🔱 శబరిమల వనయాత్ర - 16 ⚜️ కరిమల ఎక్కుట కష్టము అయ్యప్పా ⚜️

P Madhav Kumar


⚜️ కరిమల ఎక్కుట కష్టము అయ్యప్పా ⚜️


పలుకొండలను దాటియే శబరిగిరి చేరుకొనవలెనన్న నిబంధన ప్రకారము కరిమల శిఖరము దాటునప్పుడు ఉన్న కష్టము మిగిలిన శిఖరములు దాటువేళ ఉండదనియే సాధారణముగా అయ్యప్ప భక్తుల అభిప్రాయము. కరిమల ఎక్కుట కష్టము అయ్యప్ప - తోడుగ నిలిచి దాటించు అయ్యప్ప అని పలుకని వారు శబరిగిరి యాత్రీకుల యందు ఉందురా అని సంశయము కలుగును. అంతటి కష్టతరమైన శిఖరమని కూడా అందురు.


ఈ కరిమల శిఖరము దాటువేళ వ్రతానుష్టానలోపముల యొక్క ఫలములు ఎవరికి వారికే అనుభవములోనికి వచ్చును కాన ఈ శిఖరము దాటునంత వరకూ భయముగానే ఉండును. ఈ శిఖరము యొక్క మట్టి నల్లగా ఉండుటచేత దీనికి కరిమల (నల్లటికొండ) అన్న పేరు వచ్చి ఉండవచ్చును. ఈ శిఖరాగ్రముపై తావళమేర్పరచుకొని నివసించు అయ్యప్పస్వాముల సంఖ్యను లెక్కింపజాలము. వ్యాపారస్తులు గూడా అట్లే అధిక సంఖ్యలో ఉందురు. ఇచ్చట విశేషమైన మహిమాన్వితమైన ఒక బావియూ , ఒక కోనేరునూ కలదు. ఇంతటి మిక్కిలి ఎత్తును , భయమును కలుగజేయు ఈ శిఖరాగ్రమున అటువంటి బావియూ , కోనేరును చూచు ఎవ్వరికైననూ ఇందునుండి నీళ్ళు దొరకవు అను అభిప్రాయము కలుగును. భక్తితో శరణాలు పలికి బొరుగులు చల్లి నమస్కరించినచో అచ్చటి నుండి స్వల్పమైన జలము ఊరును. కొందరు అయ్యప్ప భక్తులు అట్లు బొరుగులు చల్లి సహనముతో ఆ జలము ఊరువరకూ వేచియుండి దానిని తీర్ధముగా స్వీకరింతురు.


🙏🪷ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌻🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat