మూలధారం గుదస్థానం, స్వాధిష్ఠానం తు మేహనం
నాభిస్తు మణి పూరాఖ్యం హృదయాబ్జ మనాహతం
తాలుమూలం విశుద్ధాఖ్యం ఆజ్ఞాఖ్యం నిటలాంబుజం
సహస్రారం బ్రహ్మరంధ్ర ఇత్యగమ విదో విదుః
- వీటిని ఊర్థ్వలోక సప్తకమంటారు.
7. సహస్రారం – సత్యలోకం – ప్రమాతస్థానం
6. ఆజ్ఞాచక్ర – తపోలోకం – జీవాత్మస్థానం
5. విశుద్ధ చక్రం- జనలోకం – ఆకాశభూతస్థానం
4. అనాహతం – మహర్లోకం – వాయుభూతస్థానం
3. మణిపూరకం – సువర్లోకం – అగ్నిభూతస్థానం
2. స్వాధిష్ఠానం – భువర్లోకం – జలభూతస్థానం
1. ఆధారము – భూలోకం – పృథ్వీభూతస్థానం
1. మూలాధారచక్రం : మలరంధ్రానికి సుమారురెండంగుళాల పై భాగంలో ఉంటుంది. దీని రంగు ఎఱ్ఱగా (రక్తస్వర్ణం) ఉంటుంది. నాలుగురేకులుగల తామరపూవాకారంలో ఉంటుంది. దీనికి అధిపతి గణపతి; వాహనం – ఏనుగు. బీజాక్షరాలు వం – శం – షం అనేవి.
2. స్వాధిష్ఠాన చక్రం : ఇది జననేంద్రియం వెనుక భాగాన, వెన్నెముకలో ఉంటుంది. అధినేత బ్రహ్మతత్త్వం. జలం – సింధూరవర్ణంలో ఉంటుంది. ఆరురేకుల పద్మాకారంలో ఉంటుంది. దీనికి అక్షరాలు బం – భం – యం – యం – రం – లం. వాహనం మకరం.
3. మణిపూరక చక్రం : బొడ్డునకు మూలంలో వెన్నెముక యందుటుంది. దానికి అధిపతి విష్ణువు. పదిరేకుల పద్మాకారంలో ఉంటుంది. బంగారపు వర్ణంతో ఉంటుంది. అక్షరాలు డం – ఢం – ణం – తం – థం – దం – ధం – నం – పం. వాహనం కప్ప.
4. అనాహత చక్రం : ఇది హృదయం వెనుక వెన్నెముకలో ఉంటుంది. దీనికధిదేవత రుద్రుడు. నీలం రంగులో ఉంటుంది. పన్నేందురేకుల తామరపూవులవలె ఉంటుంది. అక్షరాలు కం – ఖం – గం – ఘం – జ్ఞం – చం – ఛం – జం – ఝం- ణం – టం – ఠం. తత్త్వం వాయువు. వాహనం లేడి.
5. విశుద్ధచక్రం : ఇది కంఠము యొక్క ముడియందుంటుంది. దీనికధిపతి జీవుడు. నలుపురంగు. అక్షరాలు అం – ఆం – ఇం – ఈం – ఉం – ఊం – ఋం – ౠం – ఏం – ఆఇం – ఓం – ఔం – అం – అః. తత్త్వమాకాశం – వాహనం ఏనుగు.
6. ఆజ్ఞాచక్రం : ఇది రెండు కనుబొమ్మల మధ్యలో భ్రుకుటి స్థానంలో ఉంటుంది. దీని కధిపతి ఈశ్వరుడు. తెలుపురంగు. రెండు దళాలు గల పద్మాకారంగా ఉంటుంది. అక్షరాలు హం – క్షం.
7. సహస్రారం : ఇది కపాలం పై భాగంలో మనం మాడు అని పిలిచే చోట ఉంటుంది. దీనినే బ్రహ్మరంధ్రమంటాం. దీని కధిపతి పరమేశ్వరుడు. వేయిరేకుల పద్మాకృతితో ఉంటుంది. సుషుమ్నానాడి పై కొనమీద ఈ చక్రం ఉంటుంది. అక్షరాలు – విసర్గలు. దీనికి ఫలం ముక్తి.