*గుడిలో పూజ చేసేటప్పుడు పురుషులు చొక్కా ఎందుకు ధరించకూడదు*

P Madhav Kumar

హిందూ సంప్రదాయాల ప్రకారం గుడికి వెళ్లడం.దేవుడికి పూజలు చేయడం అందరికీ తెలిసన విషయమే.

అంతే కాకుండా పండుగలు, పబ్బాలు, పూజలు, వ్రతాలప్పుడు కూడా మనమంతా దేవుడిని మెప్పించేందుకు ఎంతగానో ప్రయత్నిస్తుంటాం.అయితే ఈ క్రమంలోనే మనం ఎన్నెన్నో ఆచారాలు పాటిస్తూ ఉంటాం.

షర్టు వేసుకోకూడదని చెబుతుంటారు.అంతే కాదు చాలా ఆలయాల్లో పురుషులకు చొక్కా ఉంటే గర్భగుడిలోకి రానివ్వరు.

అయితే దేవుడికి పూజలు చేసేటప్పుడు పురుషులు 

అసలు దేవాలయ ప్రవేశం చేసే పురుషులు ఛాతీ భాగంలో వస్త్రాలు ఎందుకు ధరించకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.పురుషులు పూజ చేసేటప్పుడు లేదా ఆలయాల్లోకి వెళ్లేటప్పుడు ఛాతీ భాగంలో వస్త్రం ధరించకూడదని మన పెద్దలు చెబుతుంటారు. కొన్ని దేవాలయాల్లో ఈ ఆచారం తప్పని సరిగా పాటించబడుతోంది.ఆలయంలోకి ప్రవేశించే భక్తుడు భగవంతుడి కృప తనపై ప్రసరించాలని కోరుకుంటాడు.


దేవుని ముందు చేతులు జోడించి నిలచిన భక్తునిపై దేవుడి కృప ప్రవేశిస్తుందని భక్తుల నమ్మకం.ఇది మానసికి భావనే కాక శారీరక భావన కూడా.


విగ్రహంలోని ప్రతీ భాగం నుండి వెలువడుతున్న శక్తి కిరణాలు భక్తుడిలో నేరుగా ప్రవేశిస్తాయి.కావున నడుము నుంచి తలభాగం వరకు నగ్నంగా ఉండాలని పెద్దలు సూచిస్తారు.


దేవాలయంలోని దేవతా విగ్రహాన్ని దర్శించబోయే బక్తుడు తడి మడి బట్టను కట్టుకొని ఉండటం వల్ల భగవత్ కటాక్షం ఇంకా ఎక్కువగా ఉంటుంది.కానీ స్త్రీలకు ఈ నియమం వర్తించదు.


స్త్రీ యొక్క మాతృత్వాన్ని ఎంతో గౌరవేచే భారతీయులు వారికి ఇబ్బందిని కల్గించే ఈ ఆచారాన్ని పాటించమని చెప్పలేదు.అలాగే సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో స్నానం తర్వాత మన దేహాన్ని సూర్య కిరణాలలో ఉండే డి విటమిన్ శరీరానికి పుష్కలంగా లభిస్తుంది.

పై వస్త్రాన్ని ధరించకుండా దేవాలయంలోకి ప్రవేశించాలని చెప్పడం జరిగింది.


 *ఓం నమో నారాయణాయ🙏*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat