🌿🌼🙏ఆంధ్రప్రదేశ్ లోని పంచారామ క్షేత్రాలలో ఒకటి శ్రీ ద్రాక్షారామ దేవాలయం. ఇక్కడ పరమేశ్వరుడు శ్రీ భీమేశ్వర స్వామిగా కొలువై పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయంలో ఒక మహిమాన్వితమైన స్థంభం ఉంది. ఆ స్థంభం పై ఒక మహా సర్పాకృతి చెక్కబడి ఉంటుంది. దీనిని సర్ప స్థంభం లేదా నాగ స్థంభం అంటారు. 🙏🌼🌿
🌿🌼🙏 ఈ స్థంభం బాగా చీకటిగా ఉండే ప్రదేశంలో ఉండటం వలన చాలా మందికి అసలు ఈ స్థంభం గురించి తెలియదు. ఈ స్థంభ ప్రతిష్ట సమయంలో, శంకుస్థాపన చేసేప్పుడు మహామహిమాన్వితమైన నాగ యంత్ర ప్రతిష్టలు, జరిగాయని దానివల్ల ఈ స్థంభం తాకిన వారికి, స్థంభం పక్క ఇరుకు ప్రాంతంలో నుంచి బయటికి వచ్చిన వారికి, సర్పాన్ని పై నుంచి కిందకి తాకిన వారికి స్థంభం నుంచి వచ్చే వైబ్రేషన్స్ వల్ల సర్ప దోష నివారణ, మనసుకి ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని చారిత్రాత్మక కథనం. నాగ సర్ప స్థంభాన్ని మీరు దర్శించుకున్నారా 🙏🌼🌿
🌿🌼🙏అందరం భక్తితో " ఓం నమో భగవతే నాగరాజాయ " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం ... ఎంత ఆర్తితో స్మరిస్తే అంత త్వరగా అనుగ్రహిస్తాడు ఆ భగవంతుడు🙏🌼🌿
ఓం నమో భగవతే నాగరాజాయ🕉🙏
సేకరణ:-
🍁#శుభమస్తు🍁
సర్వేజనా సుఖినోభవంతు