస్మిన్నకించనవిహంగళశిశౌ విషణ్డే,
దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణప్రణయినీనయనాంబువాహః 8
  లక్ష్మీదేవి చూపు అనే మేఘం దయ అనే గాలితో ప్రేరేపింపబడి, ధనం అనే జలధారను పక్షికూనవలె దీనుడనై, దరిద్రుడనైన నాపై కురిపించి, నా పాప తాపాన్ని శాశ్వతంగా దూరం చేయుగాక!

ఇష్టా విశిషుతయో పి నరా యయా ద్రాగ్‌ దృష్టాస్ర్రివిష్ట్టపదం సులభం భజంతే,
దృష్టిఃప్రహృష్టకమలోదరదీప్తిరిష్టాం పుష్టిం కృషీష్ణ్ట మమ పుష్కరవిష్టరాయాః. 9
   కమలాసన అయిన లక్ష్మీదేవి యొక్క చూపు, వికసించిన కమలంమధ్య ఉన్న కాంతి కలిగినట్టిది. ఆ చూపు సోకిన మానవులు యజ్ఞయాగాది క్రతువులు చేయని వారైనా, వెంటనే సులభంగా స్వర్గసుఖాలను అనుభవింపగలరు. అట్టి లక్ష్మీదేవి చూపు నాకు కోరిన సంపదను ప్రసాదించుగాక!

గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్ల భేతి,
సృష్టిస్థితి ప్రళయ కేళిషు సంస్థితా యా తస్యై సమస్త్రిభువనైకగురో, స్తరుత్యె. 10
  సృష్టి-స్థితి-ప్రళభయ క్రీడలలో బ్రహ్మభార్యయైన సరస్వతిగా, విష్ణువు భార్య అయిన లక్ష్మీదేవిగా, శక్తి స్వరూపిణి అయిన శివుని భార్య పార్వతీదేవిగా ఎవరున్నారో, ముల్లోకాల ఏకైక అధిపతికి భార్యయైన ఆమెకు నమస్కారము. 

శృత్యై నమో౭_స్తు శుభకర్మఫల ప్రసూత్రై రత్యై నమో స్తు రమణీయగుణార్ణ వాయె,
శక్ష్యై నమో౭_స్తు శతపత్రనికేతనాయైపుష్ట్ట్యై  నమోస్తు పురుషోత్తమవల్లభాయై. 11
   సత్మర్మ ఫలాలను ప్రసాదించే శ్రుతి (వేద) స్వరూప లక్ష్మికి నమస్మారము. మనోహరమైన గుణాలకు సముద్రం వంటిదైన రతి (సంతోష) స్వరూప లక్ష్మికి నమస్కారము. నూరురేకుల పద్మమే నివాసస్థానమైన శక్తి (సహస్రార) స్వరూపలక్ష్మికి నమస్కారము. పురుషోత్తముని భార్య అయిన పుష్టి (పూర్ణ-నిండైన) స్వరూపలక్షికి నమస్కారము.

నమో౭. స్తు నాళీకనిభాననాయై నమో స్తు దుగ్జోదధిజన్మభూమై,
నమో౭_స్తు సోమామృతసోదరాయై నమో స్తు నారాయణవల్లభాయై. 12
  పద్మంతో సమానమైన ముఖం కలిగినట్టిది, పాల సముద్రమే జన్మభూమి అయినట్టిదీ, చంద్రునికి -అమృతానికి తోడ బుట్టినట్టిదీ, విష్ణువుకు భార్య అయినట్టిదీ అగు లక్ష్మీదేవికి నమస్కారము.

నమో౭_స్తు హేమాంబుజపీఠికాయై నమో స్తు భూమండలనాయికాయై,
నమో౭_స్తు దేవాదిదయాపరాయె నమోస్తు స్తు శార్ణాయుధవల్లభాయె. 13
  బంగారు తామరయే సింహాసనంగా, భామందలానికి మహారాణిగా, కొలువుదీరి దేవతలు మొదలైన వారిని దయజూచునట్టి శార్లధన్వుని (విష్ణువు యొక్క) భార్యయైన లక్ష్మీదేవికి నమస్కారము.

నమో౭_స్తు దేవై వ్యై భృగునందనాయై నమోస్తు విష్టోరురసి స్టి స్టితాయై,
నమో౭_స్తు లక్ష్మ్యై కమలాలయాయై నమోస్తు స్తు దామోదరవల్లభాయై. 14
  భృగు మహర్షి పుత్రికయై, విష్ణువు వక్షస్థలంలో నిలిచినదై, కమల నివాసినియై, విష్ణుపత్ని అయిన లక్ష్మీదెవికి నమస్కారము.

నమో౭_స్తు కాంత్యై కమలేక్షణాయై నమో స్తు భూత్యై భువనప్రసూత్యై,
నమో౭-స్తు దేవాదిభిరర్చితాయై , నమోస్తు నందాత్మజవల్లభాయై 15
  కమలాలవంటి కన్నులుగలిగి, కాంతి స్వరూపిణియై, లోకాలను సృష్టించి, ఐశ్వర్య స్వరూపిణియై, దేవతలు మున్నగు వారిచేత పూజితురాలై, కృష్ణుని భార్య రుక్కిణియై ఉన్న లక్ష్మీదేవికి నమస్మారము.

సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాననిరతాని సరోరుహాక్ష్మి
త్వద్వందనాని దురితాహరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు మాన్యే. 16
   పూజనీయురాలవైన ఓతల్లీ! కమలాక్షీ! నీకు చేసే వందనాలు సంపదలను ప్రసాదిస్తాయి; సకల-ఇంద్రియాలకు సంతోషాన్ని (సుఖాన్ని కలిగిస్తాయి, సామ్రాజ్యాన్ని (చక్రవర్తిత్వాన్ని) ఇవ్వడంలో ఆసక్తి కలిగి వుంటాయి; పాపాలను పూర్తిగా తొలగించటానికి పూనుకొని వుంటాయి. అట్టి వందనాలు ఎల్లప్పుడు నన్ను ధన్యుని చేస్తూనే ఉండుగాక! అంటే-నేను ఎప్పుడూ నీకు నమస్కరిస్తూ ధన్యుణ్ణి అగుదును గాక! అని భావం.

యత్కటాక్షసముపాసనావిధిః సేవకస్య సకలార్థసంపదః,
సంతనోతి వచనాంగమానసై- స్త్వాం మురారిహృదయేశ్వరీం భజే. 17
  విష్ణువు యొక్క హృదయేశ్వరివైన ఓ దేవీ! నీ కడగంటి చూపు కొజకు చేసే ఉపాసనాకార్యం, భక్తునికి సకల సంపదలను సమకూరుస్తుంది. అందువల్ల మనోవాక్‌ కాయకర్మల ద్వారా (త్రికరణశుద్ధిగా) నిన్ను పూజిస్తున్నాను.

సరసిజనయనే సరోజహస్తే ధవళతమాంశుకగంధమాల్యశోభే,
భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్‌. 18
  పూజ్యురాలవైన ఓ లక్ష్మీదేవీ! కమల నయనా! కమలహస్తా! మిక్కిలి తెల్లనైన వస్త్రాలతో, గంధమాల్యాలతో ప్రకాశించు దానా! మనోహర స్వరూపా! ముల్లోకాలకు సంపదలను ప్రసాదించుదానా! నన్ను అనుగ్రహించు.

దిగ్ఘస్తిఖిః కనకకుంభముభఖావసృష్ట- స్వర్వాహినీవిమలచారుజలప్లుతాంగీమ్‌,
ప్రాతర్నమామి జగతాంజననీమశేష-లోకాధినాథగృహిణీమమృతాబ్ధిపుత్రీమ్‌. 19
  దిగ్గజాలు బంగారు కలశాలతో ఆకాశగంగా జలాన్ని తెచ్చి అభిషేకించగా, ఆ నిర్మలమైన-మనోహరమైన జలంతో తడిసిన శరీరం కలిగిన జగజ్ఞనని, సమస్తలోకాలకు అధిపతి అయిన విష్ణువు యొక్క ధర్మపల్నిి అమృత సముద్ర పుత్రి అయిన లక్ష్మీదేవికి ప్రాతఃకాలంలో నమస్కరిస్తున్నాను.

కమలే కమలాక్షవల్లభే త్వం కరుణాపూరతరంగితైరపాంగైః,
అవలోకయ మామకించనానాం ప్రథమం పాత్ర మకృత్రిమం దయాయాః. 20
  విష్ణుపత్నివైన ఓ లక్ష్మీదేవీ! నేను బీదవారిలో ప్రథముణ్ణి! నీదయకు కపటంలేని తగిన పాత్రుడను. అందువల్ల నన్ను దయారసంతో ఉప్పొంగిన నీ కడగంటి చూపులతో చూడు.

స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం రమామ్‌,
గుణాధికా గురుతర భాగ్యభాగినో భవంతి తే భువి బుధభావితాశయాః. 21
  వేదస్వరూపిణి, త్రిలోకమాత అయిన లక్ష్మీదేవిని ఈ స్తుతులతో ప్రతిదినం ఎవరు స్తుతిస్తారో, వారు అధిక గుణవంతులవుతారు, అధిక సంపన్నులవుతారు, ఈ లోకంలో విద్వాంసుల ప్రశంసలను అందుకుంటారు.

సువర్ణధారాసోత్రం యచ్చంకరాచార్యనిర్మితమ్‌,
త్రిసంధ్యం యఃపరఠేన్నిత్యం స కుబేరసమో భవేత్‌. 22
  శంకరాచార్యులు రచించిన ఈ కనకధారా స్తోత్రాన్ని ప్రతిదినం మూడు సంధ్యలలో ఏవ్యక్తి పారాయణం చేస్తాడో ఆ వ్యక్తి కుబేరునితో సమానుడౌతాడు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat