Eruvaka Pournami : ఏరువాక పౌర్ణమి అంటే ఏమిటి..? ఎందుకంత ప్రాముఖ్యత

P Madhav Kumar

 


హిందూ మత విశ్వాసాల ప్రకారం, వ్యవసాయ పనులు ప్రారంభించడానికి ముందు రైతులందరూ(raitu) తమ పొలాల్లో భూమి పూజను(bhoomi pooja) చేస్తారు. ఇది అనాది కాలం నుంచి వస్తున్న ఆచారం. ఈ సమయంలో తమ పొలాల్లో ఎద్దులతో నాగలితో దుక్కి దున్నడాన్ని ‘ఏరువాక’ (Eruvaka )అంటారు. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభమని చెబుతారు. ఈ వేడుకను శాస్త్ర పరంగా ప్రారంభిస్తారు . ఈ పర్వదినాన వ్వవసాయ పనులు ప్రారంభించడం అని అర్థం. ఈ సందర్భంగా ఏరువాక పున్నమి (Eruvaka Pournami )రోజునే వ్యవసాయ పనులను ఎందుకు ప్రారంభిస్తారు..


జ్యోతిష్యశాస్త్రం ప్రకారం(jyothishayam), జ్యేష్ఠ నక్షత్రం వేళ నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి రోజుగా భావిస్తారు. అందుకే వర్ష బుుతువు(varsha ruthuv) ప్రారంభం కాగానే, రైతులు(farmer) ఉదయమే ఎడ్లను(cow) శుభ్రం చేసి, వాటి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు, పూలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలతో పూజిస్తారు. అనంతరం కాడెద్దులకు(Cattle) ప్రత్యేక పూజలు నిర్వహించి బొబ్బట్లు తినిపీయ‌డం. పొలానికి వెళ్లి భూమాతకు ఆరాధిస్తారు. అలాగే ఏరువాక పున్నమి రోజున((Eruvaka Pournami )) సాయంకాలం వేళ రంగు రంగుల బట్టలతో ఎడ్లను అలంకరించి, డప్పులు, మేళతాళాలతో ఊరేగించ‌డం. అనంతరం ఎడ్లు అంటు రోగాల బారిన పడకుండా వాటికి ఆయుర్వేద మందులను, నూనెలను తాగిస్తారు.

తొలిసారి పొలాన్ని ఏరువాక పౌర్ణమి రోజే ఎందుకు దున్నుతారు..?

ఔషధులకి, సస్యానికి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రానికి చేరువలో ఉన్న తరుణంలో ఏరువాక పూర్ణిమ (Eruvaka Pournami )శుభ ఫలితాలను అందిస్తాడని ప్ర‌జ‌లు నమ్ముతారు. అందుకే జ్యేష్ఠ పూర్ణిమ నాడు మొదటిసారి పొలాన్ని దున్నుతారు. ఏరువాక పూర్ణిమను సీతాయజ్ఞం అని సంస్కృతంలో ఉద్వృషభ యజ్ఞం అని, కన్నడంలో కారణి పబ్బం అని పండుగ‌ను జరుపుకుంటారు.


వేద‌కాలంలో ఎలా ప్ర‌స్తావించారు..?

వేద కాలంలో ప్రతి పనిని యజ్ఞంగానే భావించేవార‌ట‌. ప్రాచీనకాలం నుంచి జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పూర్ణిమగా వ్యవహరిస్తున్నారు. అధర్వణ‌వేదం ఏరువాకను ‘అనడుత్సవంస‌గా చెప్పార‌ని. క్షేత్రపాలకుని మంత్రాలతో స్తుతించి నాగలితో భూమిని దున్ని విత్తనాన్ని చల్లడం వంటి పద్ధతులను ఆచరించేవార‌ట‌. ఆ తర్వాతి కాలంలో పరాశరుడు, బోధాయనుడు మొదలైన మహర్షులు తమ గుహ్య సూత్రాల్లో ఈ పండుగ గురించి ప్రస్తావించార‌ని పురాణాల‌లో చెప్ప‌బ‌డింది.

విష్ణు పురాణంలో ఏరువాక గురించి ప్రస్తావించబడింది ..?

విష్ణు పురాణంలో సీతాయజ్ఞంగా ఏరువాక గురించి ప్రస్తావించబడింది. ఇందులో సీత అంటే నాగలి అని అర్థం. ‘వప్ప మంగళ దివసం’.. ‘బీజవాపన మంగళ దివసం’…’వాహణ పుణ్ణాహ మంగళమ్‌’…’కర్షణ పుణ్యాహ మంగళమ్‌..’ అనే పేర్లతో ఈ పండుగను వైభవంగా జరుపుకునేవార‌ట‌. శుద్ధోదనమహారాజు ఆనాడు కపిలవస్తులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకు అందించినట్లుగా శాస్త్రాలలో వివరించబడింది. హాలుడు రాసిన గాథాసప్తశతిలో ఏరువాక గురించి అనేక కథలు ప్రాచుర్యంలో కూడా ఉన్నాయి. తెలుగు పండుగల్లో సాహిత్యధారాలున్న కొన్ని వేల సంవత్సరాల అతి ప్రాచీన పండుగ. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కూడా ఏరువాక సందర్భంగా రైతన్నల ప్రస్తావన ఈ కాలంలోనే వచ్చింది. ఏరువాక పున్నమి రోజున రైతులందరూ ఊరి బయటకు వెళ్లి చెర్నాకోలతో తోరాలను కట్టి, ఎవరికి దొరికిన నారను వారు తీసుకొచ్చి ఎడ్ల మెడలో కట్ట‌డం. ఈ విధంగా చేయడం వల్ల పంట పొలాలు బాగా పండుతాయని, పశు సంపద పెరుగుతుందని నమ్ముతారు.

ఏరువాక పౌర్ణ‌మి అంటే ఏమిటి…

ఏరువాక పౌర్ణమి రైతులకు సంబంధించిన అతిపెద్ద పండగ. దీనినే జ్యేష్ట పౌర్ణమి అంటారు. తొలకరి ఆసన్నమవగా దున్నడానికి సిద్ధంగా ఉన్న పంటపొలాన్ని శుద్ధి చేసుకుని సేద్యం మొదలుపెట్టే ఉత్సవాన్ని ఏరువాక పున్నమి అంటారు. ఏరుపొంగి పొర్లడానికి చేసే పూజ అని కూడా అంటారు.ఈరోజున భూమిని, పశువులను, సేద్యానికి అవసరమైన పనిముట్లను పూజించే పండగ ఇది. ప్రకృతిని పూజించే పండగే ఏరువాక పున్నమి. అయితే జ్యేష్ట మాసంలో భూమిని ఎక్కువగా తవ్వకూడదని చెబుతారు. భూమి వేడెక్కి ఉన్నప్పుడు తవ్వడం వల్ల అందులో నుంచి విష వాయువులు వెలువడతాయని నమ్మకం. కేవలం పూజ కోసం మాత్రమే కొంచెం దున్నుతారు. వర్షం పడగానే తిరిగి సేద్యపు పనులు ప్రారంభిస్తారు రైతులు.

ఏరువాక పౌర్ణమి రోజున పశువులకు స్నానం చేయిస్తారు. వాటి గిట్లకు పూజ చేస్తారు. గోమాతకు పూజ చేస్తారు. నాగళ్లను దున్నేందుకు కష్టపెడుతున్నందున క్షమించి కరుణించమని అన్నదాత వాటికి పూజ చేస్తాడు. ఆహారం పండించేందుకు సహకరించాలని కోరుతాడు.బెల్లం, బియ్యం, ఆవుపాలతో పులగం వండి పశువులకు ఆహారంగా పెడతారు. రైతులు ఏరువాక పున్నమి పాటలు పాడుకుంటారు.అలాగే సేద్యానికి అవసరమైన పరికరాలన్నింటికీ పూజ చేస్తారు. నాగలి, కర్రు, గొర్రు, పార, ఆకురాయి వంటి వాటికి పూజ

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat